iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!

  • Published Aug 27, 2024 | 9:34 AM Updated Updated Aug 27, 2024 | 9:34 AM

Bijili Ramesh Passed away: సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

Bijili Ramesh Passed away: సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

  • Published Aug 27, 2024 | 9:34 AMUpdated Aug 27, 2024 | 9:34 AM
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!

ఇటీవల సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు, సాంకేతిక రంగానికి చెందిన వారు హఠాత్తుగా కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. హార్ట్ ఎటాక్, అనారోగ్యం, వయో భారం, రోడ్డు ప్రమాదాల వల్ల కొంతమంది చనిపోతే.. కెరీర్ సరిగా లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరికొంత మంది బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. ఆదిపురుష్ నటి ఆశా వర్మ, మాలీవుడ్ నటుడు నిర్మల్ బెన్నీ కన్నుమూసిన విషాదం నుంచి కోలుకోక ముందే మరో నటుడు కన్నుమూయడంతో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..

తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్లాక్‌షీప్ యూట్యూబ్ ఛానెల్‌లో తన ఫ్రాంక్ వీడియోలతో బిజిలీ రమేష్ (46) రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియా ద్వారా పేరు తెచ్చుకుని ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు బిజిలి రమేష్ .  2019 సంవత్సరంలో హిప్ హాప్ ఆది నటించిన ‘నాద్బే సుపాప్’ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది.. వరుసగా అవకాశాలు కలిసి వచ్చాయి. పొన్మాల్ వండాల్, ఆకాశి, కోమలి, జాంబీ వంటి సినిమాల్లో నటించాడు. బిజిలి రమేష్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ అతను చెన్నైలో మరణించాడు. దీంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

రజనీకి వీరాభిమాని బిజిలి రమేష్ యూట్యూబ్ ఛానెల్ హోస్ట్ చేసిన ఫ్రాంక్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. రమేష్ అనేక మీమ్స్‌లో ట్రెండ్ అయ్యాడు.సినిమాల్లో నటించినా తనకు పెద్దగా ఆదాయం రావడం లేదని పలు సందర్భాల్లో బిజిలి రమేష్ వాపోయాడు. ఈ క్రమంలనే ఆయనకు ఇండస్ట్రీకి చెందినవారు సాయం చేశారు. తన ఆరోగ్యం దెబ్బతినడంతో ట్రీట్ మెంట్ కు డబ్బు లేక ఇబ్బంది పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గత రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందడం సినీ అభిమానులతో పాటు సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibom