iDreamPost
android-app
ios-app

OTT Best Action Drama: తన భార్య కోసం.. సిటీలో ఉన్న గ్యాంగ్ స్టర్స్ ని.. OTTలో ది బెస్ట్ యాక్షన్ డ్రామా!

  • Published Jun 12, 2024 | 5:06 PMUpdated Jun 12, 2024 | 5:06 PM

OTT Movie Suggestion: యాక్షన్ సినిమాలంటే అందరికి ఇష్టమే అయినా... కొన్ని సినిమాలలో మాత్రం యాక్షన్ సీన్స్ వలన కథ కాస్త వీక్ గా ఉంటుంది, కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం అలా కాదు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Movie Suggestion: యాక్షన్ సినిమాలంటే అందరికి ఇష్టమే అయినా... కొన్ని సినిమాలలో మాత్రం యాక్షన్ సీన్స్ వలన కథ కాస్త వీక్ గా ఉంటుంది, కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం అలా కాదు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Jun 12, 2024 | 5:06 PMUpdated Jun 12, 2024 | 5:06 PM
OTT Best Action Drama: తన భార్య కోసం.. సిటీలో ఉన్న గ్యాంగ్ స్టర్స్ ని.. OTTలో ది బెస్ట్ యాక్షన్ డ్రామా!

ఓటీటీ లో ఎన్నో సినిమాలను, సిరీస్ లను చూస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన అప్ డేట్స్ కూడా వస్తూనే ఉంటాయి. అయినా ఇంకా చూడాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక యాక్షన్ సినిమాలంటే అందరికి ఇష్టమే అయినా… కొన్ని సినిమాలలో మాత్రం యాక్షన్ సీన్స్ వలన కథ కాస్త వీక్ గా ఉంటుంది, కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం అలా కాదు. మరి ఈ సినిమాను మీరు మిస్ చేశారో.. చూశారో లేదో ఓ లుక్ వేసేయండి . ఇంతకీ ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా స్టార్టింగ్ లో.. చికాగోలో క్రిమినల్స్ ఎక్కువ అయిపోయారు అనే అనౌన్సుమెంట్ వస్తుంది. సరిగ్గా అదే సమయానికి.. పాల్ అనే ఓ డాక్టర్ దగ్గరకి.. క్రిమినల్స్ చేతిలో గాయపడిన ఓ పోలీస్ ను తీసుకుని వస్తారు. ఇక పాల్ విషయానికొస్తే.. అతనికి భార్య, ఓ కూతురు ఉంటారు. తన కూతురు జొర్డెన్ కు న్యూయార్క్ లోని ఓ కాలేజ్ లో సీట్ రావడంతో… ఫ్యామిలీ అంత కలిసి పార్టీ చేసుకుందాం అని.. ఓ రెస్టారెంట్ కు వెళ్తారు. అక్కడ వాలెట్ పార్కింగ్ చేసే ఓ వ్యక్తి… పాల్ కు తెలియకుండా తనని ఫోటో తీస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు .. పాల్ ఎప్పటిలానే హాస్పిటల్ కు వెళ్ళిపోతాడు. అదే రోజు పాల్ ఇంట్లో దొంగలు పడతారు. పాల్ భార్య , కూతురుపై అట్టాక్ చేయడంతో.. వారిద్దరూ పేషంట్స్ గా పాల్ దగ్గరకే వస్తారు.

Death wisher

అప్పటికే పాల్ భార్య చనిపోయి ఉంటుంది. పాల్ కూతురు కోమాలోకి వెళ్ళిపోతుంది. దీనితో పోలీసులు కేసు అయితే నమోదు చేసుకుంటారు. కానీ ఆ కేసు మాత్రం ముందుకు కదలదు. దీనితో పాల్ రోజు రోజుకి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయంలో హాస్పిటల్ కి వచ్చిన పేషంట్ దగ్గర పాల్ కు గన్ దొరుకుతుంది. అదే రోజు.. పాల్ ఇంటికి వెళ్తుంటే.. రోడ్ మీద కొందరు వ్యక్తులు ఓ అమ్మాయిని ఏడిపిస్తుంటే.. పాల్ తన దగ్గర ఉన్న గన్ తో వారిపై అట్టాక్ చేస్తాడు. రాత్రికి రాత్రే ఆ వీడియో వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోలో పాల్ మొహం కనిపించకపోవడంతో.. అందరు అతనిని “హుడి మ్యాన్” అని పిలవడం మొదలు పెడతారు. అందరు అతనిని మెచ్చుకుంటూ ఉంటారు,

కట్ చేస్తే వాలెట్ పార్కింగ్ లో పని చేసే వ్యక్తి.. యాక్సిడెంట్ అవ్వడంతో పాల్ హాస్పిటల్ లోనే అడ్మిట్ అవుతాడు. అదే సమయంలో అతని చేతికి ఉన్న వాచ్ ను పాల్ గమనిస్తాడు. అది తన ఇంట్లో దొంగలించిన వాచ్ అనే గుర్తిస్తాడు. దీనితో ఆ దొంగలకు తన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాలెట్ పార్కింగ్ వ్యక్తే అని అర్ధమౌతుంది. వెంటనే.. ఆ దొంగల కోసం వేట మొదలు పెడతాడు. అసలు ఆ దొంగలు ఇతని ఫ్యామిలినే ఎందుకు టార్గెట్ చేశారు ! దొంగలను అతను ఎలా పట్టుకున్నాడు ! తన కూతురిని కాపాడుకున్నాడా లేదా ! ఇవన్నీ తెలియాలంటే.. డెత్ విష్ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి