iDreamPost
android-app
ios-app

OTT లో కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘బ్లింక్’ ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్..

  • Published Aug 12, 2024 | 6:45 PM Updated Updated Aug 12, 2024 | 6:45 PM

OTT Sci-Fi Thriller In Telugu: ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చిన ముందుగా వేరే లాంగ్వేజ్ లో రిలీజ్ అయినా కూడా.. ఆ తర్వాత తెలుగులోకి కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ యాడ్ అయిపోయింది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

OTT Sci-Fi Thriller In Telugu: ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చిన ముందుగా వేరే లాంగ్వేజ్ లో రిలీజ్ అయినా కూడా.. ఆ తర్వాత తెలుగులోకి కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ యాడ్ అయిపోయింది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

  • Published Aug 12, 2024 | 6:45 PMUpdated Aug 12, 2024 | 6:45 PM
OTT లో కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘బ్లింక్’ ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్..

ఇప్పుడు ఓటీటీ లోకి వస్తున్న సినిమాలన్నిటిని లాంగ్వేజ్ బారియర్ లేకుండా.. కథను బట్టి హైలెట్ చేస్తున్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఈ మధ్యన కొన్ని సినిమాలను మేకర్స్ ముందుగా ఒరిజినల్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసినా కూడా.. ఆ తర్వాత ఆయా సినిమాలకు పెరుగుతున్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని.. వాటిని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఇటీవల కేవలం కన్నడలో లాంగ్వేజ్ లో మాత్రం ఓటీటీ లోకి వచ్చిన.. ఓ ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. ఇప్పడు తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ మరేదో కాదు.. కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన బ్లింక్ మూవీ. మార్చి 8న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా అనుకోని విధంగా సూపర్ సక్సెస్ అవ్వడంతో.. మే నెలలోనే ఈ సినిమాను ఓటీటీ లోకి తీసుకుని వచ్చారు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయగా.. కొద్దీ రోజుల్లోనే ఓటీటీ లో కూడా ట్రెండింగ్ వ్యూస్ వచ్చాయి. అయితే ఆ సమయంలో ఈ సినిమాను కేవలం కన్నడలో మాత్రమే రిలీజ్ చేయగా.. అనుకోకుండా కొద్దీ రోజులకు ఈ సినిమాను ఓటీటీ నుంచి మాయమైపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను మళ్ళీ తెలుగు వెర్షన్ ను యాడ్ చేసి.. అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు మేకర్స్ . కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి.

ఇక బ్లింక్ మూవీ కథ విషయానికొస్తే.. ఇదొక టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో.. వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ.. ఈ సినిమా కథ అంతా కూడా 1996, 2001, 20221, 2034 సంవత్సరాల మధ్యలో కొనసాగుతూ ఉంటుంది. అప్పటికే యాక్టింగ్ పైన ఉండే ఆసక్తి వలన.. దీక్షిత్ ఎంఏ పూర్తిచేయకుండా మధ్యలోనే వదిలేస్తాడు. పైగా ఆ విషయాన్నీ ఇంట్లో తెలీకుండా దాచిపెడతాడు. అయితే అతనికి కనిరెప్పలను కొట్టకుండా అలానే ఉంచే శక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక అతనికి ఓ వృద్ధుడు తన తండ్రి గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్తాడు. అప్పటినుంచి అతని పరిస్థితులన్నీ ఒక్కసారిగా తారుమారు అయిపోతాయి. అసలు ఆ వృద్ధుడు చెప్పిన రహస్యాలు ఏంటి ? టైం మిషన్ ను అతనికి సంబంధం ఏంటి ? కథ ఎలా ముందుకు కొనసాగింది ? ఆ తర్వాత ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.