Swetha
OTT Suggestions: వెండి తెరపైన కనిపించే హీరో హీరోయిన్స్ కూడా ఓటీటీ మూవీస్ లో నటించడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు. ఈ క్రమంలో నటి తమన్నా నటించిన ఈ వెబ్ సిరీస్ కాను మీరు మిస్ అయ్యారా !
OTT Suggestions: వెండి తెరపైన కనిపించే హీరో హీరోయిన్స్ కూడా ఓటీటీ మూవీస్ లో నటించడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు. ఈ క్రమంలో నటి తమన్నా నటించిన ఈ వెబ్ సిరీస్ కాను మీరు మిస్ అయ్యారా !
Swetha
కరోనా ముందు వరకు కూడా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అంటే మరి అంతగా పాపులారిటీ ఏమి లేదు. కానీ ఆ సమయంలో మాత్రం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు బాగా క్రేజ్ పెరిగింది. ఇక ఇప్పుడైతే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ సెలెబ్రిటీలు సైతం ఓటీటీ సినిమాలలో నటించడానికి ఏ మాత్రం సందేహించడం లేదు. ఈ క్రమంలో నటి తమన్నా కూడా ఓటీటీ లో కొన్ని సిరీస్ లలో నటించింది. ఇక వెబ్ సిరీస్ లంటే ప్రతి ఒక్కరికి ఆసక్తిగానే ఉంటుంది. మరి తమన్నా నటించిన ఈ వెబ్ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.
తమన్నా నటించిన వెబ్ సిరీస్ అంటే ఆహ లో స్ట్రీమింగ్ అవుతున్న లెవెన్త్ హావర్ అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ దానికంటే కూడా ముందు వచ్చిన సిరీస్. ఈ సిరీస్ పేరు “నవంబర్ స్టోరీ”. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ భాషలో రూపొందించిన ఈ సిరీస్.. తెలుగు, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే.. ఇది ఒక సస్పెన్స్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ ను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి.
అసలు ఏంటి ఈ సిరీస్ కథ అనే విషయానికొస్తే.. ఈ సిరీస్ లో తమన్నా ఓ ప్రొఫెషనల్ ఎథికల్ హ్యాకర్. F.I.R డిజిటలైజషన్ వేసిన తన ఫ్రెండ్ మలర్ కు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో వారి సాఫ్ట్ వేర్ హ్యాక్ అవుతూ ఉంటుంది. మరో వైపు తమన్నా తండ్రి ఓ ప్రొఫెషనల్ క్రైమ్ స్టోరీ రైటర్.. అతను ఓ అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. చనిపోయే లోపు ఓ నవలను రాయాలని అనుకుంటాడు. దానికోసం తన కూతురు హెల్ప్ అడుగుతాడు. ఇక తన తండ్రి ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు అవుతాయని.. తెలుసుకుని.. ఆయన పేరుతో ఉన్న ఓ పాత బిల్డింగ్ ను అమ్మాలనుకుంటుంది తమన్నా. కట్ చేస్తే.. సరిగ్గా అదే సమయంలో ఓ మహిళా హత్యకు గురి అవుతుంది.
చనిపోయిన ఆ మహిళ పక్కనే .. తన తండ్రి ఉండడం చూసి ఆశ్చర్య పోతుంది. తన తండ్రిని అక్కడినుంచి తీసుకుని వెళ్ళిపోయి.. ఆ హత్య గురించి పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. అసలు ఆ పాత బిల్డింగ్ లో హత్యకు గురైంది ఎవరు ! ఆ సమయంలో తన తండ్రి అక్కడే ఎందుకు ఉన్నాడు ! ఈ మర్డర్ చేసింది తన తండ్రేనా ! తన ఫ్రెండ్ ఆఫీస్ లో సాఫ్ట్ వేర్ హ్యాక్ అవ్వడానికి గల కారణం ఏంటి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.