OTTలోకి టాలీవుడ్ క‌మెడియ‌న్‌ పొలిటిక‌ల్ కామెడీ మూవీ..స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

OTTలోకి టాలీవుడ్ క‌మెడియ‌న్‌ పొలిటిక‌ల్ కామెడీ మూవీ..స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

పెళ్లి చూపులు ఫేమ్‌ కామెడియన్‌ అభయ్‌ బేతిగంటి హీరోగా పొలిటిక‌ల్ సెటైర్ కాన్సెప్ట్‌తో రామన్న యూత్‌ అనే సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో అలరించనుంది. ఇంతకి ఎప్పుడంటే..?

పెళ్లి చూపులు ఫేమ్‌ కామెడియన్‌ అభయ్‌ బేతిగంటి హీరోగా పొలిటిక‌ల్ సెటైర్ కాన్సెప్ట్‌తో రామన్న యూత్‌ అనే సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో అలరించనుంది. ఇంతకి ఎప్పుడంటే..?

సినీ ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోగా పరిచయం అవ్వడం కొత్త విషయమేమి కాదు. గత కొన్నేళ్లుగా ఈ ట్రెండ్‌ అనేది నడుస్తునే ఉంది. ఇప్పటికే చాలామంది కమెడియన్లు తమ టాలెంట్‌ ను నిరుపించుకోవడం కోసం వెండితెరపై హీరోలుగా పరిచయమయ్యి మంచి గుర్తింపునే తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కమెడియన్‌ కూడా తన ప్రతిభను కనుబర్చుకోవడం కోసం హీరోగా సిల్వర్‌ స్రీన్‌ పై పరిచయమయ్యాడు. ఇంతకి ఆయన ఎవరో కాదు..పెళ్లిచూపులు ఫేమ్ అభ‌య్ బేతిగంటి. ఈయన హీరోగా దర్శకత్వం వహించిన  ‘రామన్న యూత్‌’ అనే సినిమాలో నటించాడు. కాగా,ఈ సినిమా గతేడాది సెప్టెంబర్‌ 15వ తేదీన  రామన్న యూత్‌ మూవీ థియేటర్లలో రిలీజైంది. అయితే రిలీజై ఏడు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తున్నట్లు ఈటీవీ విన్‌ అఫీషియల్‌ గా అనౌన్స్‌ చేసి ఓ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసింది. ఇంతకి ఈ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

పెళ్లి చూపులు ఫేమ్‌ అభయ్‌ బేతిగంటి హీరోగా పొలిటిక‌ల్ సెటైర్ కాన్సెప్ట్‌తో ‘రామన్న యూత్‌’ అనే సినిమాలో నటించాడు. అయితే తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కిన ఈ మూవీ   గతేడాది సెప్టెంబర్‌ 15న థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా స‌రైన ప్ర‌మోష‌న్స్ లేక‌పోవ‌డం, పైగా రిలీజ్ ఆల‌స్యం కావ‌డంతో థియేట‌ర్ల‌లో రామ‌న్న యూత్ సినిమా పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఈ క్రమంలోనే    ఈ మూవీ రిలీజై ఏడు నెలల తర్వాత ఈ మూవీ మే 30 నుంచి ఓటీటీలోకి వస్తున్నట్లు ఈటీవీ విన్‌ అఫీషియల్‌ గా అనౌన్స్‌ చేసి ఓ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసింది. ఇక రామన్న యూత్‌ సినిమాలో అమూల్య‌రెడ్డి, తాగుబోతు ర‌మేష్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, అనీల్ గీలా ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

ఇక రామన్న యూత్‌ సినిమా కథ విషయానికొస్తే.. హీరో రాజు (అభ‌య్ బేతిగంటి) స్నేహితుల‌తో క‌లిసి జులాయిగా తిరుగుతుంటాడు. అయితే ఎప్పటికైనా పొలిటిక‌ల్ లీడ‌ర్ కావాల‌న్న‌ది అత‌డి క‌ల‌.  అయితే ఒక రోజు ఓ మీటింగ్‌ లో సిద్ధిపేట ఎమ్మెల్యే రామ‌న్న‌, రాజును అప్యాయంగా పలకరిస్తాడు. ఇక ఎమ్మెల్యే మాటలతో రాజు పొంగిపోతాడు. ఈ క్రమంలోనే.. త‌న‌తో పాటు త‌న‌ తండ్రి గురించి ఎమ్మెల్యేకు బాగా తెలుసున‌ని రాజు భ్ర‌మ‌ప‌డ‌తాడు.  ఇక  ఎమ్మెల్యేపై అభిమానంతో అత‌డి పేరు మీద రామ‌న్న యూత్ అసోసియేష‌న్‌ను ఏర్పాటు చేస్తాడు. కాగా, అతడి కోసం ఊరిలో ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా పెద్ద ఫ్లెక్సీ కూడా రాజు కట్టిస్తాడు. అలా ఫ్లెక్సీ సాఫీగా సాగిపోతున్న రాజు జీవితంలో ఊహించని గందరగోళం ఎలా  మొదలయ్యింది. అలాగే  రాజుపై ఊరి స‌ర్పంచ్ (తాగుబోతు ర‌మేష్‌) త‌మ్ముడు మ‌హిపాల్ (టాక్సీవాలా విష్ణు) ఎందుకు ద్వేషాన్ని పంచుకున్నాడు? స‌ర్పంచ్ అండ లేకుండా డైరెక్ట్‌గా ఎమ్మెల్యేను క‌లుస్తాన‌ని మ‌హిపాల్‌తో ఛాలెంజ్ చేసిన రాజు ఆ ప్ర‌య‌త్నంలో స‌క్సెస్ అయ్యాడా? ఎమ్మెల్యేను క‌ల‌వ‌డం కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన రాజు ఎందుకు జైలుపాల‌య్యాడు? స్వ‌ప్న‌( అమూల్య‌రెడ్డి)ను ప్రేమించిన రాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్న‌దే రామ‌న్న యూత్ క‌థ‌.

అయితే పొలిటికల్‌ సినిమా రూపొందిన రామన్న యూత్‌ సీరియస్‌గా కాకుండా ఫ‌న్ జోడించి తెరకెక్కించాడు అభ‌య్ బేతిగంటి. ఇక పల్లెటూరిలో త‌మ స్వార్థం కోసం యువ‌త‌ను నాయ‌కులు ఎలా వాడుకుంటున్నారు? నాయ‌కుల మాట‌లు, మాయ‌లో ప‌డి యువ‌త‌రం త‌మ జీవితాల్ని ఏ విధంగా నాశ‌నం చేసుకుంటున్నార‌న్న‌ది వినోదాత్మ‌కంగా ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో చూపించాడు. ఇక అభయ్‌ విషయానికొస్తే.. ఈయన పెళ్లిచూపులు, అభ‌య్ స‌మ్మోహ‌నం, గీత‌గోవిందం, సాహో, జార్జిరెడ్డి, రాక్ష‌స‌కావ్యం, పిట్ట‌క‌థ‌లు, లూజ‌ర్‌తో పాటు మ‌రికొన్ని వెబ్‌సిరీస్‌ల‌లో అలరించాడు. మరి త్వరలోనే ఓటీటీలోకి అభయ్‌ రామన్న యూత్‌ మూవీ ఓటీటీలో అలరించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments