Mr Bachchan Movie OTT Partner Netflix: రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ వచ్చేది ఆ OTTలోకే..

రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ వచ్చేది ఆ OTTలోకే..

Mr Bachchan Movie OTT Partner Details: రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీకి ఆగస్టు 14నే స్పెషల్ షోస్ వేశారు. ఈ స్పెషల్ షోస్ వల్ల మూవీ ఏ ఓటీటీలోకి రాబోతోంది అనే విషయం అయితే క్లారిటీ వచ్చింది.

Mr Bachchan Movie OTT Partner Details: రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీకి ఆగస్టు 14నే స్పెషల్ షోస్ వేశారు. ఈ స్పెషల్ షోస్ వల్ల మూవీ ఏ ఓటీటీలోకి రాబోతోంది అనే విషయం అయితే క్లారిటీ వచ్చింది.

మిస్టర్ బచ్చన్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హాట్ టాపిక్ అయిపోయింది. హరీశ్ శంకర్- మాస్ మహారాజ రవితేజ- భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ విడుదల అవుతోంది. అయితే ఆగస్టు 14 సాయంత్రం 7 గంటలకే స్పెషల్ షోస్ కూడా వేశారు. ఈ మూవీ ఎలా ఉంది? అనే ఆసక్తితో పాటుగా మిస్టర్ బచ్చన్ సినిమా ఏ ఓటీటీలోకి రాబోతోంది అనే ప్రశ్న కూడా ఆడియన్స్ లో ఉంది. ఎంత థియేటర్లో చూసినా కూడా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ మూవీ ఏ ఓటీటీలోకి రాబోతోందో చూద్దాం.

మిస్టర్ బచ్చన్ సినిమాని హిందీలో వచ్చిన రైడ్ మూవీకి రీమేక్ గా తీసుకొచ్చారు. ఇది పేరుకే రీమేక్ అని చెప్పాలి. కానీ, హరీశ్ శంకర్ మొత్తం కథను మార్చేశాడు. ఇదే విషయాన్ని ప్రమోషన్స్ లో కూడా పదే పదే చెబుతూ వచ్చారు. అంతేకాకుండా.. మిస్టర్ బచ్చన్ మూవీకి ముందు రైడ్ మూవీని చూసిం రండి అని కూడా హరీశ్ శంకర్ ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అప్పుడే ఇది రీమేక్ అనే భావన ప్రేక్షకుల్లో పోతుంది అని చెప్పాడు. ఇప్పటి వరకు వచ్చిన అప్ డేట్స్ అన్నీ చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. అందుకే ఫ్యాన్స్, సినిమా అభిమానులు ఎలా ఉంటుందో అనే ప్రశ్నను పక్కన పెట్టేసి ఏ ఓటీటీలోకి రాబోతోంది అని అడుగుతున్నారు.

గతంలో అంటే మూవీ ఏ ఓటీటీలోకి రాబోతోంది అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించే వరకు తెలిసే అవకాశం ఉండదు. కానీ, మూవీలో డిజిటల్ మీడియా పార్టనర్స్ కు క్రెడిట్స్ ఇస్తారు. ఆ విధంగానే సిల్వర్ స్క్రీన్ మీద బొమ్మ పడగానే ఏ ఓటీటీలోకి రాబోతోంది అనే విషయం తెలిసిపోతోంది. ఇలాగే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ వచ్చే ఓటీటీ కూడా తెలిసిపోయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది అని క్లారిటీ వచ్చేసింది. అయితే ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చెప్పే పరిస్థితి లేదు. అది వాళ్లు చేసుకున్న అగ్రిమెంట్ ఆధారంగా డిసైడ్ చేస్తారు. అలాగే మూవీ థియేటర్ రన్ ని బట్టి కూడా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని ఫిక్స్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే మిస్టర్ బచ్చన్ వచ్చేది నెట్ ఫ్లిక్స్ లోకి అని క్లారిటీ వచ్చింది. మరి.. మిస్టర్ బచ్చన్ మూవీ ఎలా ఉండబోతోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments