Swetha
OTT Best Suspense Thriller : ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ కోసం సెర్చ్ చేస్తుంటే మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ బెస్ట్ సజ్జెషన్ అని చెప్పి తీరాలి. మరి ఈ మూవీ ఏంటో ఈ మూవీని మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.
OTT Best Suspense Thriller : ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ కోసం సెర్చ్ చేస్తుంటే మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ బెస్ట్ సజ్జెషన్ అని చెప్పి తీరాలి. మరి ఈ మూవీ ఏంటో ఈ మూవీని మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.
Swetha
సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ప్రతి ఒక్కరికి మూవీస్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. దీనితో ఈ జోనర్ లో వచ్చే ప్రతి సినిమాను ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. సాధారణంగా ఎక్కడైనా కానీ ఏదైనా పుస్తకాల ఆధారంగా తీసుకుని సినిమాలను రూపొందిస్తూ ఉంటారు. కాని ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ మొత్తం కూడా ఓ పుస్తకం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దాదాపు ఈ మూవీ అంతా కూడా ఓ పుస్తకానికి సంబంధించి ఉంటుంది. దీనిలో ఏం ఉంటుందిలే అని లైట్ తీసుకుంటే మాత్రం పొరపాటే. ముఖ్యంగా ఈ మూవీలో ట్విస్ట్ అసలు ఊహించలేరు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీలో ఎరిక్ అనే ఓ ఫేమస్ బుక్ పబ్లిషర్ ఉంటాడు. అతను అప్పటివరకు “డెడ్లస్” అనే ఓ బుక్ ను రెండు వాల్యూమ్స్ గా రిలీజ్ చేస్తాడు. ఈ రెండు వాల్యూమ్స్ కూడా మంచి సక్సెస్ ను సాధిస్తాయి. దీనితో ఆ బుక్ కు మూడో వాల్యూమ్ కూడా ఉండబోతుందని ఓ ఈవెంట్ లో అనౌన్స్ చేస్తాడు. అయితే అప్పటివరకు ఆ బుక్ కేవలం ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో మాత్రమే విడుదల అయ్యి ఉంటుంది. దానిని మిగతా భాషలలో కూడా రిలీజ్ చేయాలనీ.. 9 భాషలకు సంబంధించిన 9 మంది ఫేమస్ బుక్ ట్రాన్స్ లెటర్స్ ను పిలిపిస్తాడు. వారు ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేస్తాడు కానీ.. వారికి ఫోన్ , ఇంటర్నెట్ సౌకర్యం మాత్రం ఇవ్వడు. అయితే ఆ ట్రాన్స్ లెటర్స్ కు తానే ఆ బుక్ రాసినట్లు చెప్పడు. రోజుకు 20 పేజీలు ట్రాన్స్ లేట్ చేయాలనీ చెప్తాడు. ఆ 20 పేజీలు చదివిన వారంతా కూడా ఆ బుక్ రాసింది ఎవరో తెలుసుకోవాలని అనుకుంటారు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎవరికీ చెప్పడు.
అయితే అనుకోకుండా ఓ రోజు.. ఎరిక్ కు.. తన పుస్తకం మూడవ భాగానికి చెందిన కొన్ని పేజీలు ఇంటర్నెట్ లో లీక్ అయినట్లు.. ఓ మెసేజ్ వస్తుంది. వారికి కావాల్సినంత డబ్బు ఇవ్వకపోతే.. మిగతా పేజీలు కూడా లీక్ చేస్తామని వారు ఎరిక్ ను బెదిరిస్తారు. దీనితో ఎరిక్ కు ఆ ట్రాన్స్ లెటర్స్ పైనే అనుమానం వస్తుంది. వారికి తెలియకుండా వారి రూమ్స్ ను కూడా చెక్ చేస్తాడు కానీ.. అతనికీ ఏ ఆధారం దొరకదు. ఈ క్రమంలో అక్కడ ఉన్న రష్యన్ ట్రాన్స్ లెటర్ కు.. ఇంగ్లీష్ ట్రాన్స్ లెటర్ అలెక్స్ మీద అనుమానం వస్తుంది. అతను డెడ్లస్ మొదటి రెండు భాగాలను చదివేసి మూడవ భాగాన్ని ముందే గెస్ చేస్తూ ఉంటాడు.
కానీ అతనేమో లీక్ కు నాకు సంబంధం లేదని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే ఎరిక్ బుక్ లీక్ అయినా విషయం పేపర్ లో కూడా వచ్చేస్తుంది. దీనితో ఎరిక్ ఆ ట్రాన్స్ లెటర్స్ అందరికి ఓ గదిలో బందించి టార్చర్ చేస్తాడు. అది తట్టుకోలేక ఓ ట్రాన్స్ లెటర్ ఆత్మహత్య కూడా చేసుకుంటుంది. అసలు ఆ బుక్ లీక్ చేసింది ఎవరు ? చివరకు ఏమౌతుంది ? అసలు ఆ పుస్తకం రాసింది ఎవరనే విషయం ట్రాన్స్ లెటర్స్ కు చివరకైన తెలుస్తుందా ? ఇవన్నీ తెలియాలంటే.. “ది ట్రాన్స్‌లేటర్స్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.