iDreamPost
android-app
ios-app

సౌండ్ చేస్తే ప్రాణాలు పోతాయి.. OTTలో ప్రతి నిమిషం థ్రిల్ చేసే మూవీ!

  • Published Jul 08, 2024 | 5:33 PM Updated Updated Jul 08, 2024 | 5:33 PM

OTT Best Suspense Drama : సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలు ఒక్కోటి ఒక్కో రకంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అన్నిటిని ఒకటే ప్లాట్ లో ఉంచి సినిమా కథను అంచనా వేయలేము. ఇప్పడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Suspense Drama : సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలు ఒక్కోటి ఒక్కో రకంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అన్నిటిని ఒకటే ప్లాట్ లో ఉంచి సినిమా కథను అంచనా వేయలేము. ఇప్పడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 08, 2024 | 5:33 PMUpdated Jul 08, 2024 | 5:33 PM
సౌండ్ చేస్తే ప్రాణాలు పోతాయి.. OTTలో ప్రతి నిమిషం థ్రిల్ చేసే మూవీ!

కొన్ని సినిమాలు చేసేటప్పుడే తర్వాత ఏం జరుగుతుందా అని కొంచెం అయినా గెస్ చేయడానికి వీలు ఉంటుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం చివరి వరకు కూడా నెక్స్ట్ ఇది అని అంచనా వేయలేము. హర్రర్ , మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ వీటిని కనీసం గెస్ చేసే వీలు ఉంటుంది.. కానీ సస్పెన్స్ థ్రిల్లర్స్ అలా కాదు. అందుకే ఇలాంటి సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే.. ఇప్పటివరకు ఓటీటీ లో చాలానే సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసి ఉంటారు కానీ.. ఈ సినిమా మాత్రం కాస్త డిఫరెంట్. . మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఓ సారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక రోజు భూమి మీద ఓ పెద్ద ఆస్ట్రాయిడ్ పడుతుంది. దానితో పాటు ఓ ఏలియన్ కూడా కిందికి వస్తుంది. దానితో భూమి మీద ఉన్న ప్రాణులన్నీ కూడా చనిపోతాయి. కానీ వాటి నుంచి ఒకే ఒక్క ఫ్యామిలీ మాత్రం దాని నుంచి తప్పించుకుంటుంది. అదే ఎబోర్ట్ ఫ్యామిలీ.. ఆ ఫ్యామిలీ ఓ సూపర్ మార్కెట్ నే ఇల్లులా చేసుకుని.. సైలెంట్ గా నివసిస్తూ ఉంటారు. లీ అనే వ్యక్తి ఆ ఫ్యామిలీ ఓనర్.. ఆ భార్య భర్తలకు ముగ్గురు పిల్లలు ఉంటారు. వారంతా కూడా అక్కడ అమెరికన్ కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే లీ కొడుకు దగ్గర ఓ శబ్దం చేసే బొమ్మ ఉంటుంది. అది ఎప్పుడు తనతోనే ఉంచుకుంటాడు తన కొడుకు. అయితే కొద్దీ రోజులకు వారంతా వేరే ప్లేస్ కు వెళ్లాల్సి వస్తుంది. అయితే లీ కొడుకు తన బొమ్మను కూడా తనతో పాటు పట్టుకుని వెళ్తాడు. దీనితో లీ దానిలో ఉన్న బ్యాటరీస్ తీసేసి.. సైలెంట్ గా అందరు కలిసి సౌండ్ చేయకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే దారిలో లీ కొడుకు దానిలో బ్యాటరీస్ వేసి సౌండ్ చేస్తాడు. దీనితో ఆ వింత క్రియేచర్ అతని దగ్గరకు వచ్చి అతనిని ఎత్తుకుని వెళ్ళిపోతుంది.

ఆ వింత క్రియేచర్ కు అస్సలు కళ్ళు కనిపించవు కానీ.. చెవులు మాత్రం క్లియర్ గా వినిపిస్తాయి. ఆ చిన్న శబ్దం చేసిన కానీ వాళ్ళను ఆ క్రియేచర్ చంపేస్తుంది. దీనితో లీ జాగ్రత్తగా సైలెంట్ గా ఉంటూ.. తన ఫ్యామిలీ ని కాపాడుకుంటూ ఉంటాడు. ఆ క్రియేచర్ మాత్రం ఆ ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ రోజు లీ తన ఇంకొక కొడుకును తీసుకుని నది దగ్గరకు వెళ్లి గట్టి గట్టిగ మాట్లాడుతూ ఉంటాడు, ఆ నది అలల శబ్దంలో ఆ మాటలు ఆ క్రియేచర్ కు వినిపించవు. ఒకవైపు ఇంట్లో లీ భార్య ఒక్కతే ఉంటుంది. అయితే అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో.. నొప్పులు మొదలవుతాయి. దీనితో ఆ నొప్పిని భరించలేక ఆమె గట్టిగ అరుస్తుంది, దీనితో ఆ క్రియేచర్ లీ భార్య దగ్గరకు వస్తుంది. ఎలాగూ ఆమె దాని నుంచి తప్పించుకుని.. ఓ చిన్న పాపకు జన్మనిస్తుంది. అయితే ఆ చిన్న పాప ఏడవడం వలన మల్లి ఆ క్రియచేర్ అక్కడకు వస్తుంది. అసలు ఆ క్రియేచర్ ఏంటి ? లీ దాని నుంచి తన పిల్లలను, భార్య ను కాపాడుకోగలుగుతాడా లేదా ? ఆ తర్వాత ఏం జరిగింది? ఇవన్నీ తెలియాలంటే “ఆ క్వైట్ ప్లేస్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి