Swetha
ఓటీటీ లో రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వారికి ఈ సినిమా మంచి రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. మరి ఈ సినిమా మీ వాచ్ లిస్ట్ లో ఉందొ లేదో ఓ లుక్ వేసేయండి.
ఓటీటీ లో రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వారికి ఈ సినిమా మంచి రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. మరి ఈ సినిమా మీ వాచ్ లిస్ట్ లో ఉందొ లేదో ఓ లుక్ వేసేయండి.
Swetha
మలయాళ సినిమాలు ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయో.. ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇక ప్రేమ కథల విషయానికొస్తే, వాటికి మించిన మరో సినిమా లేదు అనే రేంజ్ లో అందరి మనసులను దోచేస్తాయి. తెలుగులో హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు చెప్పుకోబోయే మలయాళ సినిమా కూడా అంతే.. ఓటీటీ లో రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వారికి ఈ సినిమా మంచి రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి . మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ సస్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.
ఈ సినిమా కథేంటంటే.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని సంఘటనలే ఈ సినిమా స్టోరీ. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు కాలేజ్ తరపునుంచి ఓ ఇండస్ట్రీయల్ టూర్ లో వెళ్తారు. ఈ క్రమంలో వారి మధ్యన చోటు చేసుకున్న ప్రేమ , స్నేహం , ఫ్రెండ్షిప్ , ఎమోషన్స్ వారిలో ఎలాంటి మార్పులు తీసుకుని వచ్చాయి.! వారు తమకు తాము ఎలా మారారు !జీవితంలో ఎలాంటి త్యాగాలకు సిద్ద పడ్డారు ! అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా పేరు “ఆనందం”. ఈ సినిమా ప్రస్తుతం ఆహా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేసి ఉంటే కనుక వెంటనే చూసేయండి.
కాలేజ్ లో ప్రేమలు , స్నేహాలు , అపార్థాలు మళ్ళీ కలుసుకోవడాలు. . ఇవన్నీ చాలా కామన్ . ఇలాంటివి ప్రతి ఒక్కరు తమ జీవితాల్లో ఎక్కడ ఓ దగ్గర ఫేస్ చేసి ఉంటారు. దానిని మంచి ఎమోషన్ తో తెరపైన చూపించారు మేకర్స్. కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరికి తమ కాలేజీ డేస్ ను గుర్తుచేస్తుంది చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందులోను మలయాళ సినిమాలలో ఇలాంటి ప్లాట్స్ ను చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ చూపిస్తారు. కాబట్టి ఆనందం సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.