iDreamPost
android-app
ios-app

Devara: దేవర OTTపై క్రేజీ న్యూస్.. ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?

  • Published Sep 25, 2024 | 3:47 PM Updated Updated Sep 25, 2024 | 3:47 PM

Devara OTT Update: దేవర ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి దేవర ఏ ఓటీటీలో, ఎన్ని రోజుల తర్వాత స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Devara OTT Update: దేవర ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి దేవర ఏ ఓటీటీలో, ఎన్ని రోజుల తర్వాత స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Sep 25, 2024 | 3:47 PMUpdated Sep 25, 2024 | 3:47 PM
Devara: దేవర OTTపై క్రేజీ న్యూస్.. ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?

దేవర.. దేవర.. ప్రస్తుతం ఇండియా సినిమా ఇండస్ట్రీ మెుత్తం ఈ సినిమా జపమే చేస్తుంది. భారీ అంచనాలతో సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు కాదు.. అంతకు మించి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెళ్తున్నాడు తారక్. డైరెక్టర్ కొరటాల శివ ఏ రేంజ్ లో యంగ్ టైగర్ తో ఊచకోత కోయించాడో.. రెండు ట్రైలర్స్ చూస్తేనే తెలుస్తుంది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. దేవర ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి దేవర ఏ ఓటీటీలో, ఎన్ని రోజుల తర్వాత స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

దేవర మూవీ రిలీజ్ కాకముందే.. ఓటీటీకి సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దేవర ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఊహించని రేట్ కు ఈ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే దేవర ఓటీటీ స్ట్రీమింగ్ లో ఓ ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన నెల రోజుల గ్యాప్ లో మూవీస్ స్ట్రీమింగ్ కు వస్తాయి. కానీ.. దేవర విషయంలో అలా జరగదట. మూవీ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ కు వచ్చే విధంగా  అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే దేవరను ఓటీటీలో చూడాలంటే 50  రోజులు ఆగాల్సిందే అన్నమాట. ఇక ఈ విషయం కాస్త తెలియడంతో.. ఫ్యాన్స్ నిరాశకు లోనౌతున్నారు.

ఇదిలా ఉండగా.. దేవర మూవీపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. క్లైమాక్స్ లో చివరి 5 నిమిషాలు థియేటర్లలో విధ్వంసమే అని తారక్ చెప్పినప్పటి నుంచి.. ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోయింది. సింహాద్రి తర్వాత మళ్లీ ఆ రేంజ్ కి మించిన ఊచకోత దేవరలో ఉంటుందని ట్రైలర్లు చూస్తేనే తెలుస్తోంది. తారక్ మాస్ క్రేజ్ కు గత రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ లో దేవర ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. రిలీజ్ కు ముందే అక్కడ అరుదైన ఘనతను సాధించింది. దాంతో విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందా? అని ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ న్యూస్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom