iDreamPost
android-app
ios-app

ఈ తండ్రీకొడుకులు వేరే లెవల్.. OTTలో నవ్వి నవ్వి పొట్ట చెక్కలవుతుంది!

OTT Suggestions- Best Father Son Bonding Movie: ఓటీటీల్లో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, ఆ సినిమాల్లో చాలా తక్కువ మాత్రమే వావ్ అనిపిస్తాయి. అలాంటి లిస్ట్ లో ఉండే ఒక సినిమాని మీకోసం తీసుకొచ్చాం. ఈ తండ్రీకొడుకుల బాండింగ్ కి నవ్వి నవ్వి మీ కడుపు చక్కలవుతుంది.

OTT Suggestions- Best Father Son Bonding Movie: ఓటీటీల్లో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, ఆ సినిమాల్లో చాలా తక్కువ మాత్రమే వావ్ అనిపిస్తాయి. అలాంటి లిస్ట్ లో ఉండే ఒక సినిమాని మీకోసం తీసుకొచ్చాం. ఈ తండ్రీకొడుకుల బాండింగ్ కి నవ్వి నవ్వి మీ కడుపు చక్కలవుతుంది.

ఈ తండ్రీకొడుకులు వేరే లెవల్.. OTTలో నవ్వి నవ్వి పొట్ట చెక్కలవుతుంది!

ఈ లోకంలో అంతా తల్లి ప్రేమ గురించి బాగా చెప్తారు. కానీ, ఆ తల్లికంటే కూడా ఎక్కువ పిల్లలను ప్రేమించే.. బాధ్యత చూపించే.. అనుక్షణం వారి గురించి పరితపించే తండ్రి గురించి మాత్రం చాలా తక్కువ మాట్లాడతారు. తల్లి నవమాసాలు మోసి కంటే.. తండ్రి మాత్రం తన తుదిశ్వాస వరకు ఆ పిల్లలను తన గుండెల మీద మోస్తాడు. తన భుజాల మీద వారికి ఈ ప్రపంచాన్ని చూపిస్తాడు. అలాంటి తండ్రి సెంటిమెంట్ ఉండే సినిమాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక బెస్ట్ కామెడీ డ్రామా గురించి ఇవాళ మీకోసం తీసుకొచ్చాం. ఆ కామెడీ డ్రామా మాములుగా ఉంటదు. నవ్వి నవ్వి కడుపు చెక్కలు అవుతుంది.

సాధారణంగా ఏ తండ్రికైనా తన పిల్లలు అంటే వల్లమాలిన ప్రేమ ఉంటుంది. కానీ, ఆ ప్రేమను పైకి చూపించలేడు. ఎందుకంటే తన ప్రేమ చూసి పిల్లలు చెడిపోతారు అనే భయం. అంతేకాకుండా తల్లీ తండ్రి ఇద్దరూ గారం చేస్తే.. పిల్లలు తప్పుదోవ పడతారు అనే కంగారు కూడా ఉంటుంది. అందుకే ఈ లోకంలో ఏ తండ్రీ కూడా తన కొడుకును అంత తేలిగ్గా దగ్గరకు తీసుకోడు. అదంతా కేవలం పదేళ్లలేపు వరకు మాత్రమే. అందుకే ప్రతి అబ్బాయికి తన తండ్రి అంటే విలన్ గానే కనిపిస్తాడు. కానీ, ఆ కంగారు వెనుక దాగున్న ప్రేమను వాళ్లు తండ్రి అయ్యే వరకు అర్థం చేసుకోలేరు. ఇక్కడ ఈ సినిమాలో అది కాస్త రివర్స్ లో ఉంటుంది. తండ్రి మీద ఆ కొడుకు చూపించే ప్రేమ, బాధ్యతను ఆ తండ్రి అర్థం చేసుకోడు.

ప్రతిసారి తండ్రే బాధ్యతగా, ప్రేమగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. వారికి కాస్త వయసు పైబడిన తర్వాత ఆ కుమారుడు కూడా తన తండ్రి గురించి జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో ఉన్న కొడుకు కూడా తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అతను జపాన్ లో ఉంటే ఇక్కడ తండ్రి ఒంటరిగా ఎన్ని కష్టాలు పడుతున్నాడో అని కంగారు పడుతూ ఉంటాడు. అయితే ఆ తండ్రికి టెక్నాలజీ అంటే అస్సలు నచ్చదు. ఒక మిక్సీ, టీవీ, కూలర్ ఇలా ఏదీ దగ్గరకు రానివ్వడు. అన్నీ పాతకాంలో లాగానే జరగాలి అంటాడు.

అంతా పాతకాలంలో లాగానే ఉండాలి అనే అలాంటి తండ్రికి ఆ కొడుకు ఒక రోబోని తీసుకొచ్చి ఇస్తాడు. ఆ రోబో- ఆ తండ్రి మధ్య జరిగే కన్వర్షేన్, ఆ తండ్రి వల్ల కొడుకు పడే కష్టాలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ సినిమా పేరు ఆండ్రాయిడ్ కట్టప్ప. ఈ చిత్రాన్ని దాదాపుగా చాలా మంది చూసే ఉంటారు. కానీ, ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు ఇప్పటికే ఈ ఆండ్రాయిడ్ కట్టప్ప చూసుంటే.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి