iDreamPost

OTT Series Suggestion: తెలుగులో మీర్జాపూర్ లాంటి వెబ్ సీరీస్! ఏడాదిగా OTTలో ఉందని తెలుసా?

  • Published Jul 03, 2024 | 7:12 PMUpdated Jul 03, 2024 | 7:12 PM

OTT Best Crime Drama Series : వెబ్ సిరీస్ లంటే హాలీవుడ్ , బాలీవడ్ సిరీస్ లే కాదు.. తెలుగులో కూడా వాటికి మించిన సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు చెప్పుకోబోయే తెలుగు వెబ్ సిరీస్ ను కానీ మీరు మిస్ చేశారేమో ఓ లుక్ వేసేయండి.

OTT Best Crime Drama Series : వెబ్ సిరీస్ లంటే హాలీవుడ్ , బాలీవడ్ సిరీస్ లే కాదు.. తెలుగులో కూడా వాటికి మించిన సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు చెప్పుకోబోయే తెలుగు వెబ్ సిరీస్ ను కానీ మీరు మిస్ చేశారేమో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 03, 2024 | 7:12 PMUpdated Jul 03, 2024 | 7:12 PM
OTT Series Suggestion: తెలుగులో మీర్జాపూర్ లాంటి వెబ్ సీరీస్! ఏడాదిగా OTTలో ఉందని తెలుసా?

ఏదైనా ఓ వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా ఉందంటే.. ఇంకా అలాంటి కంటెంట్ తో ఏమైనా వెబ్ సిరీస్ లు ఉన్నాయేమో అని సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడు ఓటీటీ లలో వెబ్ సిరీస్ లకు ఆదరణ బాగా లభిస్తుంది అన్న సంగతి తెలిసిందే. ఇక ఒకప్పుడు వెబ్ సిరీస్ లంటే హాలీవుడ్ , బాలీవుడ్ సిరీస్ లనే చూసేవారు ప్రేక్షకులు.. కానీ ఇప్పుడు తెలుగులో కూడా కొత్త కాన్సెప్ట్ తో చాలా వెబ్ సిరీస్ వస్తున్నాయి. ఇక వాటిలో క్రైమ్ , సస్పెన్స్ డ్రామాస్ అంటే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా ఇలాంటిదే. మరి ఈ సిరీస్ ను మీరు చూశారో లేదో.. అసలు ఈ తెలుగు క్రైమ్ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.

ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. హైదరాబాద్ లో ఓ చిన్న గల్లీలో జగన్ అనే ఓ యువకుడు ఉంటాడు. అదే బస్తీలో ఉండే మరో ముగ్గురు యువకులతో కలిసి అతను చిన్న చిన్న దొంగతనాలు చేసి.. వచ్చిన డబ్బుతో జల్సాగా తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఓ రోజు పాత కారు కొట్టేసి అమ్మేస్తాడు. అయితే ఆ కార్ లో పది కోట్లు విలువ చేసే డైమండ్స్ ఉన్నాయని తర్వాత తెలుస్తుంది. ఆ డైమండ్ ఓనర్స్ ఏమో వీళ్ళను పట్టుకుంటాడు. తన డైమండ్స్ అయినా ఇవ్వాలని .. లేదా పది కోట్లయినా ఇవ్వాలని.. ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు. దీనితో జగన్, అతని ఫ్రెండ్స్ ఓ పది రోజులు టైమ్ అడుగుతారు. ఈ గ్యాప్ లో ఏటీఎంలకు డబ్బు తీసుకువెళ్ళే వ్యానును కొట్టేస్తారు. ఆ వ్యాన్ లో రూ. 25 కోట్లు ఉంటాయి. దీనితో ఈ కేసు కాస్త ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ హెగ్డే దగ్గరకు వెళ్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి ఆ కేసులో రాజకీయాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. కట్ చేస్తే అదే సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేస్తున్న.. ఆ బస్తి కార్పొరేటర్ గజేంద్ర అరెస్ట్ అవుతాడు. అసలు సరిగా అదే సమయంఓ అతను ఎందుకు అరెస్ట్ అవుతాడు ? ఎమ్మెల్యే టికెట్ కోసం ఆ రూ.25 కోట్లు కొట్టేసే స్కెచ్ గజేంద్ర వేశాడా ? లేదంటే అసలు అక్కడ అసలు ఏం జరిగింది ? ఆ డైమండ్స్ దొరికాయా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

ఈ సిరీస్ పేరు “ఏటీఎం”. ఈ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కథ అందించారు. కాగా ఈ సిరీస్ లో వీజే స‌న్ని, సుబ్బ‌రాజు, ’30 ఇయర్స్’ పృథ్వీ, కృష్ణ బూరుగుల‌, ర‌విరాజ్‌, రాయ‌ల్ శ్రీ, ‘బిగ్ బాస్’ దివి, దివ్యవాణి, ష‌ఫీ, హ‌ర్షిణి లాంటి నటి నటులు ప్రధాన పాత్రలో నటించారు. స్టోరీ చదవడానికి కామన్ గా అనిపించినా కానీ ఒక్కసారి స్క్రీన్ మీద చూస్తే మాత్రం.. చివరి ఎపిసోడ్ అయ్యేంత వరకు కూడా ఎక్కడికి కదలాలని అనిపించదు. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తి ప్రతి స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచే కలుగుతూ వస్తుంది. ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి