Swetha
ఇప్పుడు రెగ్యులర్ సినిమాలనే కాకుండా.. యానిమేటెడ్ ఫిలిమ్స్ ను చూసే ప్రేక్షకులు కూడా ఎక్కువ అయిపోయారు. ఇక చిన్న పిల్లలు ఇలాంటి ఫిలిమ్స్ ను చూడడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో తాజాగా మరొక యానిమేటెడ్ ఫిల్మ్ ఓటీటీ లోకి వచ్చేసింది.
ఇప్పుడు రెగ్యులర్ సినిమాలనే కాకుండా.. యానిమేటెడ్ ఫిలిమ్స్ ను చూసే ప్రేక్షకులు కూడా ఎక్కువ అయిపోయారు. ఇక చిన్న పిల్లలు ఇలాంటి ఫిలిమ్స్ ను చూడడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో తాజాగా మరొక యానిమేటెడ్ ఫిల్మ్ ఓటీటీ లోకి వచ్చేసింది.
Swetha
యానిమేటెడ్ చిత్రాలకు ఓటీటీ ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా పిల్లలు ఈ యానిమేటెడ్ సినిమాలను చూసేందుకు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలతో పాటు అందరూ యానిమేటేడ్ ఫిల్మ్స్ , సిరీస్ చూస్తూనే ఉన్నారు. వీటికి ఎంత డిమాండ్ పెరిగిందంటే.. ఇటీవల ఎప్పుడో జరిగిన బాహుబలి సినిమాను కూడా సరికొత్త కథనంతో యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. అలానే ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న కల్కి సినిమా నుంచి కూడా ప్రమోషన్స్ లో భాగంగా వారు కూడా బుజ్జి&భైరవ పేరుతో .. యానిమేటెడ్ సిరీస్ ను రిలీజ్ చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా మరోక యానిమేటెడ్ సిరీస్ ఓటీటీ లోకి వచ్చేసింది.
ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న యానిమేటెడ్ సిరీస్ మరేదో కాదు.. “ది లెజెండ్ ఆఫ్ హనుమాన్”. ఇప్పటికే ఈ సిరీస్ మూడు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు నాలుగవ సీజన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది. ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. పైగా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సిరీస్ మొదటి మూడు సీజన్స్ ను చూడని వారు ఉంటే.. వెంటనే చూసేయండి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ సిరీస్ ను చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కనీసం ఇలా యానిమేటెడ్ సిరీస్ ద్వారా అయినా పిల్లలకు పురాణ ఇతి హాసాల గురించి తెలుస్తుంది. ఈ సిరీస్ కూడా అలాంటిదే.
ఇక ఈ సిరీస్ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణ మహాభారత గ్రంధాల గురించి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు అంతా తెలియడం లేదు . అని, ఇలా రామాయణ మహాభారతాల గురించి యానిమేటెడ్ వెర్షన్స్ ను ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇక రామాయణం గురించి ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ప్రతి సారి ప్రేక్షకులను ఎదో ఒక కొత్త విషయం ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది. తెలిసిన కథే అయినా కూడా ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు కాబట్టి ఈ వెబ్ సిరీస్ ను కూడా మరొక సారి చూసేయండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.