iDreamPost
android-app
ios-app

వీక్ హార్ట్ ఉంటే ఈ మూవీ చూడొద్దు.. OTTలో వణికించే హారర్ చిత్రం!

OTT Suggestions- Best Horror And Suspense Thriller: మీకు హారర్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసే అలవాటు ఉంటే ఈ సినిమా మీకు బెస్ట్ సజీషన్ అవుతుంది. అయితే వీక్ హార్ట్ ఉన్నవాళ్లు మాత్రం అస్సలు చూడొద్దు. ఎందుకంటే కాస్త ఇబ్బంది పడతారు.

OTT Suggestions- Best Horror And Suspense Thriller: మీకు హారర్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసే అలవాటు ఉంటే ఈ సినిమా మీకు బెస్ట్ సజీషన్ అవుతుంది. అయితే వీక్ హార్ట్ ఉన్నవాళ్లు మాత్రం అస్సలు చూడొద్దు. ఎందుకంటే కాస్త ఇబ్బంది పడతారు.

వీక్ హార్ట్ ఉంటే ఈ మూవీ చూడొద్దు.. OTTలో వణికించే హారర్ చిత్రం!

హారర్ సినిమాలు అంటే ఇష్టం. మేము హారర్ సినిమాలు చూడందే నిద్రపోము అంటూ చెప్పేవాళ్లు కూడా ఈ సినిమా చూడాలి అంటే కచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ మూవీ ఎక్స్ ట్రీమ్ గా ఉంటుంది. ఇందులో ప్రతి సీన్, ప్రతి పాయింట్ మిమ్మల్ని కుర్చీ అంచుకు తీసుకొస్తుంది. ఇన్నాళ్లు మీరు నిజంగానే ఒక మంచి మూవీని మాత్రం మిస్ అయ్యారు అని కచ్చితంగా చెప్పచ్చు. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కేటగిరీలో ఈ మూవీకి ఒక మంచి ప్లేస్ ఉంది. సినిమా స్టార్ట్ చేశాక.. ఆపడం మాత్రం అస్సలు జరగదు. అలాగే ప్రతి సీన్ కి వణకకుండా మాత్రం ఉండలేరు. అంతేకాకుండా వైలెన్స్ మాత్రం ఓ రెండు పర్సెంట్లు ఎక్కువగానే ఉంటుంది.

మీకు హారర్ చిత్రాలు ఇష్టమై ఉండి.. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఎంజాయ్ చేసేవాళ్లు అయితే ఇది మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. పైగా ఇందులో హీరో మీ అందరి బెస్ట్ అవెంజర్ థార్ ఉన్నాడు. క్రిస్ హెమ్స్ వర్త్ యాక్టింగ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఒక ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి అడవుల్లో ఉన్న ఒక ఇంటికి వెళ్తారు. అక్కడ కాస్త ఈ సిటీ లైఫ్ కి దూరంగా ఉండచ్చు అని అనుకుంటారు. అయితే వాళ్లు వెళ్లేది సాధారణమైన ఇల్లు అనుకుంటారు. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాతే అసలు విషయం తెలుస్తుంది. కానీ, అక్కడికి వెళ్లడం మాత్రమే జరుగుతుంది. కానీ, ప్రాణాలతో తిరిగి రావడం మాత్రం కుదిరే పని కాదు. ఆ విషయం వారికి వెళ్లిన తర్వాత క్లారిటీ వస్తుంది.

మొదటి రెండ్రోజులు కాస్త ఎంజాయ్ చేశాక.. వారి జీవితాలు మొత్తం తలకిందులు అవుతాయి. ఎందుకంటే అది మామూవులు ఇల్లు కాదు. అది మామూలు అడవి కాదు. అది అంతా కొందరి అధీనంలో ఉండే ఒక ప్రాంతం. దానిలో బిగ్ బాస్ బౌస్ లో ఉండేలాంటి సెటప్ ఉంటుంది. వారి జీవితాలు, ప్రాణాలు వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. వాళ్లు ఏం చేయాలి? ఎలా ఉండాలి అనేది కూడా వీళ్లే కంట్రోల్ చేస్తూ ఉంటారు. వాటికి అదనంగా వారి ప్రాణాలు తీస్తూ ఉంటారు. ఈ చిత్రాన్ని కచ్చితంగా వీక్ హార్ట్ ఉన్న వాళ్లు చూడకపోవడమే చాలా మంచిది. ఈ చిత్రం నిజంగానే అంతే క్రూరంగా ఉంటుంది.

ప్రాణాల కోసం వాళ్లు చేసే పోరాటం ఆకట్టుకుంటుంది. అలాంటి పరిస్థితిలో మనల్ని మాత్రం మనం ఊహించుకోలేం. ఎందుకంటే ఊహించుకోవడానికి కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. ఆ ప్రదేశం మొత్తం వారి చేతుల్లోనే ఉంటుంది. అక్కడి నుంచి తప్పించుకోవడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. ప్రతి విషయాన్ని వాళ్లే కంట్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశం నుంచి ఎవరు ప్రాణాలతో బయటపడ్డారు? అసలు బయట పడ్డారా లేదా? అనేదే కథ. ఈ సినిమాలో ప్రతి విషయం ఆసక్తిగానే ఉంటుంది. ముఖ్యంగా ప్రాణభయంతో వాళ్లు చేసే ప్రయత్నాలు బాగుంటాయి. అలాగే బతకాలి అనే వారి సంకల్పం మెప్పిస్తుంది. ఈ చిత్రం పేరు ‘ది క్యాబిన్ ఇన్ ది ఉడ్స్‘. ఈ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి