Swetha
OTT Best Suspense Thriller: ఈ సినిమా అంతా కూడా ఓ సైకో ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఎన్నో చూసి ఉంటారు కానీ.. ఈ మూవీ చూస్తే మాత్రం కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. మరి ఈ సినిమా ఏంటో... ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.
OTT Best Suspense Thriller: ఈ సినిమా అంతా కూడా ఓ సైకో ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఎన్నో చూసి ఉంటారు కానీ.. ఈ మూవీ చూస్తే మాత్రం కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. మరి ఈ సినిమా ఏంటో... ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.
Swetha
సైకో కిల్లర్స్ ఎప్పుడు ఎవరిని ఎందుకు.. ఎలా చంపుతారో అసలు తెలియదు. ఇలా ఒకరు చేసే హత్యలను.. ఇన్వెస్టిగేషన్ చేస్తూ వచ్చే సినిమాలను ఇప్పటివరకు చాలానే చూసి ఉంటారు. చివరి వరకు కూడా ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంగేజింగ్ గానే ఉంచుతాయి. మరి అదే ఓ ఫ్యామిలీ మొత్తం సైకో కిల్లర్స్ అయితే.. ఇంకా ఆ మూవీ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే .. మూవీ స్టార్టింగ్ లో ఫిన్లాండ్ లో జరిగే ఓ ఇన్సిడెంట్ ను చూపిస్తారు. ఏలీయా అనే అమ్మాయి. ఓ ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి.. పక్కనే ఉన్న అడవిలోకి పారిపోతుంది. వెనుకాలే ఎవరో ఆమెను తరుముతూ ఉంటారు. వారు ఎవరో కాదు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఏ. కట్ చేస్తే అమెరికాలోని.. ఓ బ్యాంక్ ను చూపిస్తారు. అక్కడ ఓ రాబరీ జరుగుతుంది. అక్కడ రెక్స్ అనే వ్యక్తి ఆ దొంగలతో ఫైట్ చేస్తాడు. దీనితో కోర్టులో రెక్స్ కు వ్యతిరేకంగా కేసు నడుస్తుంది. పబ్లిక్ లోనేమో రెక్స్ ను అంతా హీరోల ట్రీట్ చేస్తారు. కాని అతనికి ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. కట్ చేస్తే ఎనిమిదేళ్ల తర్వాత అతను బయటకు వస్తాడు. అందరు అతనిని గుర్తుపడుతూ ఉంటారు. అయితే అప్పుడు రెక్స్ లో ఇంకొక క్యారెక్టర్ బయటకు వస్తుంది. అది అతని అంతరాత్మ.. అది అప్పుడు బయటకు వచ్చి తన ఎమోషన్స్ ను బయటపెడుతోంది . దీనితో రెక్స్ అక్కడినుంచి ఎక్కడికైనా వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యి.. ఫిన్లాండ్ కు వెళ్తాడు.
అయితే రెక్స్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత.. రెక్స్ వెనుక ఉన్న ఓల్డ్ కపుల్ అతనిని చూస్తూ ఎదో మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటంటే వాళ్ళు అతనిని వారు కిడ్నప్ చేద్దాం అనుకుంటారు.కానీ రెక్స్ దానిని పట్టించుకోకుండా.. నార్మల్ గానే ఫ్లైట్ ఎక్కి ఫిన్లాండ్ కు వెళ్తాడు. అక్కడ తనకు తెలీకుండానే ఓ క్యాబ్ ఎక్కి.. పడుకుంటాడు. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉండే హౌస్ ను చూపిస్తారు. అదే హౌస్ బేస్మెంట్ లో రెక్స్ ను బందించి ఉంచుతారు. కొద్దీ సేపటికి అతనికి మెలుకువ వచ్చి చూస్తే.. అతని కుడి కాలు కట్ అయిపోయి ఉంటుంది. అయితే ఆ ఫ్యామిలీని చూస్తే సైకో ఫ్యామిలీ అని అర్ధమౌతుంది.
దీనితో రెక్స్ అక్కడినుంచి తప్పించుకుందాం అని అనుకుంటాడు. ఈ క్రమంలో ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరితో ఫైట్ అవుతుంది . అయితే ఆ ఫ్యామిలీ మరేదో కాదు.. మూవీ స్టార్టింగ్ లో ఏలీయాను తరిమిన ఫ్యామిలీనే.. ఏలీయా తప్ప మిగిలిన వారంతా కూడా మనుషులను చంపి తింటారు. మరి రెక్స్ అక్కడి నుంచి తప్పించుకుంటాడా లేదా? వారు రెక్స్ ను సెలెక్ట్ చేసుకోడానికి రీజన్ ఏంటి ? ఏలీయా రెక్స్ కు హెల్ప్ చేస్తుందా ? చివరికి కథ ఎలా ముగుస్తుంది? ఇవన్నీ తెలియాలంటే “బ్లడీ హెల్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఉన్నా కూడా ఇక్కడ అందుబాటులో లేదు. కానీ.. యూట్యూబ్ లో దీనిని ఫ్రీ గా చూసేయొచ్చు. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి . ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.