ఒక్కో సీన్ కి వణికిపోతారు.. OTTలో ది బెస్ట్ హారర్ మూవీ తెలుగులోనే!

OTT Suggestions- Best Horror Movie: హారర్ మూవీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, ఎంత భయపడుతూ చూస్తారు? మీరు గనుక వణక్కుండా ఈ సినిమా చూస్తే గ్రేట్ అనచ్చు. ఒక్కో సీన్ దడ పడుతుంది.

OTT Suggestions- Best Horror Movie: హారర్ మూవీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, ఎంత భయపడుతూ చూస్తారు? మీరు గనుక వణక్కుండా ఈ సినిమా చూస్తే గ్రేట్ అనచ్చు. ఒక్కో సీన్ దడ పడుతుంది.

హారర్ సినిమాలు, హారర్ సిరీస్లు చూసే వాళ్లు ఎంతో మంది ఉంటారు. అయితే అందులో కొంత మంది కొన్ని సినిమాలు మాత్రమే చూస్తారు. ఎందుకంటే మరీ భయంగా ఉంటే చూడలేం అంటూ తప్పించుకుంటారు. ఇంకొంత మంది మాత్రం కచ్చితంగా వెన్నులో వణుకుపుట్టే సినిమాలు మాత్రమే చూస్తాం అంటూ బల్లగుద్ది చెప్తారు. అలాంటి వాళ్లు కూడా ఈ సినిమా చూడాలంటే కాస్త ఆలోచించాలి. ఎందుకంటే ఈ మూవీ కథలోకి వెళ్లే కొద్దీ కచ్చితంగా వణికిపోతారు. అంతేకాకుండా ఈ మూవీని రాత్రిపూట చూడాలి అంటే మాత్రం కాస్త ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి సీన్ కి ఆ భయం పెరుగుతుందే కానీ.. తగ్గదు.

మీరు నింజగానే చాలానే హారర్ సినిమాలు, సిరీస్లు చూసి ఉంటారు. అయితే వాటిలో కథ ఎక్కువ ఉండి.. భయం పుట్టించే అంశాలు కాస్త తక్కువగా ఉంటాయి. కానీ, ఈ సిరీస్లో కథే ఎంతో భయం కలిగిస్తూ ఉంటుంది. ఇది ఒకరి జీవితం కాదు. ఒకరిద్దరు పాత్రలు కాదు. విభిన్న నేపథ్యాలు, భిన్నమైన మనుషుల గురించి చెప్తూ సాగే కథ. అందులో ఉండే పాత్రలు వారి జీవితంలో వారికి జరిగిన అన్యాయాలు, మోసాలు, వారి హత్యలకు సంబంధించి చెప్తూ వెళ్తారు. అయితే ఇదంతా ఒక పుస్తకంలో ఉంటుంది. అది భవిష్యత్ ను తెలియజెప్పే పుస్తకం. ఆ పుస్తకంలో ఉండే కథలను చదువుతూ సినిమాని ముందుకు తీసుకెళ్తారు.

ఈ సినిమాలో ఒక్కో కథలో ఒక మెసేజ్ ఉంటుంది. ఒక్కో కథలో ఒక అన్యాయం, మోసం దాగి ఉంటుంది. అలాగే అన్యాయం చేస్తే.. కచ్చితంగా చావు తప్పదు అనే మెసేజ్ మాత్రం అన్నీ కథలకు సింబాలిక్ గా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా ఒంటరిగా చూడాలి అంటే ముందే ఆలోచించుకోండి. అలా సాగిపోతున్న కథ ఒక్కసారిగా ఎరుపెక్కుతుంది. ఉన్నట్లుండి దెయ్యాలు, బూతాలు కథలోకి వచ్చేస్తాయి. అవి రావడమే కాదండో.. మిమ్మల్ని వణికిస్తాయి. ఇదంతా వందేళ్ల తర్వాత జరగబోయే విషయాల గురించి ఒక మహిళ రాసే పుస్తకం చుట్టూ ఈ సినిమా నడుస్తూ ఉంటుంది. ఆ పుస్తకం పేరు కాటుక బొట్టు. ఆ పుస్తకంలో ఉన్న దెయ్యాలు రియాలిటీలోకి కూడా వస్తూ ఉంటాయి.

ఈ పుస్తకాన్ని చదువుతూ ఉన్న వారికి ఆ దెయ్యాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ పుస్తకంలో ఉన్న కథను చదివిన తర్వాత అవి విడుదలై వెళ్లిపోతాయి అనే కోణంలో ఆ సీన్స్ చూపిస్తారు. అయితే ఆ కథలు చదువుతున్నంతసేపు ఆడియన్స్ కూడా వణుకుతూనే ఉంటారు. ఈ మూవీ పేరు మరేదో కాదు.. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ ప్లే చేసిన ‘కాజల్ కార్తీక’. ఇందులో హీరోయిన్ రెజీనా కథలు చదువుతూ ఉంటుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఒక్కో సీన్లో భయం అంటే ఏంటో తెలుస్తుంది. కొన్ని సీన్స్ కి అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు ఇప్పటికే ఈ కాజల్ కార్తీక సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments