iDreamPost
android-app
ios-app

OTT Movies: ఈ వారం ఓటీటీలో డజనుకుపైగా డబ్బింగ్‌ సినిమాలు!

ప్రతీ వారం లాగే ఈ వారం కూడా పలు భాషలకు చెందిన సినిమాలు పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో స్ట్రీమింగ్‌ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా వారం డబ్బింగ్‌ సినిమాలు సందడి చేస్తున్నాయి.

ప్రతీ వారం లాగే ఈ వారం కూడా పలు భాషలకు చెందిన సినిమాలు పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో స్ట్రీమింగ్‌ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా వారం డబ్బింగ్‌ సినిమాలు సందడి చేస్తున్నాయి.

OTT Movies: ఈ వారం ఓటీటీలో డజనుకుపైగా డబ్బింగ్‌ సినిమాలు!

ప్రపంచ వ్యాప్తంగా సినిమా అంటే థియేటర్‌ అన్న కల్చర్‌ కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తోంది. కరోనా కారణంగా సినిమా ప్రేక్షకుల ఆసక్తుల్లో, ఆలోచనల్లో పెను మార్పులు వచ్చాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికి పరిమితమైన జనాలు.. ఓటీటీలకు అతుక్కుపోయారు. ఇష్టం వచ్చినట్లు సినిమాలు చూడ్డం మొదలుపెట్టారు. అలా కేవలం మాతృ భాషకు చెందిన సినిమాలే కాక ఇతర భాషలకు చెందిన మూవీలను కూడా చూడ్డం అలవాటు చేసుకున్నారు. చివరకు థియేటర్లకు వెళ్లటం మర్చిపోతున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే జనాలు బద్ధకంగా తయారు అవుతున్నారు. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకపోవటానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి టికెట్ల రేట్లు ఎక్కువగా ఉండటం.. రెండవది థియేటర్లలో విడుదల అయ్యే సినిమా నెల లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇక, ఖర్చు లేకుండా ఇంట్లోనే కూర్చుని సినిమా చూసే అవకాశం ఉండటంతో థియేటర్లకు వెళ్లటం మానేస్తున్నారు. ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లు కూడా తమ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు మంచి మంచి కంటెంట్‌ను అందిస్తున్నాయి.

ఇక, ఎ‍ప్పటిలాగే ఈ వారం కూడా పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ వారం డబ్బింగ్‌ సినిమాలు బాగా సందడి చేస్తున్నాయి. మరికొన్ని సినిమాలు త్వరలో సందడి చేయనున్నాయి. వీటిలో కొన్ని వెబ్‌ సిరీస్‌లు కూడా ఉన్నాయి.

  • కిల్ల‌ర్ సూప్ : నెట్‌ఫ్లిక్స్‌ ( హిందీ)
  • పంచాయత్‌ సీజన్‌ 3 : అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ( హిందీ) జనవరి 15 నుంచి స్ట్రీమింగ్‌
  • జర్నీ (వెబ్‌సీరీస్‌) : సోనీ లివ్‌ ( తమిళం)
  • ఏ రంజిత్‌ సినిమా : నెట్‌ఫ్లిక్స్‌ (మలయాళం)
  • జో : డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ( తమిళం) జనవరి 15 నుంచి స్ట్రీమింగ్‌
  • మిష‌న్ ఇంఫాజిబుల్ 7 పార్ట్ 1 : అమెజాన్ ప్రైమ్ వీడియో ( ఇంగ్లీష్‌)
  • ఎకో (వెబ్‌ సిరీస్‌) : డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ ( ఇంగ్లీష్‌)
  • స‌క్సెసెన్ ( టెలివిజన్‌ సిరీస్‌) : జియో సినిమా ( ఇంగ్లీష్‌)
  • రెడ్ ఐ : అమెజాన్ ప్రైమ్ వీడియో : ( ఇంగ్లీష్‌)
  • లిఫ్ట్ : నెట్‌ఫ్లిక్స్ ( ఇంగ్లీష్‌)
  • మెటాలిక్‌రోగ్ ( యానిమేష‌న్ సీరిస్) : క్రంచీరోల్ ( జపనీస్‌)

ఈ సినిమాలన్నీ ప్రస్తుతం తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మరి, ఈవారం ఓటీటీలో సందడి చేస్తున్న డబ్బింగ్‌ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.