iDreamPost
android-app
ios-app

OTT Best Feel Good Movie : ఇంత మంచి తెలుగు సినిమా ఇంకా చూడలేదా? ఏ OTTలో ఉందంటే?

  • Published Jun 12, 2024 | 4:36 PM Updated Updated Jun 12, 2024 | 4:36 PM

OTT Movie Suggestion: హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు బాగా అలవాటు పడిపోయి.. కొన్ని మంచి తెలుగు సినిమాలను చూడడం మిస్ చేస్తున్నారు ప్రేక్షకులు. మరి ఇప్పుడు చెప్పుకునే సినిమాను మీరు చూసారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Movie Suggestion: హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు బాగా అలవాటు పడిపోయి.. కొన్ని మంచి తెలుగు సినిమాలను చూడడం మిస్ చేస్తున్నారు ప్రేక్షకులు. మరి ఇప్పుడు చెప్పుకునే సినిమాను మీరు చూసారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 12, 2024 | 4:36 PMUpdated Jun 12, 2024 | 4:36 PM
OTT Best Feel Good Movie : ఇంత మంచి తెలుగు సినిమా ఇంకా చూడలేదా? ఏ OTTలో ఉందంటే?

ప్రతి వారం ఓటీటీ లో చాలానే సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే చూడదగిన సినిమాలు… ఉంటున్నాయి. అందులోను తెలుగు సినిమాలు ఇంకా తక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఇక ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న సినిమాలలో మంచి సినిమాల కోసం వెతికే ఆడియన్స్.. హాలీవుడ్ , బాలీవుడ్ సినిమాలకు బాగా అలవాటు పడిపోయి.. కొన్ని తెలుగు సినిమాలను చూడడం మిస్ చేసేస్తున్నారు. తెలుగులో కూడా చాలానే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా మీరు మిస్ చేసిన సినిమాల లిస్ట్ లో ఉందొ లేదో చూసేయండి.

తెలుగు తెరపైన.. మల్లేశం, కేరాఫ్ కంచరపాలెం , కలర్ ఫోటో లాంటి ఎన్నో మంచి మంచి సినిమాలను చూసే ఉంటారు. ఇవన్నీ కూడా ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా .. ప్రేక్షకుల మదిని దోచేసిన సినిమాలు. ఓ విధంగా చెప్పాలంటే ఇలాంటి సినిమాలలో ఎదో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమా పేరు “సినిమా బండి”. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ కు ముందు.. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కథేంటంటే.. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక బోర్డర్ లో.. గొల్లపల్లి అనే గ్రామంలో వీరబాబు ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఓ రోజు.. అతనికి ఓ నల్ల బ్యాగ్ లో పెద్ద కెమెరా దొరుకుతుంది. దీనితో ఆ కెమెరాను అమ్మేసి.. తన కుటుంబ సమస్యలు తీర్చుకోవాలని అనుకుంటాడు.

Cinima Bandi

కానీ, కొంతకాలానికి తన ఆలోచన మార్చుకుని.. దానితో ఓ సినిమా తీయాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉన్న ఒకే ఒక్క ఫోటోగ్రాఫర్ గణపతిని కలిసి తన ఆలోచనలను చెప్తాడు. దీనితో వీరబాబు డైరెక్టర్ గా , గణపతి ఫోటోగ్రాఫర్ గా సినిమా మొదలవుతుంది. ఈ క్రమంలో సినిమా తీయాలనే ప్రయత్నంలో వీరబాబుకి ఎదురైన సమస్యలు ఏంటి ! తన సినిమాకు కావాల్సిన నటి నటులను ఎంపిక చేసుకోవాడానికి అతను పడిన కష్టాలు ఏంటి ! అతను సినిమా తీయాలనే లక్ష్యం నెరవేరిందా లేదా ! కెమెరా పోగొట్టుకున్న వారు తిరిగి వచ్చారా ! ఇలాంటివన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సాఫీగా ఎక్కువ ట్విస్ట్ లు లేకుండా ఓ ఫీల్ గుడ్ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.