iDreamPost
android-app
ios-app

పెళ్లి తర్వాత భార్యను డ్రాగన్ కు ఎరగా వేసే భర్త.. OTT లో డేంజరస్ మూవీ

  • Published Jul 12, 2024 | 3:47 PMUpdated Jul 12, 2024 | 3:47 PM

OTT Best Suspense Thriller : థ్రిల్లర్ మూవీస్ ను ఇప్పుడు ప్రతి ఒక్కరు బాగా ఇంట్రెస్ట్ తో చూస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Suspense Thriller : థ్రిల్లర్ మూవీస్ ను ఇప్పుడు ప్రతి ఒక్కరు బాగా ఇంట్రెస్ట్ తో చూస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 12, 2024 | 3:47 PMUpdated Jul 12, 2024 | 3:47 PM
పెళ్లి తర్వాత భార్యను డ్రాగన్ కు ఎరగా వేసే భర్త.. OTT లో డేంజరస్ మూవీ

ఇప్పటివరకు ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసి ఉంటారు కానీ ఇలాంటి ఓ సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. థ్రిల్లర్ మూవీ జోనర్ లో ఇప్పటివరకు చాలానే సినిమాలు వచ్చాయి . క్రైమ్ , సస్పెన్స్ , ఇన్వెస్టిగేషన్ ఇలా రకరకాల సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఓటీటీ లో ఉన్నాయి . కానీ ఈ సినిమా మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇదంతా కూడా కొత్తగా పెళ్ళైన ఓ అమ్మాయి .. అత్తారింటికి వెళ్లిన తర్వాత మృత్యువు ఎదురైతే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ పైనే ఉంటుంది. ప్రతి క్షణం ఉత్కంఠ భరితంగా కొనసాగుతూ.. ప్రేక్షకులను చివరి వరకు చూసేలా చేస్తుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ప్రిన్సెస్ ఎలోడి ఓ రాజ్యానికి యువరాణి.. అయితే ఓసారి తన రాజ్యంలో కరువు రావడం వలన.. అక్కడ ప్రజలంతా కూడా చాలా కష్టాలు పడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఎలోడికి బాగా సంపన్న రాజ్యం నుంచి ఓ పెళ్లి సంబంధం వస్తుంది. ఆ దేశ యువరాజును పెళ్ళి చేసుకుంటే.. ఎలోడి రాజ్యంలో ప్రజల కష్టాలను తీరుస్తానని ఆ రాజు చెప్తాడు. దీనితో ఆమె ఆ పెళ్ళికి ఒప్పుకుంటుంది. పెళ్ళికి ఒక రోజు ముందు మాత్రమే ఆమె ఆ రాజు రాజ్యానికి వెళ్తుంది. ఆ రాజు పేరు హెన్రీ.. అక్కడ ఆ రాజుతో పర్సనల్ గా మాట్లాడిన తర్వాత.. ఎలోడికి హెన్రీ బాగా నచ్చేస్తాడు. కానీ ఎలోడి కుటుంబంలోని సభ్యులకు మాత్రం అదంతా కాస్త సందేహంగా ఉంటూ ఉంటుంది. ఇక ఎలాగూ ఒకలా ఎలోడి , హెన్రీ పెళ్లి అయిపోతుంది.

Damsel

అయితే పెళ్లి తర్వాత.. హెన్రీ .. ఎలోడిని ఓ పెద్ద పర్వతం దగ్గరకు తీసుకుని వెళ్తాడు. అక్కడ హెన్రీ తల్లి క్వీన్ ఇసాబెల్ ఆమె కథ చెప్తుంది. కొన్నేళ్ల క్రితం ఓ డ్రాగన్ ఆ రాజ్యంపై దాడి చేసిందని… అప్పటి కింగ్ తన కూతుళ్లను వారికి అర్పించి రాజ్యాన్ని కాపాడాడని.. చెప్పొకొస్తుంది, ఆ తర్వాత హెన్రీ , ఎలోడి రక్తం కలిసేలా వారి ఇద్దరికీ చేతికి చిన్న కత్తి ఘాటు పెడుతుంది. వెంటనే హెన్రీ ఆమెను ఎత్తుకుంటాడు. అక్కడ వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ ఉన్నట్లుండి.. హెన్రీ ఆమెను పక్కనే ఉన్న గుహలోకి విసిరేస్తాడు. ఆమెను గుహలోకి ఎందుకు విసిరేశాడో.. కాసేపటికి ఆమెకు అర్ధం అవుతుంది. అదంతా ఓ ట్రాప్ అని.. డ్రాగన్ కు బలి ఇవ్వడం కోసమే ఇలా చేశారని.. ఆమె గ్రహిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? ఆమె ఆ గుహలో నుంచి ఎలా బయటకు వచ్చింది ? డ్రాగన్ కు ఆమె బలి అవుతుందా లేదా డ్రాగన్ నే ఆమె వశపరచుకుంటుందా? ఇవన్నీ తెలియాలంటే.. “డామ్సెల్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరు చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి..

ఇది కూడా చూడండి.. కోరికలకు లొంగిపోయి కట్టుకున్న భర్తను.. OTTలో చీటింగ్ వైఫ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి