Swetha
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన చిత్రం టిల్లు స్క్వేర్. థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీ.. ఓటీటీలోకి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకు ఇది ఎప్పుడు రావొచ్చు అంటే..?
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన చిత్రం టిల్లు స్క్వేర్. థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీ.. ఓటీటీలోకి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకు ఇది ఎప్పుడు రావొచ్చు అంటే..?
Swetha
డీజే టిల్లుతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సిద్దు జొన్నల గడ్డ.. దీని రీమేక్ టిల్లు స్క్వేర్‌తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి దుమ్మురేపుతున్నాడు. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా మార్చికి జరిగింది. మార్చి 29 నుండి థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ మూవీపై తొలి నుండి అంచనాలు ఉండగా.. వాటికి ఏ మాత్రం తీసిపోలేదు టిల్లు స్క్వేర్. సిద్దు మాడ్యులేషన్, అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ ఫోజులతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 91 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఆశించినట్లుగానే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. మీడియా సోషల్ మీడియాలో టిల్లు హావ కొనసాగుతూనే ఉంది. అయితే, ఈ సినిమా ఊహించిన దానికంటే ముందే ఓటీటీ లోకి రానుందని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు రాబోతుందో చూసేద్దాం.
అవుట్ అండ్ అవుట్ కామెడీ, సిద్దు జొన్నలగడ్డ డ్రెస్సింగ్ స్టైల్, మాటల తూటాలు, అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ సీన్స్ వెరసి మూవీను హిట్ ట్రాక్ ఎక్కించాయి. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించిన టిల్లు స్క్వేర్ చిత్రానికి రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల, అచ్చు మ్యూజిక్ అందించారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన టిల్లు స్క్వేర్ ఓటీటీలోకి వచ్చేయనుంది. ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. భారీ రేటుకు దీని హక్కులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వంద కోట్ల క్లబ్ లో చేరింది కాబట్టి ఇంత త్వరగా ఓటీటీ లోకి త్వరగా స్ట్రీమింగ్ చేయనున్నారా లేదంటే.. మరేదైనా కారణమో తెలియదు కానీ.. ఈ సినిమాను మాత్రం అనుకున్న దానికంటే ముందే ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారనే వార్తలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి.
టిల్లు స్క్వేర్ కూడా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేయనుందని సమాచారం. ఏప్రిల్ 26 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మార్చి 29న విడుదలైన ఈ చిత్రం.. నెల తిరగకుండానే వచ్చేస్తున్నట్లు. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఓటీటీ రిలీజ్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఈ సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ లేదా ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుండి రావాల్సిందే. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. థియేటర్ లోనే రచ్చ చేసిన ఈ సినిమా ఇంకా ఓటీటీ లోకి వస్తే .. ఇక్కడ కూడా సునామి సృష్టిస్తుందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.