iDreamPost

Best Horror Movie In OTT: ఇంట్లో దెయ్యాన్ని పెంచుతున్న హీరో.. OTT లో ఇలాంటి హర్రర్ మూవీ చూసి ఉండరు

  • Published Jun 25, 2024 | 7:29 PMUpdated Jun 25, 2024 | 7:29 PM

OTT Movie Suggestion: ఓటీటీ లో ఈ మధ్య అన్నీ హర్రర్ , సస్పెన్స్ సినిమాలే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Movie Suggestion: ఓటీటీ లో ఈ మధ్య అన్నీ హర్రర్ , సస్పెన్స్ సినిమాలే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 25, 2024 | 7:29 PMUpdated Jun 25, 2024 | 7:29 PM
Best Horror Movie In OTT: ఇంట్లో దెయ్యాన్ని పెంచుతున్న హీరో.. OTT లో ఇలాంటి హర్రర్ మూవీ చూసి ఉండరు

ఓటీటీ లో ఇప్పుడు అన్నీ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ వస్తున్నాయి. ఈ టైప్ అఫ్ కంటెంట్ ను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నమాట వాస్తవమే. అలాగే అదే రేంజ్ లో ఆయా సినిమాలు , సిరీస్ లు కూడా హిట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. ప్రేక్షకులకు ఈ సినిమాలపై ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని.. మేకర్స్ కూడా సరికొత్త విధంగా సినిమాలను తీస్తున్నారు. మరి ఆల్రెడీ తెలుగులో ఉన్న ఈ హర్రర్ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి. ఇంతకీ ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథేంటంటే.. ఓ పాపులర్ టెలివిజన్ ఛానెల్ లో.. ఓ పాపులర్ హర్రర్ షో కు .. ప్రోగ్రాం డైరెక్టర్ గా చేస్తూ ఉంటాడు.. చైతు అనే యువకుడు. ఓ పెద్ద బంగాళాలో నివసించాలి అనేది తన తండ్రి కోరిక.. కాబట్టి దాని కోసం అతను బాగా కష్టపడుతూ ఉంటాడు. చివరకు తానూ అనుకున్నట్లుగానే కస్టపడి ఓ పెద్ద భవంతిని కొనుగోలు చేస్తాడు. అందులోనే నివసిస్తూ ఉంటాడు. అయితే అంతా బాగానే జరుగుతుంది అనుకునే క్రమంలో.. ఆ భవంతి నుంచి చైతూను ఖాళీ చేయించడానికి ఓ దెయ్యం ప్రయత్నిస్తుంది. ఆ ఇంట్లో దెయ్యం ఉందని అతనికి ముందే తెలుసా తెలీదా ! ఆ దెయ్యం ఎందుకు చైతు ను ఇళ్ళు ఖాళీ చేయించాలని చూస్తుంది.? అసలు ఆ దెయ్యం ఎవరు ? ఎంతో కష్టపడి కొన్న ఇంటిని చైతు వదులుకుంటాడా లేదా ! అసలు తర్వాత ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

హారర్, థ్రిల్లర్ సినిమాలు తెరకెక్కించడమంటే చాలా రిస్క్ అని చెప్పి తీరాలి. అలాంటిది తెలుగులో ఇలాంటి ఓ సినిమాను తీసి మేకర్స్ సక్సెస్ అయ్యారు అని ఈ సినిమా చూసిన అందరికి అనిపిస్తుంది. ఈ సినిమాలో శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పేరు ఏంటంటే “వేయి శుభములు కలుగు నీకు”. ఇక ఈ సినిమాలో శివాజీ రాజాతో పాటు విజయ్ రాజా , శివాజీ రాజా, తమన్నా వ్యాస్, ఢీ ఫేం ఫాల్గుణి, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియ, వెంకట్ నారాయణ, షాయాజి షిండే, శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి, రచ్చ రవి, జబర్దస్త్ అప్పా రావు లాంటి వారు ఎంతో మంది ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి