iDreamPost
android-app
ios-app

Mr. Bachchan: అఫీషియల్ : మిస్టర్ బచ్చన్ OTT పార్ట్నర్ ఫిక్స్

  • Published Jul 28, 2024 | 4:13 PMUpdated Jul 28, 2024 | 4:13 PM

ఈ మధ్య కాలంలో ఇంకా సినిమాలు థియేటర్ లో రిలీజ్ కాకముందే.. ఆయా సినిమాల ఓటీటీ పార్ట్నర్స్ ఫిక్స్ అయిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న రవి తేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో ఇంకా సినిమాలు థియేటర్ లో రిలీజ్ కాకముందే.. ఆయా సినిమాల ఓటీటీ పార్ట్నర్స్ ఫిక్స్ అయిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న రవి తేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 28, 2024 | 4:13 PMUpdated Jul 28, 2024 | 4:13 PM
Mr. Bachchan: అఫీషియల్ : మిస్టర్ బచ్చన్ OTT పార్ట్నర్ ఫిక్స్

థియేటర్ లో రిలీజ్ అయినా ఏ సినిమా అయినా… థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని.. ఓటీటీ లో అడుగుపెట్టాల్సిందే. ఒకవేళ థియేటర్స్ లో ఆయా సినిమాలు అంతగా బజ్ సంపాదించుకోలేకపోయినా కూడా.. ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చాక మాత్రం.. విపరీతమైన బజ్ తెచ్చుకుంటున్నాయి. దీనితో మూవీ మేకర్స్ కూడా థియేట్రికల్ రిలీజ్ కు ముందే.. ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకుంటున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకుంటున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రవి తేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ కూడా యాడ్ అయింది. మరి ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ గురించి చూసేద్దాం.

మాస్ మహారాజ్ రవి తేజ మూవీస్ అంటే ఫ్యాన్స్ కు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. ప్రస్తుతం ఫ్యాన్స్ అంతా.. విక్రమార్కుడు రీరిలీజ్ హైప్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే రవి తేజ నెక్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ గురించి సాలిడ్ అప్ డేట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. ఎలాగూ ఈ అప్ డేట్ వచ్చిన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను గురించి భారీ డిస్కషన్ ఏ జరిగింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ‘మిస్టర్ బచ్చన్’ రైట్స్ రూ.19.50 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అది కాస్త ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. తాజాగా వచ్చిన టీజర్ అనౌన్సుమెంట్ పోస్టర్ లో ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు అఫీషియల్ లోగోతో పొందుపరిచారు.

Mr Bachan

ఇక మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగష్టు 15 న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. మూవీ టీమ్ త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. ఇంకా ఈ సినిమాపై మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. ఇక విడుదల తర్వాత ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి