Swetha
OTT Best Feel Good Movie: ఎక్కువ సస్పెన్స్ లేకుండా , ట్విస్ట్ లు లేకుండా ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలంటే మాత్రం.. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ బెస్ట్ సజెషన్ అని చెప్పి తీరాలి. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
OTT Best Feel Good Movie: ఎక్కువ సస్పెన్స్ లేకుండా , ట్విస్ట్ లు లేకుండా ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలంటే మాత్రం.. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ బెస్ట్ సజెషన్ అని చెప్పి తీరాలి. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
Swetha
బాగా స్ట్రెస్ అయిపోయి.. అలసిపోయి దాని నుంచి రిలాక్స్ అవ్వడం కోసం ఏదైనా మూవీ చూడాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎలాంటి సినిమాలు చూసినా కానీ ఆ సినిమాలో చూపించే సస్పెన్స్ లకు , ట్విస్ట్ లకు , హర్రర్ ఎలిమెంట్స్ కు తర్వాత ఏం జరుగుతుందా అనే ఫీలింగ్ కలిగిస్తూ ఉన్నాయి. మరి రెగ్యులర్ గా ఇలాంటి సినిమాలను చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు.. కాస్త వీటి నుంచి బ్రేక్ తీసుకుని.. ఏదైనా మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలంటే మాత్రం ఈ మూవీ బెస్ట్ సజ్జెషన్ అని చెప్పి తీరాలి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఓసారి చెక్ చేసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. అమెరికాలో బిజినెస్ అనలిస్ట్ గా వర్క్ చేస్తున్న తరుణ్ ఆ జాబ్ బోర్ కొట్టి.. ఇండియాకు వచ్చేసి.. ఓ రిసార్ట్ బిజినెస్ ను స్టార్ట్ చేస్తాడు. మొదట్లో బిజినెస్ బాగానే నడిచినా కానీ కొంతకాలానికి అది లాస్ లోకి వెళ్ళిపోతుంది. దానిని క్లోజ్ చేసే తరుణ్ తో పాటు అతను అంకుల్ ఆంటీ అక్కడ ఉంటారు. వారు అతనిని పెళ్లి చేసుకోమని చెప్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలో మిస్టర్ అండ్ మిసెస్ మెహ్ర నాలుగు రోజులు హనీమూన్ ట్రిప్ కోసం తరుణ్ రిసార్ట్ ను బుక్ చేసుకుంటారు. అయితే వాళ్ళను పిక్ చేసుకోడానికి తరుణ్ ఎయిర్ పోర్ట్ కు వెళ్తాడు. కానీ అక్కడ మిసెస్ మెహ్రా మాత్రం ఉంటుంది. మిస్టర్ మెహ్రా గురించి అడుగుతున్న కూడా ఆమె ఏమి చెప్పదు. తరుణ్ ఫోర్స్ చేసి అడిగేసరికి.. మిస్టర్ మెహ్ర చనిపోయి మూడు నెలలు అయిందని చెప్తుంది. దీనితో తరుణ్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు.
వెళ్లే దారిలో వీరిద్దరి మధ్య మాటలు కలుస్తాయి. అలా వాళ్లిద్దరూ రిసార్ట్ కు వెళ్తారు. అక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య పరిచయం రోజు రోజుకు పెరుగుతుంది. అయితే తరుణ్ తో ఉన్న తన అంకుల్ ఆంటీ కూడా మిసెస్ మెహ్రా ను కలుస్తారు. తరుణ్ ఆంటీ ఆమెను మిస్టర్ మెహ్రా గురించి అడుగుతుంది. దీనితో ఆమె మళ్ళీ బాధపడుతుంది. ఇక తరుణ్ తన ఆంటీ తరుపున మిసెస్ మెహ్రా కు క్షమాపణ చెప్తూ .. తన బాధను మర్చిపోయేలా చేస్తాడు. ఇక మిసెస్ మెహ్రా వెళ్లిపోయే రోజు వస్తుంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ వస్తుంది. అక్కడకు మిస్టర్ మెహ్రా వస్తాడు. మిస్టర్ మెహ్రా బ్రతికి ఉండగానే చనిపోయాడని ఎందుకు చెప్పాల్సి వస్తుంది ? తరుణ్ మిసెస్ మెహ్రా ను ప్రేమిస్తాడా ? వీళ్లిద్దరి మధ్య ఎలాంటి బాండ్ ఏర్పడుతుంది ? ఆ తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే “కథేయొందు షురువాగిదే” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి..