iDreamPost
android-app
ios-app

సూర్యుడు లేకపోతే భూమిపై ప్రాణులు బ్రతుకుతాయా! OTT లో ఫ్యూచరిస్టిక్ మూవీ

  • Published Jul 20, 2024 | 1:30 AMUpdated Jul 20, 2024 | 1:30 AM

OTT Best Sci-Fi Movie : ఇప్పటివరకు ఎన్నో సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసి ఉంటారు కానీ.. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ మాత్రం చూసి ఉంటారు. కానీ ఇలాంటి ఫ్యూచరిస్టిక్ మూవీ మాత్రం చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

OTT Best Sci-Fi Movie : ఇప్పటివరకు ఎన్నో సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసి ఉంటారు కానీ.. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ మాత్రం చూసి ఉంటారు. కానీ ఇలాంటి ఫ్యూచరిస్టిక్ మూవీ మాత్రం చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

  • Published Jul 20, 2024 | 1:30 AMUpdated Jul 20, 2024 | 1:30 AM
సూర్యుడు లేకపోతే భూమిపై ప్రాణులు బ్రతుకుతాయా! OTT లో ఫ్యూచరిస్టిక్ మూవీ

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చూడడం అంటే అందరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సస్పెన్స్ అనేది కేవలం మర్డర్ , క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ లో మాత్రమే ఉండదు. కొన్ని సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో కూడా.. చివరికి ఏమౌతుందా అనే సస్పెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సైన్స్ ఫిక్షన్ మూవీ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇప్పడు ఎవరికీ తెలియని గతం గురించైనా ఉంటుంది. లేదా పూర్తిగా ఫ్యూచర్ గురించైనా ఉంటుంది. ఫ్యూచర్ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఇప్పటివరకు ఎన్నో సైన్స్ ఫిక్షన్ మూవీస్ చూసి ఉంటారు కానీ.. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ మూవీ మాత్రం చూసి ఉండరు. మరి ఈ మూవీ ఏంటో ఈ మూవీని మీరు చూశారో లేదో.. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. 2061 భూమిలో చాలా చోట్ల భూకంపాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. దీని వలన ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటాయి. ముందు ఇవన్నీ న్యాచురల్ డిజాస్టర్స్ అని అనుకుంటూ ఉంటారు. సో దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత సూర్యుడు ప్రకాశించడం తగ్గిపోయి.. పెద్దగా పెరిగిపోతూ ఉంటాడు. దాని వలనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయని. సైంటిస్ట్ లు కనిపెడతారు. కొంచెం కొంచెం పెరుగుతున్న సూర్యుడు.. ఇంకొక 100 సంవత్సరాలలో భూమిని మింగే అంత పెద్దది అవుతుంది. 300 సంవత్సరాలలో మొత్తం సోలార్ సిస్టం మొత్తం అంతరించిపోతుంది. దీనితో ఈ సమస్యను ఎదుర్కోడానికి అన్ని కంట్రీస్ కలిసి.. యునైటెడ్ ఎర్త్ గవర్నమెంట్ అనే ఓ ఆర్గనైజషన్ స్టార్ట్ చేశారు. మన భూమిని ఈ సోలార్ సిస్టం నుంచి మరొక సోలార్ సిస్టం కు మార్చాలని డిసైడ్ అవుతారు. దాని కోసం భూమిపై పదివేల ఎర్త్ ఇంజెన్స్ ను కంస్ట్రక్ట్ చేస్తారు. భూమి కొత్త సోలార్ సిస్టం ను రీచ్ అవ్వడానికి 2500 సంవత్సరాలు ట్రావెల్ చేయాలి.

ఈ మూవీ స్టార్టింగ్ లో ఓ ఆస్ట్రానెట్ ఫ్యామిలీ ని చూపిస్తారు. భూమి వేరే సోలార్ సిస్టం ను చేరుకునే ప్రాసెస్ లో దానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎర్త్ పైన కొన్ని నావిగేషన్ ప్లాట్ ఫార్మ్స్ ఉంటాయి. అక్కడ కొంతమంది ఆస్ట్రానట్స్ వర్క్ చేస్తూ ఉంటారు. హీరో కూడా వారిలో ఒకడు. భూమి ట్రావెల్ చేయడం వలన.. సూర్యుడు , చంద్రుడు ప్రకాశించడం మానేస్తాయి. దీనితో భూమిపై గందరగోళంగా మారిపోతుంది. అలా 17 సంవత్సరాలు గడిచిపోతుంది. అసలు నిజంగానే భూమి మరొక సోలార్ సిస్టం కు మారడం జరుగుతుందా.. మరి ఆ ప్రాసెస్ సక్సెస్ అయిందా లేదా.. ఈ క్రమంలో వారు ఎదుర్కున్న ప్రాబ్లమ్స్ ఏంటి.. ఆ ఆస్ట్రానట్ తన కుటుంబాన్ని ఈ సమస్యల నుంచి ఎలా కాపాడాడు.. ఇవన్నీ తెలియాలంటే.. “ది వండరింగ్ ఎర్త్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. OTT లో ఈ ట్రెషర్ హంట్ మూవీ మిస్ చేశారా! ఇదొక మాస్టర్ పీస్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి