iDreamPost
android-app
ios-app

OTT Movies : ఈ వారం OTT లో అస్సలు మిస్ చేయకుండా చూడాల్సిన 4 సినిమాలు ఇవే!

  • Published Jul 08, 2024 | 12:53 PM Updated Updated Jul 08, 2024 | 12:53 PM

This Week Must Watch Movies : ప్రతి వారం ఓటీటీ లో పదికి పైగానే సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ వారం ఏ ఏ సినిమాలు , సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయనే లిస్ట్ కూడా వచ్చేసింది. అయితే వాటిలో చూడదగిన సినిమాలు మాత్రం కొన్నే ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.

This Week Must Watch Movies : ప్రతి వారం ఓటీటీ లో పదికి పైగానే సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ వారం ఏ ఏ సినిమాలు , సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయనే లిస్ట్ కూడా వచ్చేసింది. అయితే వాటిలో చూడదగిన సినిమాలు మాత్రం కొన్నే ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.

  • Published Jul 08, 2024 | 12:53 PMUpdated Jul 08, 2024 | 12:53 PM
OTT Movies : ఈ వారం OTT లో అస్సలు మిస్ చేయకుండా చూడాల్సిన 4 సినిమాలు ఇవే!

ఓటీటీ లో ప్రతి వారం పదికి పైగానే సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతున్నా కానీ.. వాటిలో చూడదగిన సినిమాలు, సిరీస్ లు మాత్రం కేవలం కొన్నే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ కాబోతున్నాయనే లిస్ట్ తో పాటు.. వాటిలో ఏ సినిమాలు వీకెండ్ కు బెస్ట్ సజ్జెషన్ అనే లిస్ట్ కూడా వస్తూనే ఉంది. పైగా వారం వారం వచ్చే లిస్ట్ లో ప్రేక్షకులు ముఖ్యంగా ఎదురుచూసేది వాటిలో ఏమైనా తెలుగు సినిమాలు , సిరీస్ ఉన్నాయా లేదా అని.. వాటికోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ వారం వచ్చిన లిస్ట్ లో.. చెప్పుకోదగిన సినిమాలు మాత్రం కొన్నే ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈ వారం అసలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు , సిరీస్ లు ఏంటంటే

అగ్నిసాక్షి ( వెబ్ సిరీస్) :

వెబ్ సిరీస్ లంటే ప్రేక్షకులు బాగా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. దీనితో మేకర్స్ కూడా కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో బాగా ఫేమస్ అయినా సీరియల్ అగ్నిసాక్షిని.. మళ్ళీ అదే టైటిల్ తో.. అదే జంటతో.. సరి కొత్త కథ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జులై 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Agni sakshi

మనమే :

శర్వానంద్ , కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా జూన్ 7 న థియేటర్ లో రిలీజ్ అయింది. అయితే అనుకున్నంత రేంజ్ లో థియేటర్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని.. ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వనుంది. మనమే సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో జులై 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Maname

మహారాజ :

విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా… ఊహించని రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించింది. మినిమమ్ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సాధించింది. దీనితో ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయినా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీ లో చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జులై 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Maharaja

కాకుడ:

హర్రర్ సినిమాలను ఈ మధ్య ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. దీనితో ఇలాంటి కథలను ఇంకా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన ముంజ్యా మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు అదే డైరెక్టర్ తీసిన కాకుడ మూవీ డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా జులై 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

Kakuda

ఇక ఈ సినిమాలే కాకుండా వీకెండ్ లోపు ఇంకా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఈ సినిమాలను మాత్రం ఈ వీకెండ్ అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.