iDreamPost
android-app
ios-app

OTT Suggestion : మనుషులే మనుషుల్ని చంపి తింటే.. OTTలో మైండ్ డిస్టర్బ్ చేసే మూవీ

  • Published Jul 08, 2024 | 5:23 PM Updated Updated Jul 08, 2024 | 5:23 PM

OTT Best Thriller Movie: ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఎప్పుడు రెడీ గానే ఉంటున్నాయి. ప్రతి వారం వచ్చే సినిమాలతో పాటు.. ఆల్రెడీ చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకునేది కూడా అలాంటి ఓ సినిమా గురించే.

OTT Best Thriller Movie: ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఎప్పుడు రెడీ గానే ఉంటున్నాయి. ప్రతి వారం వచ్చే సినిమాలతో పాటు.. ఆల్రెడీ చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకునేది కూడా అలాంటి ఓ సినిమా గురించే.

  • Published Jul 08, 2024 | 5:23 PMUpdated Jul 08, 2024 | 5:23 PM
OTT Suggestion : మనుషులే మనుషుల్ని చంపి తింటే.. OTTలో మైండ్ డిస్టర్బ్ చేసే మూవీ

చూసే ఓపిక తీరిక ఉండాలే కానీ.. ఓటీటీ లో లెక్కలేనన్ని సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. ప్రతి వారం ఓటీటీ లో వచ్చే సినిమాలతో పాటు.. ఆల్రెడీ ఓటీటీ లో చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఓటీటీ లో వచ్చే సినిమాలు చూసి బోర్ కొట్టేసి.. ఇంకా ఏమైనా సినిమాలు చూడాలనుకునే వారి కోసమే.. ఈ మూవీ సజ్జెషన్. ఇక రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టేసి.. ఏదైనా డిఫరెంట్ మూవీస్ ను చూడడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ గురించే.. మరి ఈ మూవీ ఏంటో ఈ మూవీని మీరు చూశారో లేదో.. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో గోరెంగ్ అనే వ్యక్తి ఓ గుహలో నివసిస్తూ ఉంటాడు. అతనితో పాటు ఓ ముసలాయన కూడా అదే గదిలో ఉంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది గోరెంగ్ కు అర్థంకాదు.. దీనితో ఆ ముసలాయన అక్కడ జరిగే ప్రాసెస్ ను అతనికి వివరిస్తాడు. ఓ పెద్ద బిల్డింగ్ లో ఫ్లోర్స్ లా ఉండే ఆ గుహలో.. గదికి ఇద్దరు మనుషులు చొప్పున ఉంటారు.. ప్రతి రోజు ఫుడ్ తో ఉన్న ఓ ప్లాట్ ఫార్మ్ ప్రతి ఫ్లోర్ లో రెండు నిముషాలు ఆగుతుంది. పై ఫ్లోర్ లో వాళ్ళు మిగిల్చిన ఆహరం మనం తిని బ్రతకాల్సి వస్తుందని ఆ ముసలాయన గోరెంగ్ కు చెప్తాడు. అసలు విషయం ఏంటంటే.. ఆ గుహలో దాదాపు 333 ఫ్లోర్స్ ఉంటాయి. ప్రతి రోజు వాళ్లలో ఒకరికి ఇష్టమైన ఫుడ్ ను టాప్ ఫ్లోర్ లో తయారు చేసి.. కిందికి పంపుతూ ఉంటారు. కానీ పైన ఫ్లోర్స్ వాళ్ళు తమకు అవసరం అయిన దానికంటే కూడా ఎక్కువ ఫుడ్ ను తినేస్తూ ఉంటారు. దీనితో కింద ఫ్లోర్ లో ఉన్న వాళ్లకు తినడానికి ఏమి మిగలదు.

The Platform

దీనితో ఆకలికి తట్టుకోలేక అక్కడ మనుషులలో ఉన్న జంతు స్వరూపం బయటకు వస్తుంది. కింద ఫ్లోర్ లో వ్యక్తులు బ్రతకడం కోసం.. తమ గదిలో తమతో పాటు ఉండే వ్యక్తులనే చంపేసి.. వాళ్ళ మాంసాన్నే కొద్దీ కొద్దిగా తింటూ ఉంటారు. సరిగ్గా ఇదే చోటికి గోరెంగ్ వస్తాడు. కొన్ని రోజులు అతను కూడా బాగానే ఉంటాడు. కానీ ఆహరం దొరకకపోయే సరికి రెండు సార్లు.. తన రూమ్ మేట్ ను చంపి తినేస్తాడు. అసలు అతను అక్కడికి ఎందుకు వెళ్తాడు ? ఆ గుహలో ఏం జరుగుతుంది ? అక్కడ తోటి మనుషులని ఎందుకు చంపి తినాల్సి వస్తుంది ? వాళ్లకు అలా ఫుడ్ ఎందుకు వెళ్తుంది ? చివరికి ఏం జరిగింది? ఇవన్నీ తెలియాలంటే “ది ప్లాట్ ఫార్మ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం.. వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.