iDreamPost
android-app
ios-app

Ullu App: ఉల్లు నుంచి ‘హరి ఓమ్’ అనే కొత్త స్ట్రీమింగ్ యాప్.. బో*ల్డ్ కంటెట్ నుంచి భక్తి మార్గంలోకి!

  • Published May 17, 2024 | 3:17 PM Updated Updated May 17, 2024 | 3:17 PM

రెగ్యులర్ గా చూసే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. కానీ అవి మాత్రమే కాకుండా యూత్ కి మాత్రమే తెలిసిన కొన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. అందులో ఒకటి ఉళ్ళు యాప్. తాజాగా ఉళ్లు ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుందట.

రెగ్యులర్ గా చూసే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. కానీ అవి మాత్రమే కాకుండా యూత్ కి మాత్రమే తెలిసిన కొన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. అందులో ఒకటి ఉళ్ళు యాప్. తాజాగా ఉళ్లు ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుందట.

  • Published May 17, 2024 | 3:17 PMUpdated May 17, 2024 | 3:17 PM
Ullu App: ఉల్లు నుంచి ‘హరి ఓమ్’ అనే కొత్త స్ట్రీమింగ్ యాప్.. బో*ల్డ్ కంటెట్ నుంచి భక్తి  మార్గంలోకి!

ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ ల సిరీస్ లు, సినిమాలు దాదాపు అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ , ఈటీవీ విన్, ఆహా ఇలాంటి తెలుగు ప్లాట్ ఫార్మ్స్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ప్రతి వారం ఎన్నో సినిమాలు, సిరీస్ లు ఈ ప్లాట్ ఫార్మ్స్ లో ప్రసారం అవుతూ ఉంటాయి, వాటిలో కొన్ని ఫ్యామిలీ తో కలిసి చూసేవి ఉంటాయి. మరి కొన్ని ఒంటరిగా చూసేవి ఉంటాయి. అయితే కేవలం ఈ ప్లాట్ ఫార్మ్స్ ఏ కాకుండా.. యూత్ కి మాత్రమే తెలిసిన మరికొన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. అందులో ఒకటి.. ఉళ్ళు యాప్. తాజాగా ఉళ్లు ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుందట. దానికి సంబంధించిన పూర్తి విషయాలను చూసేద్దాం.

కొన్ని ప్రత్యేకమైన ఓటీటీ యాప్స్ లో కేవలం యూత్ కావాల్సిన అడల్ట్ కంటెంట్ ను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తుంటారు మేకర్స్. అడల్ట్ కంటెంట్ మూవీస్, సిరీస్ చూసేవారికి ఈ యాప్ గురించి బాగా తెలుస్తుంది. అయితే.. కేవలం అడల్ట్ కంటెంట్ ను మాత్రమే స్ట్రీమింగ్ చేసే మేకర్స్.. ఇక నుంచి ఫ్యామిలి అంత కలిసి చూసేలా.. కొత్త స్ట్రీమింగ్ యాప్ తో ముందుకే వస్తున్నారట. ఇందులో భక్తి కంటెంట్ ను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తారట. ఈ సరి కొత్త యాప్ పేరు “హరి ఓమ్”. ఈ ఏడాది జూన్ నుంచి ఈ యాప్ ను ప్రారంభించనున్నారు మేకర్స్. ఇందులో యానిమేషన్, లైవ్ యాక్షన్ లో చారిత్రిక భక్తి కార్యక్రమాలను ప్రసారం చేయనున్నారు. కాబట్టి కుటుంబం అంతా కలిసి కూర్చుని ఈ యాప్ లో ప్రసారం కాబోయే కంటెంట్ ను చూడవచ్చన్నమాట.

ఉళ్లు యాప్ ను ఉపయోగించే వారికి ఇది కాస్త ఆశ్చర్యకరమైన విషయంలా అనిపించినా కూడా.. తమ సబ్ స్క్రైబర్స్ ను పెంచుకునేందుకు ఇలా అనేక రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు మేకర్స్. ఇది కూడా అలాంటి ఓ ప్రయత్నమే. ఇక రోజు రోజుకు ఓటీటీ లో సినిమాలకు , సిరీస్ లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని .. మేకర్స్ కూడా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో థియేటర్స్ కంటే కూడా ఓటీటీ లకే మరింత ఆదరణ లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు, మరి ఉళ్లు తన కొత్త యాప్ అయిన “హరి ఓమ్” ను ప్రారంభిస్తున్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.