యుద్ధంతో రాసిన ప్రేమకథ.. OTTలో బెస్ట్ కొరియన్ లవ్ స్టోరీ!

OTT Suggestions- Best Korean Drama Descendants Of The Sun: కొరియన్ డ్రామాలు అంటే మీకు ఇష్టమా? అయితే మీకోసం ఒక బెస్ట్ కొరియన్ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. పైగా ఇది తెలుగులోనే అందుబాటులో ఉంది. అంటే అర్థంకాని డైలాగ్స్ కాకుండా.. తెలుగులో చూసేయచ్చు.

OTT Suggestions- Best Korean Drama Descendants Of The Sun: కొరియన్ డ్రామాలు అంటే మీకు ఇష్టమా? అయితే మీకోసం ఒక బెస్ట్ కొరియన్ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. పైగా ఇది తెలుగులోనే అందుబాటులో ఉంది. అంటే అర్థంకాని డైలాగ్స్ కాకుండా.. తెలుగులో చూసేయచ్చు.

కొరియన్ సినిమాలు, సిరీస్లు అంటే ఓటీటీ ప్రేక్షకులు చెవి కోసేసుకుంటున్నారు. అందుకే ఎక్కువ కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్లను తెలుగులోకి కూడా డబ్ చేసేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా ఇంట్రెస్ట్ చూయిస్తున్నాయి. పైగా మన తెలుగు ఆడియన్స్ అయితే కొరియన్ వెబ్ సిరీస్లు అంటే పడి చచ్చిపోతున్నారు. అమ్మాయిలు అయితే ఏకంగా కొరియా భాషలోనే మాట్లాడేస్తున్నారు. సబ్ టైటిల్స్ కూడా లేకుండా కొరియన్ సినిమాలు చూసేస్తున్నారు. కానీ, అబ్బాయిలకు మాత్రం కనీసం సబ్ టైటిల్స్ ఉండాల్సిందే. అందుకే వారికోసం నేరుగా తెలుగులో కూడా ఉన్న ఒక మంచి కొరియన్ డ్రామాని తీసుకొచ్చాం.

ఈ వెబ్ సిరీస్ ట్యాగ్ లైన్ యుద్ధంతో రాసిన ప్రేమకథ. ఈ ట్యాగ్ లైన్ వింటేనే సగం కథ అర్థమైపోతుంది. ఈ లవ్ స్టోరీకి యుద్ధానికి సంబంధం ఉంటుంది. ఎలా అంటే ఈ సినిమాలో ఎప్పుడూ యుద్ధాలు చేసుకుంటే బిజీగా ఉండే ఒక ఆర్మీ జవాను ఉంటాడు. అలాగే యుద్ధాల్లో గాయపడిన వ్యక్తులకు చికిత్స చేస్తూ.. ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న వైద్యురాలు ఉంటుంది. ఆమె ఆ వ్యక్తులు ఎవరు? ఎలాంటి వాళ్లు? వాళ్లు ఏం పని చేస్తారు? మంచి వాళ్లా? చెడ్డవాళ్ల? వారిని కాపాడచ్చా? ఇలాంటి ప్రశ్నలు ఏమీ ఉండవు. ఆపదలో ఉన్న వారిని కాపడటమే ఆమెకు తెలిసింది. అదే పని చేస్తూ ఉంటుంది.

మరోవైపు హీరో యుద్ధంతో బిజీగా ఉంటాడు. అతనికి తెలిసిందల్లా తనకు వచ్చే ఆర్డర్స్ ని అమలు చేయడం మాత్రమే తెలుసు. అది మంచా? చెడా? చేయచ్చా? లేదా? అనే అనుమానాలు, భయాలు ఏమీ పెట్టుకోకుండా.. తన పై అధికారులు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్లిపోతాడు. అతను యుద్ధభూమిలో అడుగుపెట్టాడంటే.. ప్రత్యర్థులు కంగారు పడాల్సిందే. అలాంటి వ్యక్తి ఒకసారి గాయపడతాడు. అతనికి చికిత్స చేసేందుకు ఈ డాక్టర్ మేడమ్ వస్తారు. అలా వారి మధ్య మాటలు కలుస్తాయి. ఆ తర్వాత అవి ప్రేమ వరకు దారి తీస్తాయి. కానీ, వారి మధ్య ఉన్న ప్రేమకథలో ఏదో తెలియని అగాథం ఉంటుంది. ఈ సిరీస్ పేరు ‘డిసెండెంట్స్ ఆఫ్ ది సన్’. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో అందుబాటులో ఉంది. ఇందులో మొత్తం 16 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ దాదాపుగా ఒక గంటసేపు ఉంటుంది. వెబ్ సిరీస్ అంటే కాస్త ల్యాగ్ ఉంటుంది. కాబట్టి సిరీస్లు చూసే అలవాటు ఉన్న వారికి ఇది బాగా నచ్చుతుంది. ఈ వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటే క్లిక్ చేయండి.

Show comments