iDreamPost
android-app
ios-app

OTTలోకి ఇంట్రెస్టింగ్ మైథలాజికల్ డ్రామా ‘కన్యక’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 28, 2024 | 11:45 PM Updated Updated Aug 28, 2024 | 11:45 PM

OTT New Release- Telugu Movie Kanyaka : ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. అది కూడా రెగ్యులర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కాకుండా .. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ గా ఈ మూవీ రాబోతుంది. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.

OTT New Release- Telugu Movie Kanyaka : ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. అది కూడా రెగ్యులర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కాకుండా .. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ గా ఈ మూవీ రాబోతుంది. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.

  • Published Aug 28, 2024 | 11:45 PMUpdated Aug 28, 2024 | 11:45 PM
OTTలోకి ఇంట్రెస్టింగ్ మైథలాజికల్ డ్రామా ‘కన్యక’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఈ మధ్య డైరెక్ట్ గా ఓటీటీ లోకి రాబోయే సినిమాల సంఖ్య పెరిగిపోయింది. పైగా ఆ సినిమాలకు వచ్చే క్రేజ్ కూడా అదే రేంజ్ లో ఉంది. ఇక ప్రతి వారం ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్న కూడా.. ఇంకా కొత్త సినిమాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఈ క్రమంలో మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేయడానికి.. సరికొత్త సినిమా ఓటీటీ లోకి రాబోతుంది. అయితే ఇది రెగ్యులర్ సినిమా అయితే కాదు .. సమాజానికి ఉపయోగపడే ఓ మెసేజ్ ఒరిఎంటేడ్ ఫిల్మ్. ఇప్పుడు ఇలాంటి సినిమాలు చాలా అవసరం చాలా ఉంది. అసలు ఈ సినిమా ఏంటి ఎక్కడ , ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు ‘కన్యక’. ఈ సినిమాకు రాఘవేంద్ర తిరువాయి పాటి దర్శకత్వం వహించగా.. కేవీ అమర్, పూర్ణ చంద్ర రావు, సాంబశివ రావు.. కలిసి శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన 15 పాటలు , మూవీ ట్రైలర్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయనున్నారు. వినాయక చవితి సంధర్బంగా ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. అయితే రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో కాకుండా ఈ మూవీని Bcineet అనే ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో రెంటల్ విధానంలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అది కూడా కేవలం రూ.49 కి మాత్రమే. ఇక ఆ తర్వాత ఈ సినిమాను రెగ్యులర్ ఓటీటీ లో తెలుగులోకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదు.

ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. మహిళల పట్ల తప్పుగా ప్రవరిస్తే.. ఎవరు క్షమించి వదిలేసినా అమ్మవారు మాత్రం కచ్చితంగా శిక్షిస్తుందని.. అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాము. దాని గురించి కథలు కథలుగా తరచు వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. మార్పు మాత్రం రావడం లేదు. సో ఇదే కాన్సెప్ట్ పై ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమా చూసిన తర్వాతైనా ఏదైనా మార్పు వస్తుందేమో.. ఈ మూవీ ప్రేక్షకులలో ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.