iDreamPost
android-app
ios-app

OTT Suggestion : OTT లో ఈ మూవీ చూస్తే డిస్టర్బ్ అవ్వాల్సిందే ! ఒంటరిగా చూడండి..

  • Published Jun 29, 2024 | 6:30 PM Updated Updated Jun 29, 2024 | 6:30 PM

Must Watch Movie In OTT : కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం వస్తే.. కొన్ని సినిమాలు మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ తో వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా మీ వాచ్ లిస్ట్ లో ఉందో లేదో ఓసారి చెక్ చేయండి.

Must Watch Movie In OTT : కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం వస్తే.. కొన్ని సినిమాలు మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ తో వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా మీ వాచ్ లిస్ట్ లో ఉందో లేదో ఓసారి చెక్ చేయండి.

  • Published Jun 29, 2024 | 6:30 PMUpdated Jun 29, 2024 | 6:30 PM
OTT Suggestion : OTT లో ఈ మూవీ చూస్తే డిస్టర్బ్ అవ్వాల్సిందే ! ఒంటరిగా చూడండి..

మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను కూడా ప్రేక్షకులు ఈ మధ్య బాగానే చూస్తున్నారు. కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటే.. కొన్ని సినిమాలు మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ ను అందిస్తూ ఉంటాయి. అసలు జీవితంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు కొన్ని సినిమాలను చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. అయితే కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు మైండ్ కాస్త డిస్టర్బ్డ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. కానీ చివరి వరకు చూస్తే కానీ.. అసలు కథ ఏంటి అనేది తెలియదు. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. చూసేయండి.

ఈ సినిమా కథేంటంటే.. ఈ సినిమాలో హీరో వాళ్ళ అమ్మకు టీవీ షోస్ అంటే చాలా ఇష్టం.. ఎప్పుడు టీవీ చూస్తూ.. ఎదో ఒకటి తింటూ ఉంటుంది. దీనితో ఓ రోజు హీరో.. వాళ్ళ ఇంట్లో ఉన్న టీవీని అమ్మేసి ఆ డబ్బులతో డ్రగ్స్ కొంటూ ఉంటాడు. ఇవన్నీ తెలిసినా కానీ తన మీద ఉన్న ఇష్టం తో వాళ్ళ అమ్మ తనని ఏమి అనదు. సైలెంట్ గా వాళ్ళ అమ్మ మళ్ళీ డబ్బులు కట్టేసి..ఆ టీవీ తెచ్చుకుని తన ఇష్టమైన టీవీ షో చూస్తుంది. ఈ క్రమంలోనే ఆమె చూసే టీవీ షో నుంచే కాల్ ఆమెకు కాల్ వస్తుంది. ఈ టీవీ షో లో పార్టిసిపేట్ చేయడానికి మీరు కూడా సెలెక్ట్ అయ్యారాని చెప్పడంతో.. ఈమెకు ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. దీనితో ఆ టీవీ షో కోసం డ్రెస్ ను సెర్చ్ చేస్తూ ఉంటుంది. కానీ ఈమె ఎప్పుడు తింటూ ఉండడం వలన తనకిష్టమైన డ్రెస్ లు తనకు అసలు సరిపోవు. దీనితో వాళ్ళ ఫ్రెండ్ చెప్పడంతో.. ఆమె వెయిట్ తగ్గడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. చివరికి డాక్టరు దగ్గరకు వెళ్లి మందులు కూడా వాడుతుంది. కానీ దాని వలన ఆమెకు ఉన్న అందం కూడా పోతుంది.

ఇక హీరో విషయానికొస్తే.. హీరో ఓ డ్రగ్ ఎడిక్ట్ .. తనకు ఓ గర్ల్ ఫ్రెండ్ , ఒక ఫ్రెండ్ ఉంటారు వాళ్లిద్దరూ కూడా డ్రగ్ ఎడిక్ట్స్ గానే ఉంటారు. వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూనే.. వేరే వాళ్లకు కూడా సప్ప్లై చేయడంతో వాళ్లకు డబ్బులు బాగా వస్తాయి. ఈ క్రమంలో వాళ్ళ అమ్మను కలవడానికి వస్తాడు. వాళ్ళ అమ్మ మాత్రం ఆ టీవీ షో కి ఎలాగైనా వెళ్ళాలని పిచ్చిగా కలలు ఉంటూ ఉంటుంది. మరో వైపు డ్రగ్స్ కేసులో హీరోను పోలీసులు అరెస్ట్ చేస్తారు. వాళ్ళ అమ్మ ఏమో ఆ టీవీ షో కు వెళ్లాలనే తపనతో పిచ్చిదైపోతుంది.. అసలు చివరకు ఈ స్టోరీ ఎలా ముందుకు సాగుతుంది! చివరకు ఏమవుంతుంది ! అసలు ఇంతకీ ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలని అనుకుంటున్నారు. ఇవన్నీ తెలియాలంటే “రిక్విమ్ ఫర్ ఎ డ్రీమ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి.