Swetha
OTT Best Sci- Fi Movie :ఇప్పటివరకు మూవీస్ లో రోబోటిక్ బేస్ మీద చాలానే సినిమాలు వచ్చాయి. ఇలాంటి చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం రోబోస్ ఇలా కూడా ఉంటాయా అనిపిస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి.
OTT Best Sci- Fi Movie :ఇప్పటివరకు మూవీస్ లో రోబోటిక్ బేస్ మీద చాలానే సినిమాలు వచ్చాయి. ఇలాంటి చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం రోబోస్ ఇలా కూడా ఉంటాయా అనిపిస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి.
Swetha
అప్పట్లో రజిని కాంత్ నటించిన రోబో మూవీ ప్రతి ఒక్కరికి.. మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా నిలిచింది. ఇప్పటివరకు మూవీస్ లో రోబోటిక్ బేస్ మీద చాలానే సినిమాలు వచ్చాయి. రోబోకి ఫీలింగ్స్ వస్తే ఏం చేస్తుంది. దాని వలన మనుషులకు ఎంత ప్రమాదం ఉంటుంది అనేది కూడా చూపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. అయితే ఇక్కడ మాత్రం రోబో ఓ చిన్న పాపా కు బాగా కనెక్ట్ అయిపోయి. ఆమెను ఎవరు ఏమన్నా కూడా చంపేస్తుంది. అసలు ఆ రోబో అలా చేయడానికి కారణం ఏంటి.. నిజంగా రోబోలు ఇలా చేస్తాయా… అసలు ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఓసారి చెక్ చేసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మధ్య పిల్లలంతా తల్లిదండ్రులతో కంటే బొమ్మలతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పైగా ఇప్పుడు ఇంకా రోబోటిక్ బొమ్మలు కూడా వస్తుండడంతో.. పిల్లలు వాటికి ఇంకాస్త ఎడిక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలో కూడా ఇలానే జరుగుతుంది. ఫంకీ అనే కంపెనీలో రోబోటిక్ బొమ్మలు తయారవుతూ ఉంటాయి. రిమోట్ సెన్సార్ ద్వారా ఈ బొమ్మలను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. అయితే కేరి అనే అమ్మాయి దగ్గర కూడా అలాంటి బొమ్మే ఉంటుంది. అయితే ఓసారి కేరి ఫ్యామిలీ అంతా కలిసి బయటకు వెళ్ళినప్పుడు.. ప్రమాదవ శాత్తు యాక్సిడెంట్ అవుతుంది. ఇక మరోవైపు ఫంకీ అనే కంపెనీలో జమ్మా అనే అమ్మాయి రోబోటిక్ ల్యాబ్ లో.. మేగన్ అనే ఓ రోబో ను తయారు చేస్తూ ఉంటుంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది. అయితే అక్కడ జరిగిన యాక్సిడెంట్ లో కేరి పేరెంట్స్ చనిపోయారని.. జమ్మా కు తెలుస్తుంది. కేరి జమ్మ కు మేనకోడలు అవుతుంది.
దీనితో అప్పటినుంచి.. కేరిని జమ్మ నే చూసుకుంటుంది. అయితే, జమ్మ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మేగాన్ రోబోపైనే ఉంటుంది. కానీ కెరిని పట్టించుకోదు. కొన్ని రోజులకు కేరి కి జమ్మా తయారు చేసే బొమ్మలపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అటువంటి బొమ్మ ఒక్కటి ఉంటె నాకు ఇంకా ఏమి అవసరం లేదని కేరి చెప్తుంది. దీనితో జమ్మాకు మేగాన్ రోబోను పిల్లలకు దగ్గర చేయాలని అనుకుంటుంది. అప్పటినుంచి దానిపైనే ద్రుష్టి పెడుతుంది. మేగాన్ రోబో కూడా కెరితో మంచి ఫ్రెండ్ లా ఉంటుంది. సో జమ్మా ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. అలాగే కేరి కూడా మేగాన్ తో బాగా కనెక్ట్ అవుతుంది. మేగాన్ కూడా కేరికి బాగా ఎడిక్ట్ అయిపోయి. కెరిని ఎవరు బాధపెట్టిన సరే వాళ్ళను చంపేయడానికి కూడా వెనుకాడదు. అలాగే కేరిని భయపెట్టిన ఓ కుక్కను చంపేస్తుంది.
మెల్లగా కేరి జమ్మ నుంచి కూడా దూరమైపోతుంది. దీనితో జమ్మ కెరిని స్కూల్ లో జాయిన్ చేస్తుంది. కేరి చివరకి స్కూల్ కు కూడా మేగాన్ ను తీసుకుని వెళ్తుంది. అక్కడ కూడా కేరిని ఏడిపించిన వాళ్ళను మేగాన్ ఎవరికీ తెలియకుండా బెదిరిస్తోంది. ఆ తర్వాత ఏమైంది ? జమ్మా మేగాన్ ను ఎలా తయారు చేస్తుంది? అసలు రోబో మనిషిలా ఎందుకు అవుతుంది. ఇవన్నీ తెలియాలంటే “ఎం 3 గన్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా ఎవరు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి..
ఇది కూడా చూడండి.. మనుషులు సృష్టించిన జీవికి ఆ కోరికలు.. చివరికి! OTT లో క్లైమాక్స్ అదిరిపోతుంది..