iDreamPost
android-app
ios-app

OTTలో కుక్క కోసం పోరాటం.. ఇండియన్ సినిమాలో ఇదొక ‘జాన్ విక్’లాంటిది!

OTT Suggestions- Best Revenge Action Thriller: మీరు ఒక బెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ చూసి చాలా రోజులు అయ్యిందని దిగులుగా ఉన్నారా? మీకోసం ఒక బెస్ట్ రివేంజ్ యాక్షన్ డ్రామా తీసుకొచ్చాం. మరి.. ఆ మూవీ ఏదో చూడండి.

OTT Suggestions- Best Revenge Action Thriller: మీరు ఒక బెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ చూసి చాలా రోజులు అయ్యిందని దిగులుగా ఉన్నారా? మీకోసం ఒక బెస్ట్ రివేంజ్ యాక్షన్ డ్రామా తీసుకొచ్చాం. మరి.. ఆ మూవీ ఏదో చూడండి.

OTTలో కుక్క కోసం పోరాటం.. ఇండియన్ సినిమాలో ఇదొక ‘జాన్ విక్’లాంటిది!

ఓటీటీలు వచ్చిన తర్వాత మీరు చాలా మూవీస్ చూసుంటారు. వాటిలో పర భాషా చిత్రాలు కూడా ఉండే ఉంటాయి. తాజాగా ఆర్జీవీ ఒక కామెంట్ చేశాడు. “హిందీ వాళ్లు తెలుగు సినిమాలు చూస్తున్నారు.. తెగులు వాళ్లు మలయాళం సినిమాలు చూస్తున్నారు” అని. నిజానికి అది నిజంగా నిజమే. ఓటీటీల పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా మలయాళం సినిమాలు చూస్తున్నారు. అయితే ఈ క్రేజీ రివేంజ్ థ్రిల్లర్ మూవీని అయితే చాలా తక్కువ మంది చూసుంటారు. ఎందుకంటే ఇది అంత వైరల్ కాలేదు కాబట్టి. కానీ, ఒకసారి చూడటం స్టార్ట్ చేస్తే మాత్రం అస్సలు ఆపలేరు. అలాగే మిమ్మల్ని మీరు మర్చిపోతారు.

సాధారణంగా రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ అనగానే అందరికీ హాలీవుడ్ లో ‘జాన్ విక్’ మూవీ గుర్తొస్తుంది. ఆ మూవీలో హీరో పెంచుకునే కుక్కని చంపేస్తారు. అందుకోసం మన హీరో శత్రువలపై యుద్ధం ప్రకటిస్తాడు. వాళ్లందరినీ చంపిన దాకా నిద్రపోడు. అలాంటి ఒక పాయింట్ తో ఈ మూవీని మలయాళంలో తెరకెక్కించారు. తాను ప్రాణంగా ప్రేమించుకున్న కుక్క చావుకు కారణమైన హీరోకి తగిన బుద్ధి చెప్పాలని ఒక కుర్రాడు అనుకుంటాడు. అతను అనుకున్నదే తడవుగా హీరోపై ప్రతీకారం తీర్చుకునేందుకు పెద్ద స్కెచ్ వేస్తాడు. అనుకున్నది అనుకున్నట్లుగా అమలు చేస్తూ.. హీరో కుటుంబానికి చుక్కలు చూపిస్తాడు.

హీరో చేసిన ఒక పిచ్చి పని అతని ప్రాణాలు, అతని కుటుంబం ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. ఆ కుర్రాడి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు చాలానే పోరాటం చేస్తాడు. తన సొంత ఇల్లు, సొంత తోటలోనే బిక్కు బిక్కు మంటూ.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తాడు. ఈ మూవీలో క్లైమ్యాక్స్ ఫైట్ సీక్వెన్స్ కనీసం ఒక 20 నిమిషాలు ఉంటుంది. ఈ క్లయిమ్యాక్స్ కు పిచ్చెక్కిపోతారు. సాధారణంగా మలయాళం సినిమాల్లో యాక్షన్ తక్కువ.. డ్రామా ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ మూవీలో స్టోరీ లైన్ తో పాటుగా.. యాక్షన్ కూడా ఎక్కువే ఉంటుంది. పైగా ఇక్కడ ఎవరినీ తప్పుబట్టడానికి ఉంటదు. ఎవరి వర్షన్ లో వాళ్లే కరెక్ట్ అనిపిస్తారు.

ఇంతకీ సినమా పేరు చెప్పలేదు కదా.. ఈ మూవీ పేరు ‘కాలా’. ఈ చిత్రం 2021లో విడుదలైంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మిమ్మల్ని ఒక 2 గంటల 6 నిమిషాలు వేరే ప్రపంచానికి తీసుకెళ్తారు. ఈ మూవీలో మీకు ఎక్కవగా కేవలం ఇద్దరి ముఖాలు మాత్రమే కనిపిస్తాయి. ఒకటి హీరో తొవినో థామస్, రెండు ఆ కుర్రాడు సుమేశ్ మూర్. ఇద్దరు తమ ప్రాతలను ప్రాణం పెట్టి చేశారు. ఎవ్వరూ ఎక్కడా తగ్గరు. ఒక్కో సీన్ లో తొవినో థామస్ ను సుమేశ్ మూర్ డామినేట్ కూడా చేస్తాడు. మరి.. ఇంకెందుకు ఆలస్యం ఆహాలో ఉన్న ఈ కాలా సినిమాని వెంటనే చూసేయండి. కాస్త వైలెన్స్ ఉంటుంది జాగ్రత్త.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి