ఒక OTTలోకి వచ్చేసిన హరోంహర.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

OTT New Releases- Sudheer Babu Harom Hara: యువ దళపతి సుధీర్ బాబు ఇటీవల హీరోగా మెప్పించిన హరోంహర చిత్రం సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఒకటే ఓటీటీలోకి ఈ మూవీ వచ్చింది. మరి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

OTT New Releases- Sudheer Babu Harom Hara: యువ దళపతి సుధీర్ బాబు ఇటీవల హీరోగా మెప్పించిన హరోంహర చిత్రం సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఒకటే ఓటీటీలోకి ఈ మూవీ వచ్చింది. మరి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ఒక సినిమా కోసం బాగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో ఓటీటీలోకి రావాల్సింది. కానీ, తీరా స్ట్రీమింగ్ డేట్ వచ్చిన రోజు ఓటీటీలోకి అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత మళ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇప్పడు చెప్పుకుంటున్న సినిమా యువ దళపతి సుధీర్ బాబు నటించి హరోం హర. ఈ మూవీకి టాలీవుడ్ లో మంచి టాక్ వచ్చింది. సినిమాకి మంచి అప్లాజ్ లభించింది. అందుకే థియేటర్లో మిస్ అయిన వాళ్లు మాత్రమే కాదు.. చూసిన వాళ్లు కూడా ఈ హరోంహర సినిమాని ఓటీటీలో చూసేందుకు తెగ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వెయిటింగ్ కి తెర పడింది. ఒక ఓటీటీలోకి ఈ సినిమా వచ్చేసింది.

సుధీర్ బాబు హరోంహర ఓటీటీ ఎంట్రీ కోసం తెగ ఎదురుచూస్తున్న ఓటీటీ అభిమానులకు శుభవార్త అందింది. ఎందుకంటే ఓటీటీలోకి ఈ సినిమా ఎంట్రీ ఇచ్చేసింది. ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కూడా అవుతోంది. నిజానికి.. హరోంహర రెండు ఓటీటీల్లోకి వస్తుంది అని చెప్పారు. కానీ, ప్రస్తుతం ఒక ఓటీటీలో మాత్రమే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రెండో ఓటీటీలో ఎంట్రీ కోసం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే ఈటీవీ విన్ జులై 18న స్ట్రీమింగ్ చేస్తామంటూ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఓహాలోకి వచ్చేసింది. ఇప్పుడు ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతూ ఉంది. మరి.. ఈ సినిమా కథ గురించి తెలుసుకుందాం.

కథ ఏంటంటే?:

రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా నడుస్తూ ఉంటుంది. 80వ దశకంలో కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి(లక్కీ లక్ష్మణ్) తన గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. అతను చేయని దారుణాలు ఉండవు. భూముల కబ్జా.. అత్యాచారాలు.. హత్యలు కూడా చేస్తుంటాడు. ఆ ప్రాంతంలో పుట్టిన పెరిగిన వాళ్లే ఉండే పరిస్థితి ఉండదు. అలాంటి చోటుకు హీరో వస్తాడు. పాలిటెక్నిక్ కాలేజ్ లో ల్యాబ్ అసిస్టెంట్ గా వస్తాడు. ఈ తమ్మిరెడ్డి గ్యాంగ్ తో సుబ్రహ్మణ్యంకు గొడవ జరుగుతుంది. ఆ గొడవతో తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. అదే సమయంలో తండ్రి చేసిన అప్పులు నెత్తిన పడతాయి. వాటిని తీర్చేందుకు హీరో ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు. అది అతని జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పింది? అక్రమ ఆయుధాల తయారీలో ఏ స్థాయికి ఎదిగాడు? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీద ఈ సినిమా సాగుతుంది. పుష్ప తరహాలో ఎలివేషన్స్ మీద ఈ సినిమాని నడిపించారు. సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments