iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా OTT లో స్ట్రీమింగ్ అవుతున్న కాంతారా బ్యూటీ మూవీ..

  • Published May 17, 2024 | 6:27 PM Updated Updated May 17, 2024 | 6:27 PM

కొన్ని సినిమాలు డైరెక్ట్ గానే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరొక కొత్త సినిమా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

కొన్ని సినిమాలు డైరెక్ట్ గానే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరొక కొత్త సినిమా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published May 17, 2024 | 6:27 PMUpdated May 17, 2024 | 6:27 PM
సైలెంట్ గా OTT లో స్ట్రీమింగ్ అవుతున్న కాంతారా బ్యూటీ  మూవీ..

ఓ విధంగా ఇప్పుడు చూస్తున్నట్లైతే.. థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలకంటే.. ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సినిమాలు థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీ లోకి వస్తుంటే మరికొన్ని సినిమాలు.. నేరుగా ఓటీటీ లోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరొక సినిమా నేరుగా ఓటీటీ లోకి వచ్చేసింది. ఇలా నేరుగా ఓటీటీ లోకి వచ్చిన సినిమాలన్నీ కూడా దాదాపు మంచి టాక్ నే సంపాదించుకుంటున్నాయి. మరి ఈ సినిమా ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో.. అసలు సడన్ గా ఎటువంటి బజ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా పేరు “యువరాజ్”. ఈ సినిమాలో కాంతారాతో అందరికి పరిచయం అయిన సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిగా.. రాజ్ కుమార్ కుటుంబం నుంచి యువ‌రాజ్‌కుమార్ హీరోగా నటించారు. యువరాజ్ సినిమాను.. కన్నడలో యువ సినిమాకు డబ్బింగ్ వెర్షన్ గా రూపొందించారు. ఈ సినిమాకు సంతోష్ ఆనంద్‌రామ్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డైరెక్ట్ గా ఓటీటీ లోనే రిలీజ్ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో మే 17 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కన్నడలో యువ సినిమా థియేటర్ లోనే రిలీజ్ అయింది. తెలుగులో మాత్రం ఈ సినిమా నేరుగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇక యువరాజ్ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో ఒక రెజ్లర్.. ఒకానొక సమయంలో హీరోపై మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడనే.. ఆరోపణలు వస్తాయి. ఈ క్రమంలో అతనిని రెజ్లింగ్ నుంచి తొలగిస్తారు. దీనితో అతని తండ్రి అతనిని ద్వేషించడం మొదలు పెడతాడు. కానీ, రెజ్లింగ్ కు దూరం అయినా కూడా ఇంజినీరింగ్ పూర్తి చేసి.. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల కారణంగా.. ఒక ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తుంటాడు. మరోవైపు స్టాక్ మార్కెటింగ్ పేరుతో హీరో తండ్రిని కొందరు మోసం చేస్తారు. అప్పుడు హీరో తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు ! ఆ మోసగాళ్ళతో ఎలా పోరాటం చేశాడు ! ఇందులో హీరోయిన్ పాత్ర ఏంటి ! అసలు రెజ్లింగ్ లో ఉన్నపుడు హీరోపై నిందలు వేసింది ఎవరు ! అన్నదే ఈ మూవీ స్టోరీ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.