Swetha
OTT Best Fictional Movie : హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు .. అసలు గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
OTT Best Fictional Movie : హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు .. అసలు గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
Swetha
కొద్దిసేపు రెగ్యులర్ గా అందరు చూసే సస్పెన్స్ , ఇన్వెస్టిగేషన్ , హర్రర్ , కామెడీ సినిమాలను పక్కన పెట్టేస్తే.. వీటి అన్నిటికంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించేవి.. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలు. ఈ జోనర్ లో చాలా తక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ వచ్చిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. అసలు గతంలో ఏం జరిగింది అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. దాదాపు ఇవన్నీ కూడా నిజ జీవితాలను ఆధారంగా తీసుకుని రూపొందిస్తు ఉంటారు.. లేదా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ను తీసుకుని కల్పిత కథలను సృష్టిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.
ఈ మూవీ పేరు ది కింగ్స్ మ్యాన్ . ఈ సిరీస్ లో ఇప్పటికి మూడు సినిమాలు వచ్చాయి. మొదట రెండు సినిమాలు చూడకపోయినా కూడా ఈ మూవీ అర్ధమౌతుంది. కింగ్స్ మ్యాన్ సీక్రెట్ ఏజెన్సీ ని ఎవరు ఎందుకు స్థాపించారు అనేది చూపిస్తున్నారు. అయితే తెలుగులో ఆర్ఆర్ఆర్ మూవీ ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలియనిది కాదు. ఆ మూవీ లో ఎలా అయితే రెండు నిజ జీవిత పాత్రల మధ్య కల్పిత కథను అల్లారో ఈ మూవీలో కూడా.. చరిత్రలో జరిగిన కొన్ని క్యారెక్టర్స్ ను తీసుకుని వాటి మధ్య కల్పిత కథను అల్లారు. ఇక ఈ మూవీ కథ విషయానికొస్తే.. 1902 లో సౌత్ ఆఫ్రికాలోని ఓ ప్రాంతంలో బ్రిటన్ , సౌత్ ఆఫ్రికా మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ టైం లో ఆ ప్రాంతంలో బాగా సంపన్నుడైన వ్యక్తి ఓర్లాండో తన కుటుంబంతో కలిసి ఆఫ్రికాలోని తన ఫ్రెండ్ ను కలవడానికి వెళ్తారు. అయితే అక్కడ జరిగిన ఓ యుద్ధంలో ఓర్లాండో భార్య చనిపోతుంది. చనిపోయే ముందు ఆమె యుద్ధం లేని దేశాన్ని చూడాలని.. తన కొడుకు చూసే చివరి యుద్ధం అదే అయ్యి ఉండాలని.. ఓర్లాండో దగ్గర మాట తీసుకుంటుంది.
కట్ చేస్తే స్టోరీని 12 ఏళ్ళ తర్వాత చూపిస్తారు. ఓర్లాండ్ తన కొడుకుని ఈ యుద్ధాలకు ఎంత దూరంగా ఉంచాలనుకుంటాడో.. అతను మాత్రం ఆర్మీ కి వెళ్లి దేశ సేవ చేయాలనీ అంత ఇంట్రెస్ట్ తో ఉంటాడు. మరో వైపు కొండప్రాంతంలో ఓ వ్యక్తి మేకలను పెంచుతూ.. ఓ సీక్రెట్ సొసైటీ ని ఏర్పాటు చేస్తారు. వాళ్లంతా పెద్ద పెద్ద దేశాల మధ్య గొడవలు పెడుతూ బ్రిటన్ ను నాశనం చేయాలనీ అనుకుంటాడు. అయితే దీనిని ఆపాలని ఓర్లాండో తన ఫ్రెండ్ తో డిస్కస్ చేస్తాడు. ఈసారి జరిగే యుద్దాన్ని ఎలా అయినా ఆపాలని వారంతా అనుకుంటూ ఉంటారు. అంతలోనే ఇంగ్లాండ్ , జెర్మనీ , రష్యా మధ్య యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ యుద్ధంలో ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతారు. అసలు షెపర్డ్ ఈ యుద్దాలు జరిగేలా ఎందుకు చేస్తాడు ? ఓర్లాండ్ కొడుకు ఈ యుద్ధాలను ఆపుతాడా ! అసలు అతను ఆర్మీలో జాయిన్ అవుతాడా ! ఆ తరువాత ఏం జరుగుతుంది ? ఓర్లాండ్ తన భార్యకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడా లేదా? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా ఎవరు చూడకపోతే మాత్రం.. ముందు రెండు పార్ట్శ్ కూడా వెంటనే చూసేయండి.మరి ఈ సినిమాపై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.