iDreamPost
android-app
ios-app

Netflix నుంచి భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ‘ది రాయల్స్’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

  • Published Aug 14, 2024 | 11:00 PM Updated Updated Aug 14, 2024 | 11:00 PM

Upcoming Netflix Web Series: భారీ బడ్జెట్స్ కేవలం థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలకు మాత్రమే కాదని.. ఓటీటీ లకు కూడా కేటాయించి మంచి అవుట్ పుట్ తీసుకురావొచ్చని.. ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ ప్రూవ్ చేసింది. ఇక ఇప్పుడు మరొక భారీ బడ్జెట్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది.

Upcoming Netflix Web Series: భారీ బడ్జెట్స్ కేవలం థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలకు మాత్రమే కాదని.. ఓటీటీ లకు కూడా కేటాయించి మంచి అవుట్ పుట్ తీసుకురావొచ్చని.. ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ ప్రూవ్ చేసింది. ఇక ఇప్పుడు మరొక భారీ బడ్జెట్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది.

  • Published Aug 14, 2024 | 11:00 PMUpdated Aug 14, 2024 | 11:00 PM
Netflix నుంచి భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ‘ది రాయల్స్’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

అన్ని లాంగ్వేజ్స్ ను ప్రేక్షకులకు అందించడంలో నెట్ ఫ్లిక్స్ ఎప్పుడు ముందుంటుంది. వీటితో పాటు నెట్ ఫిక్స్ ఒరిజినల్స్ అంటూ వచ్చే సిరీస్ లు , సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా మెప్పించాయి. ఇక ఇప్పటివరకు లేని విధంగా.. కేవలం ఒక వెబ్ సిరీస్ కు కూడా భారీ బడ్జెట్ కేటాయించి అద్భుతంగా చూపించొచ్చని.. హీరమండి వెబ్ సిరీస్ తో ప్రూవ్ చేసింది నెట్ ఫ్లిక్స్. ఇక ఇప్పుడు మరో భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. మరి ఈ సిరీస్ ఏంటి.. దేని గురించి ఉండబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

నెట్ ఫ్లిక్స్ అందించబోతున్న ఈ భారీ బడ్జెట్ సిరీస్ పేరు “ది రాయల్స్”. ఈ సిరీస్ లో చాలా మంది బాలీవుడ్ నటీ నటులు నటించబోతున్నారు. భూమి పడ్నేకర్, ఇషాన్ ఖట్టర్, జీనత్ అమన్, నోరా ఫతేహి, చుంకీ పాండే, సాక్షి తన్వర్, డీనో మోరియా, మిలింద్ సోమన్ లాంటి మరెంతో మంది.. ఈ సిరీస్ లో నటిస్తున్నారు. కాగా ఈ సిరీస్ కు ప్రియాంకా ఘోష్, నుపురు ఆస్థానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ను గమనిస్తే.. సిరీస్ టైటిల్ కు తగినట్లే.. చాలా రిచ్ విజువల్స్ కనిపించాయి. ఈ సిరీస్ మొత్తం కూడా 8 ఎపిసోడ్స్ గా ఉండనున్నట్లు సమాచారం. మరి ఈ సిరీస్ ను ఎన్ని లాంగ్వేజ్స్ లో ప్రేక్షకులు ముందుకు తీసురానున్నారు.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు లాంటి విషయాలపై.. త్వరలోనే అప్ డేట్ ఇవ్వనున్నారు మేకర్స్.

ఇక ది రాయల్స్ విషయానికొస్తే.. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ను గమనిస్తే.. ఇది సేమ్ ఇంగ్లీష్ లో వచ్చిన ది బ్రిడ్జర్టన్ సిరీస్ లా ఉందంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ రొమాంటిక్ పీరియాడిక్ డ్రామాస్ లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుందని ఆశిస్తున్నారు ప్రేక్షకులు. ఇక వీటితో పాటు ఈ సిరీస్ లోని నటి నటులు భూమి పడ్నేకర్, ఇషాన్ ఖట్టర్ మధ్య ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయనే ఆసక్తి కూడా నెలకొంది. ఇక ఈ సిరీస్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి నెట్ ఫ్లిక్స్ నుంచి రాబోతున్న ‘ది రాయల్స్’ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.