iDreamPost
android-app
ios-app

నెలలోపే OTT లోకి మిస్టర్ బచ్చన్.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!

  • Published Aug 23, 2024 | 6:20 PM Updated Updated Aug 23, 2024 | 6:20 PM

Mr Bachchan Movie OTT Streaming: రవి తేజ మిస్టర్ బచ్చన్ మూవీ.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దీనితో అప్పుడే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి బజ్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Mr Bachchan Movie OTT Streaming: రవి తేజ మిస్టర్ బచ్చన్ మూవీ.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దీనితో అప్పుడే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి బజ్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 23, 2024 | 6:20 PMUpdated Aug 23, 2024 | 6:20 PM
నెలలోపే OTT లోకి మిస్టర్ బచ్చన్.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!

థియేటర్ లో గత వారం భారీ అంచనాల మధ్యన మూడు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటితో పాటు ఓ తమిళ సినిమా కూడా రిలీజ్ అయింది. వాటి గురించి అందరికి తెలిసే ఉంటుంది. అయితే వీటిలో అన్నిటికంటే ఎక్కువగా రవి తేజ మిస్టర్ బచ్చన్ కు టీజర్ రిలీజ్ తర్వాత విపరీతమైన బజ్ ఏర్పడింది. కానీ భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయినా ఈ సినిమా .. ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దీనితో అప్పుడే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ బజ్ వినిపించేస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా ఓటీటీ డీల్ కు సంబంధించిన అప్ డేట్ గురించి తెలుసుకున్నాం. మరి ఈ మూవీ ఓటీటీ లోకి ఎప్పుడు రానుందో చూసేద్దాం.

సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా నటి నటులు సినిమాలు తీస్తూనే ఉంటారు. అలానే హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా ఆయా సినిమాలు థియేటర్లో విడుదలైన రెండు నెలల లోపే ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తూ ఉంటాయి. బాగా హిట్ అందుకున్న సినిమాలైతే రెండు నెలలు.. యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలైతే నెల లోపే ఓటీటీ లో ప్రతయక్షమౌతుంటాయి. అయితే కొన్ని సార్లు థియేటర్లో ప్లాప్ అయినా ఓటీటీ లో మాత్రం సూపర్ సక్సెస్ అవుతాయి. దీనితో ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మూవీని కూడా నెలలోపే ఓటీటీ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేయగా.. సెప్టెంబ‌ర్ 12 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసురానున్నట్లు సమాచారం. దాదాపు ఈ డేట్ ఫిక్స్ అయినట్లే. త్వరలో ఈ విషయంపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.

mr bachan

అసలే ఓటీటీ లు పెరిగిపోయిన తర్వాత.. అది ఏదైనా భారీ సినిమా అయితేనో.. లేదా తమ అభిమాన హీరో అయితేనో థియేటర్స్ వరకు వెళ్తున్నారు. లేదంటే చాలా వరకు ఓటీటీ ల మీదే ఆధారపడుతున్నారు. ఇక మిస్టర్ బచ్చన్ కు మొదటి నుంచి నెగెటివ్ టాక్ రాడంతో.. ఓటీటీ లోకి ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇక కొన్ని సినిమాలు ఓటీటీ లో హిట్ అవుతున్నాయి కాబట్టి.. మిస్టర్ బచ్చన్ కు కూడా అలాంటి ఛాన్స్ లేకపోలేదు. మరి ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో వేచి చూడాలి. మరి మిస్టర్ బచ్చన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.