iDreamPost

ఏలియన్ తో మహిళ ఒంటరి పోరాటం.. OTTలో ఈ థ్రిల్లర్ కి మెంటలొచ్చేస్తది!

OTT Suggestions- Best Action Movie Prey: హాలీవుడ్ యాక్షన్ డ్రామాలు మీకు ఇష్టమైతే మాత్రం ఇది చాలా మంచి ఆప్షన్ అనే చెప్పాలి. గతంలో ప్రిడేటర్ అని ఆర్ నాల్డ్ తీసిన చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాని తీసుకొచ్చారు. అది కూడా లేడీ ఓరియంటెడ్ మూవీగా.

OTT Suggestions- Best Action Movie Prey: హాలీవుడ్ యాక్షన్ డ్రామాలు మీకు ఇష్టమైతే మాత్రం ఇది చాలా మంచి ఆప్షన్ అనే చెప్పాలి. గతంలో ప్రిడేటర్ అని ఆర్ నాల్డ్ తీసిన చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాని తీసుకొచ్చారు. అది కూడా లేడీ ఓరియంటెడ్ మూవీగా.

ఏలియన్ తో మహిళ ఒంటరి పోరాటం.. OTTలో ఈ థ్రిల్లర్ కి మెంటలొచ్చేస్తది!

వందలో కనీసం వంద మందికి హాలీవుడ్ యాక్షన్ చిత్రాలు అంటే చచ్చేంత ఇష్టం ఉంటుంది. కచ్చితంగా ఒక మంచి యాక్షన్ చిత్రాలు చూస్తూ ఉంటారు. అయితే ఈమధ్యకాలంలో చాలా మందికి మంచి యాక్షన్ చిత్రం దొరకడం లేదు. అయితే మీకోసం ఒక క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ ని తీసుకొచ్చాం. ఈ మూవీ ఇంకా మీరు చూసి ఉండకపోతే మాత్రం చాలా మంచి మూవీని మిస్ అయినట్లే. వచ్చి రెండేళ్లు కావొస్తోంది. కానీ, చాలా మంది ఈ మూవీని చూడలేదు. ఎందుకంటే లేడీ ఓరియంటెడ్ మూవీ కదా ఏం ఫీల్ ఉంటదిలే అని లైట్ తీసుకున్నట్లు కనిపించారు. అయితే ఈ అమ్మాయి యాక్టింగ్ లో ఆర్ నాల్డ్ ని మరిపిస్తుంది.

1987లో వచ్చిన ప్రిడేటర్ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా బాగా తెలుసు. ఆ మూవీలో ఏలియన్ తో ఒక్ లెఫ్ట్ నెంట్ జనరల్ గా ఆర్ నాల్డ్ చేసిన యాక్షన్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. ఒక అడవిలోకి దూరి అక్కడ ఉండే ఒక ఏలియన్ ని ఆర్ నాల్డ్ స్వయంగా ఒక్కడే హతమారుస్తాడు. అలాంటి ఒక్ మూవీకి సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. పైగా ఊ మూవీలో హీరోయిన్ ఒక్కతినే పెట్టి.. లేడీ ఓరియంటెడ్ గా స్టోరీని తెరకెక్కించారు. మొదట ఈ మూవీకి చూలామంది చాలా తక్కువ అంచనా వేశారు. అంటే అమ్మాయి అలాంటి పాత్ర చేయగలదా అని అంతా అనుకున్నారు. కానీ, ఆమె యాక్టింగ్ లో ఆర్ నాల్డ్ కు ఏమాత్రం తీసిపోకుండా నటించింది. అంతేకాకుండా.. బెస్ట్ యాక్టర్ గా మన్ననలు కూడా పొందింది. అంతేకాకుండా ఏలియన్ తో ఉండే సింగిల్ కాంబ్యాక్ట్ లో ఇన్టెన్స్ సీన్స్ లో కూడా బాగా యాక్ట్ చేసింది.

ఈ మూవీలో కథ కూడా దాదాపుగా ప్రిడేటర్ తరహాలోనే ఉంటుంది. కాకపోతే.. ఇక్కడ ఏలియన్ చుట్టపు చూపు కోసం అడవికి వస్తుంది. ఆ అడవిలో ఉండే అమ్మాయికి.. ఏలియన్ కి మధ్య పెద్ద యుద్ధమే జరుగుంది. ఈ నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ నచ్చుతుంది. ఇంక ఈ మూవీ చాలా షార్ట్ గా స్వీట్ గా ఉంటుంది. ఎక్కువసేపు ల్యాగ్ చేయడం, విసిగించడం లాంటి చేయలేదు. ఈ సినిమా పేరు ‘ప్రే’. ఈ సినిమా 2022లో విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ బిరుదు ఇచ్చేశారు. అయితే ఇది కేవలం రెండు భాషల్లోనే అందుబాటులో ఉంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. మీరు కూడా ఒకసారి చూసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి