iDreamPost
android-app
ios-app

OTT Suggestion : OTT లో ప్రపంచాన్నే భయపెట్టిన హర్రర్ మూవీ.. ఒంటరిగా చూడొద్దు !

  • Published Jul 03, 2024 | 2:19 PM Updated Updated Jul 03, 2024 | 2:19 PM

Best Horror Movie In OTT: హర్రర్ సినిమాలను ఇష్టపడని ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ఈ జోనర్ లో ఎన్ని సినిమాలను చూసిన ఇంకా బ్యాలెన్స్ ఉంటూనే ఉంటాయి. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

Best Horror Movie In OTT: హర్రర్ సినిమాలను ఇష్టపడని ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ఈ జోనర్ లో ఎన్ని సినిమాలను చూసిన ఇంకా బ్యాలెన్స్ ఉంటూనే ఉంటాయి. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 03, 2024 | 2:19 PMUpdated Jul 03, 2024 | 2:19 PM
OTT Suggestion : OTT లో  ప్రపంచాన్నే భయపెట్టిన  హర్రర్ మూవీ.. ఒంటరిగా చూడొద్దు !

భయపెట్టే సినిమాలకు ప్రాణం పోసింది హాలీవుడ్ ఇండస్ట్రీ.. హాలీవుడ్ హర్రర్ సినిమాలను చూసిన తర్వాతే.. ప్రేక్షకులు ఇలాంటి ఈ జోనర్ కంటెంట్ ను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటివరకు హాలీవుడ్ నుంచి వచ్చిన ఎన్నో హర్రర్ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరించారు. పైగా అక్కడ హాలీవుడ్ లో హర్రర్ మూవీస్ తో కొన్ని యూనివర్స్ లు కూడా క్రియేట్ అయ్యాయి. ఆల్రెడీ ఎగ్జార్సిస్ట్ అనే హర్రర్ ఫ్రాంచైజ్ గురించి వినే ఉంటారు. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చినదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

ఈ సినిమా పేరు “ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్”. హాలీవుడ్ సినిమా అయినా కానీ ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఎంచక్కా చూసేయొచ్చు.. ఎంతైనా ఇతర భాషల సినిమాలు తెలుగులో చూడడానికి ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి.. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఇప్పటివరకు ఎగ్జార్సిస్ట్ ఫ్రాంచైజ్ నుంచి ఎన్నో సినిమాలు వచ్చాయి.. ఇక ఈ క్రమంలోనే.. ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్ అనే సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. ప్రేక్షకులను భయపెట్టింది. హర్రర్ సినిమాలంటే ఇష్టమైన వాళ్ళు ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉంది.

అసలు ఎగ్జార్సిస్ట్ అంటే భూత వైద్యుడు అనే అర్ధం వస్తుంది. 1973లో ఈ ఫ్రాంచైజ్ నుంచి.. ది ఎగ్జార్సిస్ట్ అనే పేరుతో మొదటి సినిమా రీలిజ్ అయింది.. ఇక ఆ సినిమా ఊహించని రేంజ్ లో హిట్ కావడంతో.. అదే ఫ్రాంచైజ్ నుంచి 1977లో ఎగ్జార్సిస్ట్ 2: ది హెరెటిక్, 1990లో ది ఎగ్జార్సిస్ట్ 3, 2004లో ఎగ్జార్సిస్ట్: ది బిగినింగ్, 2005లో డొమినియన్: ప్రీక్వెల్ టు ఎగ్జార్సిస్ట్ మూవీస్ వచ్చాయి. ఇక ఆ తర్వాత క్రమంగా హర్రర్ సినిమాలకు విపరీతంగా ఫ్యాన్స్ పెరిగిపోవడంతో.. 18 ఏళ్ళ తర్వాత ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ పేరుతో మరొక సినిమా వచ్చేసింది. ఈ మూవీ కూడా ఖచ్చితంగా హర్రర్ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటుందని చెప్పి తీరాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి .. https://www.jiocinema.com/movies/the-exorcist-believer/3894237

jojobet girişmarsbahiscasibomjojobet girişjojobet