Swetha
ఇప్పటివరకు ఓటీటీ లో ఎన్నో సిరీస్ లు, సినిమాలు, డాక్యుమెటరీ లో చూసి ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే డాక్యుమెటరీ మాత్రం అస్సలు ఎవరు ఊహించి ఉండరు. అదేంటంటే ఆధార్ కార్డు గురించి ఓ స్పెషల్ డాక్యుమెంటరీ త్వరలో రాబోతుంది.
ఇప్పటివరకు ఓటీటీ లో ఎన్నో సిరీస్ లు, సినిమాలు, డాక్యుమెటరీ లో చూసి ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే డాక్యుమెటరీ మాత్రం అస్సలు ఎవరు ఊహించి ఉండరు. అదేంటంటే ఆధార్ కార్డు గురించి ఓ స్పెషల్ డాక్యుమెంటరీ త్వరలో రాబోతుంది.
Swetha
ఇప్పుడ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి మొదట గుర్తింపు కార్డు అంటే ఆధార్ కార్డు ఏ. ఆధార్ ఏ అందరికి ఆధారం అనేంతలా అందరి జీవితాల్లో భాగం అయిపొయింది ఆధార్ కార్డు. ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే కదా ఇప్పుడు ఎందుకు వీటి ప్రస్తావన వచ్చింది అనే విషయానికొస్తే .. ఇప్పటివరకు థియేటర్స్ లో కానీ, ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో కానీ, ఎన్నో సినిమాలను, సిరీస్ లను చూసి ఉంటారు, వాటిలో కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్, డాక్యుమెంటరీస్ కూడా చూసి ఉంటారు. కానీ, త్వరలో ఓటీటీ లోకి రాబోయే ఈ డాక్యుమెంటరీ మాత్రం చాలా స్పెషల్. అంతేకాకుండా అందరికి ఎంతో ఉపయోగపడుతుంది కూడా.. ఇంతకు అదేంటంటే.. ఇప్పటివరకు చెప్పుకున్న ఆధార్ కార్డు గురించి రాబోతున్న ఈ డాక్యుమెంటరీ. అసలు ఏంటి ఇదంతా .. ఈ డాక్యుమెటరీ ఎప్పుడు వస్తుంది. అనే పూర్తి విషయాలను చూసేద్దాం.
అప్పుడే పుట్టిన పసిపిల్లల నుంచి.. పండు ముసలి వరకు ప్రతి ఒక్కరి దగ్గర ఉండేది ఆధార్ కార్డు. ఇండియా లో ఉండే అందరి దగ్గర కూడా ఈ ఆధార్ కార్డ్స్ ఉంటున్నాయి. ఆ కార్డ్స్ మీద ఉండే నెంబర్స్ ఏ ఇప్పుడు.. మిగతా సేవలకు లింక్ అయ్యి ఉంటున్నాయి. అసలు ఏంటి ఈ కార్డు.. ,మన జీవితాల్లోకి ఎందుకు వచ్చింది. ఎందుకు అన్ని సేవలు ఈ ఆధార్ కార్డుకు లింక్ అయ్యి ఉన్నాయి. ఇవన్నీ ప్రశ్నలు అందరికి వచ్చినా కూడా.. సమాధానాలు మాత్రం సరిగా ఎవరికీ తెలీదు. ఇవన్నీ అందరికి తెలియజెప్పడానికి.. త్వరలో “12 డిజిట్ మాస్టర్‌స్ట్రోక్ ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఆధార్” అంటూ ఓ డాక్యుమెంటరీ రాబోతుంది. ఈ డాక్యుమెంటరీని డాక్యుబె యూట్యూబ్ లో స్ట్రీమింగ్ కానుంది. మే 3 నుంచి ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకు అందుబాటులోకి రానుంది తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. కాబట్టి ఆధార్ కార్డు కథ తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంటరీని చూసేయండి.
ఆధార్ కార్డు భారతీయుల దైనందిన జీవితంలో విడదీయలేని భాగం అయిపొయింది. రేషన్ కార్డు నుంచి రైల్వే టికెట్ వరకు.. స్కూల్ లో అడ్మిషన్ నుంచి స్మశానంలో అంత్యక్రియల వరకు ప్రతి చిన్న దానికి పెద్ద దానికి ఆధార్ కార్డు ఉండాల్సిందే. మరి అలాంటిది ఆధార్ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని తెలియకపోతే ఎలా.. అందుకే అందరికి దీని చరిత్ర చెప్పేందుకు.. ఈ డాక్యుమెంటరీ ద్వారా ముందుకు తీసుకుని వచ్చారు మేకర్స్. ఈ ఆధార్ కార్డు కాన్సెప్ట్ మొదలైన నాటి నుంచి… ఇప్పటివరకు దాని వలన జరిగిన , జరుగుతున్న ప్రతి చిన్న సంఘటనను ఈ డాక్యుమెంటరీలో కళ్ళకు కట్టినట్లు చూపించారు మేకర్స్. మరి ఈ డాక్యుమెంటరీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.