iDreamPost
android-app
ios-app

మత్తువదలరా 2 OTT పార్ట్నర్ ఫిక్స్.. అందులోనే స్ట్రీమింగ్

  • Published Sep 13, 2024 | 9:45 AM Updated Updated Sep 13, 2024 | 10:17 AM

Mathuvadalara 2 OTT: కీర‌వాణి త‌న‌యుడు శ్రీసింహా కోడూరి, క‌మెడియ‌న్ స‌త్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో అలరించిన తాజా చిత్రం మ‌త్తువ‌ద‌ల‌రా 2. అయితే ఈ మూవీ నేడు థియేటర్స్ లో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మత్తువదలరా 2 మూవీ తాజాగా ఓటీటీ పార్టనర్ లాక్ అయ్యింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో ఆ వివరాలను తెలుసుకుందాం. 

Mathuvadalara 2 OTT: కీర‌వాణి త‌న‌యుడు శ్రీసింహా కోడూరి, క‌మెడియ‌న్ స‌త్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో అలరించిన తాజా చిత్రం మ‌త్తువ‌ద‌ల‌రా 2. అయితే ఈ మూవీ నేడు థియేటర్స్ లో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మత్తువదలరా 2 మూవీ తాజాగా ఓటీటీ పార్టనర్ లాక్ అయ్యింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో ఆ వివరాలను తెలుసుకుందాం. 

  • Published Sep 13, 2024 | 9:45 AMUpdated Sep 13, 2024 | 10:17 AM
మత్తువదలరా 2 OTT పార్ట్నర్  ఫిక్స్.. అందులోనే స్ట్రీమింగ్

ప్రస్తుతం సిని ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా ఎక్కువగా నడుస్తోంది. ముఖ్యంగా ఒకే కథను రెండు మూడు భాగాలుగా ప్రేక్షకులకు చెప్పేందుకు మూవీ మేకర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ తరహా ట్రెండ్ లో పెద్ద సినిమాల దగ్గర నుంచి చిన్న సినిమాలు వరకు ప్రతిది ప్రాంఛైజీ మూవీగానే తెరకెక్కించి మంచి హిట్ ను అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు (శుక్రవారం సెప్టెంబర్ 13న) థియేటర్ లో రిలీజైన ‘మత్తు వదలరా 2’ మూవీ కూడా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ మూవీలో కీర‌వాణి త‌న‌యుడు శ్రీసింహా కోడూరి, క‌మెడియ‌న్ స‌త్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. కాగా, ఈ మూవీని రితేష్ రానా దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే.. తాజాగా మత్తువదలరా 2 మూవీ ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయ్యింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో ఆ వివరాలను తెలుసుకుందాం.

ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించాడానికి తాజాగా శ్రీసింహా కోడూరి, క‌మెడియ‌న్ స‌త్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన మత్తువదలరా 2 మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఫరియా అబ్బుల్లా హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీపై రిలీజ్‌కు ముందే నుంచే ప్రేక్షకుల్లో మంచి బజ్ నడుస్తోంది. ఇక అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులకు ఈ మూవీ పై భారీ అంచనాలు పెంచాశాయి. ఈ క్రమంలోనే నేడు థియేటర్ లో సినిమా చూసిన ప్రేక్షకులు మూవీ చాలా బాగుందంటూ పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మత్తువదలరా 2 మూవీ ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయ్యింది. అయితే ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌ పార్ట్‌నర్ గా హక్కులను దక్కించుకుంది. కానీ, ఈ విషయం పై ఇంక అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అలాగే ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ ఎంతకు సొంతం చేసుకుంది, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలపై కూడా ఎక్కడ ఎలాంటి సమాచారం రాలేదు. త్వరలోనే ఈ విషయం పై మూవీ మేకర్స్ కానీ, నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ నుంచి కానీ ఆఫిషియల్ గా ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ఇకపోతే మ‌త్తు వ‌ద‌ల‌రా 2 మూవీ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా.. ఈ సినిమాకు స‌త్య వ‌న్‌మెన్ షోగా నిలిచాడ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. స‌త్య కామెడీ టైమింగ్,పంచ్ డైలాగ్స్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచాయ‌ని అంటున్నారు. సినిమాకు అస‌లైన హీరో స‌త్య‌నే అని ట్వీట్స్ చేస్తున్నారు.ముఖ్యంగా ఈ సినిమాలో చివ‌రి ఇర‌వై నిమిషాల్లో ప్రీ క్లైమాక్స్‌తో పాటు క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్‌లు స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటాయ‌ని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ 2019లో చిన్న సినిమాగా రిలీజైన మత్తు వదలరా కు సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే అప్పటిలో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన మత్తువదలరా 2 మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ దశలో అడుగువేయడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరీ, మత్తువదలరా 2 మూవీని నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ పార్ట్‌నర్ గా హక్కులను సొంతం చేసుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.