iDreamPost
android-app
ios-app

సరిపోదా శనివారం OTT రిలీజ్ డేట్ ఇదే..

  • Published Sep 03, 2024 | 10:22 AM Updated Updated Sep 03, 2024 | 10:50 AM

Saripodhaa Sanivaaram Movie OTT Streming Date: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం సరిపోదా శనివారం. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీ మరోవైపు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆ తేదీ నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని టాక్ వినిపిస్తుంది.

Saripodhaa Sanivaaram Movie OTT Streming Date: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం సరిపోదా శనివారం. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీ మరోవైపు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆ తేదీ నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని టాక్ వినిపిస్తుంది.

  • Published Sep 03, 2024 | 10:22 AMUpdated Sep 03, 2024 | 10:50 AM
సరిపోదా శనివారం OTT రిలీజ్ డేట్ ఇదే..

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండవ సినిమా ‘సరిపోదా శనివారం’. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా పై మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఇక అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కు ఆడియోన్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ సరిపోదా శనివారం థియేటర్ లో గతనెల ఆగస్టు 29వ తేదీన విడుదలై మంచి హిట్ అందుకుంది. అంతేకాకుండా.. రిలీజైన మొదటి రోజు నుంచి హిట్ టాక్ తో పాటు కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. కేవలం రిలీజైన నాలుగు రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.68 కోట్లు గ్రాస్ వసూలు చేయడం గమన్హారం. అయితే ఓ వైపు హిట్ టాక్ తో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వస్తుందనే టాక్ వినిపిస్తుంది. పైగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. మరీ, ఆ వివరాలేంటో చూద్దాం.

స్టార్ హీరో నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన ఫీల్ గుడ్ మూవీ సరిపోదా శనివారం. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లో మంచి హిట్ టాక్ తో పాటు కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న నేపథ్యంలో తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుందని సమాచారం. కాగా, ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా.. ఈ సినిమా ఈ నెల సెప్టెంబర్ 27న ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని జోరుగా సమాచారం వినిపిస్తుంది. కానీ, ఈ సినిమా మంచి హిట్ టాక్ తో పాటు కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టిస్తుండగా..అంతలోనే ఓటీటీలోకి వస్తుందనడంపై నెట్టింట చర్చలు మొదలవుతున్నాయి. మరీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఈ విషయం ఇటు మూవీ మేకర్స్ కానీ, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి కానీ అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

saripodhaa sanivaram ott release date

ఇదిలా ఉంటే..నాని సరిపోదా శనివారం మూవీ తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.ఇక ఈ మూవీలో ఎస్ జే సూర్య విలన్ పాత్రలో అలరించారు. అయితే ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించాగా.. జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించారు. మరీ, నాని సరిపోదా శనివారం మూవీ రిలీజై నెల రోజులు గడవక ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss