iDreamPost
android-app
ios-app

రీసెంట్ గా OTT లో దూసుకుపోతున్న సినిమాలు/సిరీస్ లు ఇవే ! మీరు కానీ మిస్ చేశారా ?

  • Published Jun 22, 2024 | 1:32 PM Updated Jun 22, 2024 | 1:45 PM

Recent OTT Telugu Movies: ఓటీటీ లో ప్రతి వారం చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ.. అందులో ప్రత్యేకించి తెలుగు సినిమాల కోసం మాత్రమే సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. కాబట్టి రీసెంట్ గా ఓటీటీ లో రిలీజ్ అయినా ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

Recent OTT Telugu Movies: ఓటీటీ లో ప్రతి వారం చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ.. అందులో ప్రత్యేకించి తెలుగు సినిమాల కోసం మాత్రమే సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. కాబట్టి రీసెంట్ గా ఓటీటీ లో రిలీజ్ అయినా ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

  • Published Jun 22, 2024 | 1:32 PMUpdated Jun 22, 2024 | 1:45 PM
రీసెంట్ గా OTT లో దూసుకుపోతున్న సినిమాలు/సిరీస్ లు ఇవే ! మీరు కానీ మిస్ చేశారా ?

ఈ మధ్య కాలంలో ఓటీటీ లో వచ్చే సినిమాలన్నిటిని ప్రేక్షకులు ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎంత అన్ని భాషాల చిత్రాలను ఆదరిస్తున్న సరే.. తెలుగు సినిమాలను చూస్తే ఆ కిక్ ఏ వేరు ఉంటుంది. ఓటీటీ లో ప్రతి వారం చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ.. అందులో ప్రత్యేకించి తెలుగు సినిమాల కోసం మాత్రమే సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇతర భాషలలో ఎన్ని సినిమాలు , సిరీస్ లు వచ్చినా కానీ.. తెలుగు సినిమాలు , సిరీస్ లు ఎప్పటికీ ప్రత్యేకమే. మరి ఈ క్రమంలో రీసెంట్ గా ఓటీటీ లోకి వచ్చిన ఈ తెలుగు సినిమాలను, సిరీస్ లను చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమాలన్నిటి గురించి గత కొన్ని రోజులుగా వింటూనే వస్తున్నాం. అయినా సరే ఇంకా ఈ తెలుగు సినిమాలను , సిరీస్ లను మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఆ సినిమాలేంటంటే..

బాక్ :

గ్లామరస్ గర్ల్స్ తమన్నా, రాశీ ఖన్నా కలిసి అందంగా భయపెట్టిన సినిమా బాక్. ఇది తమిళంలో సూపర్ హిట్ అయినా కూడా తెలుగులో థియేటర్స్ లో అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులు.. ఊహించినట్లుగానే ఓటీటీ లో బాగానే ఆదరిస్తున్నారు. జూన్ 21 నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను లైట్ తీసుకుంటే మాత్రం వెంటనే చూసేయండి.

Baak Movie

యక్షిణి వెబ్ సిరీస్ :

వెబ్ సిరీస్ లంటేనే ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటిది తెలుగులో డైరెక్ట్ గా వెబ్ సిరీస్ వస్తుంది అంటే ఇక ఆ సిరీస్ ను ఏ రేంజ్ లో హైలెట్ చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులోను హర్రర్ ఫాంటసీతో వచ్చే వెబ్ సిరీస్ లు తెలుగులో ఉంటె ఇక దానిని అసలు మిస్ చేయకుండా చూడాల్సిందే. ఈ సిరీస్ ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి వెంటనే చూసేయండి.

Yakshini

పరువు వెబ్ సిరీస్:

ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్టర్స్ , ట్రైలర్ రిలీజ్ అయినపుడు.. ఈ వెబ్ సిరీస్ ప్రేమ పరువు హత్యలకు సంబంధించిందని అంతా భావించారు. కానీ అసలు ఈ సిరీస్ కథేంటో ఓసారి చూస్తే కానీ అర్థంకాదు. అటు ఇటుగా ప్లాట్ అదే అయినా కూడా కాస్త డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్ నే చూపించారు మేకర్స్ . రెగ్యులర్ స్టోరీ అని లైట్ తీసుకుంటే మాత్రం పొరపడినట్లే.

Paruvu

రష్:

ఈటీవీ విన్ డైరెక్ట్ గా తీసుకొచ్చిన సినిమా రష్. తెలుగులో డైరెక్టర్ రవి బాబు కథ , స్క్రీన్ ప్లే కి సెపరేట్ స్టైల్ ఉంటుంది. ఈ సినిమా కూడా రవి బాబు కథ అందించినదే. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా.. వారం నుంచి ఓటీటీ ని ఒక ఊపు ఊపేస్తోంది. సో ఈ సినిమాను కనీసం ఈ వీకెండ్ అయినా చూసి ఎంజాయ్ చేసేయండి.

మరి తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కొత్త కథలను ఇప్పటివరకు లైట్ తీసుకుంటే కనుక.. అసలు మిస్ కాకుండా చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Rush movie

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి