బోరింగ్ గా మీర్జాపూర్ 3.. ఇలా చుట్టేస్తే ఎలా బాస్?

Mirzapur season 3 Not Making Any Noise: దేశం మొత్తం ఎదురుచూసిన మీర్జాపూర్ సీజన్ 3 రానే వచ్చింది. కానీ, వచ్చిందో పోయిందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అసలు ఆ సిరీస్ ఓటీటీలో ఉంది అనే ఆలోచన కూడా ఎవరికీ రావడం లేదు.

Mirzapur season 3 Not Making Any Noise: దేశం మొత్తం ఎదురుచూసిన మీర్జాపూర్ సీజన్ 3 రానే వచ్చింది. కానీ, వచ్చిందో పోయిందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అసలు ఆ సిరీస్ ఓటీటీలో ఉంది అనే ఆలోచన కూడా ఎవరికీ రావడం లేదు.

నవంబర్ 16, 2018.. ఒక సనంచలనమైన సిరీస్ విడుదలైంది. దేశం మొత్తం ఆ సిరీస్ గురించే మాట్లాడుకున్నారు. అది మరేదో కాదు.. మీర్జాపూర్. ఏ ఇద్దరు కలిసినా ఈ సిరీస్ గురించే మాట్లాడుకున్నారు. ఒక సిరీస్ గురించి ప్రేక్షకులు మాత్రమే కాదు.. దేశం మొత్తం మాట్లాడుకుంది. యువత దగ్గరి నుంచి ముసలి వాళ్ల వరకు ఈ వెబ్ సిరీస్ డైలాగ్స్ మీద రీల్స్, షార్ట్స్, మీమ్స్ అంటూ దేశాన్ని ఊపేశారు. నిజంగా అప్పటి వరకు వెబ్ సిరీస్లకు దేశంలో అంత క్రేజ్ లేదు. కానీ, మీర్జాపూర్ వచ్చాక అది మరిన్ని వెబ్ సిరీస్లు తీసేందుకు నమ్మకాన్ని ఇచ్చింది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు మీర్జాపూర్ పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు ఉందా లేదా అనే భావన కూడా కలుగుతోంది. అసలు ఎవరూ ఈ సిరీస్ గురించి మాట్లాడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మీర్జాపూర్ సిరీస్ వచ్చిన కొత్తలో మళ్లీ సీజన్ 2 వచ్చే వరకు అంతా ఈ సిరీస్ గురించి మాట్లాడుకున్నారు. ముఖ్యంగా సీజన్ 1 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అయితే ఆ తర్వాత సీజన్ 2 మీద చాలా అంచనాలు ఉన్నాయి. అంత భారీ అంచనాల నడుమ వచ్చిన సీజన్ 2 కాస్త నిరాశ పరిచిన మాట వాస్తవమే. అయితే ఎక్కువ అంచనాల వల్ల కాస్త డల్ అయ్యింది అని అనుకున్నారు. కానీ, ఇప్పుడు అసుల సీజన్ 3 గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. సీజన్ 2కి హైప్ తగ్గింది. సీజన్ 3కి అసలు హైప్ అనేది లేకుండా పోయింది. మొదట ఈ సీజన్ రిలీజ్ అవుతున్న సమయంలో కాస్త బజ్ ఏర్పడింది. ఈ సీజన్ అయినా బాగుంటుంది అని అంతా భావించారు. కానీ, ఈసారి మేకర్స్ మరింత నిరాశ పరిచారు.

మీర్జాపూర్ కి ఉన్న క్రేజ్, హైప్, ఫ్యాన్ బేస్ మొత్తాన్ని వాళ్లు చేతులారా నాశనం చేసుకున్నట్లు అయ్యింది. ఈ సీజన్ కి మంచి టాక్ రాకపోగా.. నెగిటివిటీ వచ్చి పడింది. దానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి మీర్జాపూర్ సిరీస్ కి ఇంత హైప్ రావడానికి కారణం వైలెన్స్. అవును మొదటి సీజన్లో ఉండే వైలెన్స్ కు అత్యంత ఆదరణ లభించింది. ముఖ్యంగా ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కానీ, ఈసారి యాక్షన్ కాకుండా.. మైండ్ గేమ్స్, పాలిటిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రెండో పాయింట్.. మీర్జాపూర్ అంటే కొన్ని పాత్రలు. మొదటి సీజన్లో బబ్లు పండిట్ పాత్రను లేపేశారు. ఆ తర్వాత సీజన్ 2 ఎండింగ్ లో మున్నా పాత్రను లేపేశారు.

ఇంక సీజన్ 3లో మొదటి 3 ఎపిసోడ్స్ వరకు కాలిన్ భయ్యా పాత్రనే చూపించలేదు. ఇలా క్యారెక్టర్స్ మొత్తం మిస్ అవుతుండటంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మూడో పాయింట్ డైలాగ్స్. మీర్జాపూర్ తొలి సీజన్ తో పోలిస్తే.. మూడో సీజన్ లో అంత స్ట్రాంగ్ ల్యాంగ్వేజ్ లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పచ్చు. అంటే మీమర్స్, యూత్, నెటిజన్స్ మీర్జాపూర్ కి హైప్ తీసుకురావడానికి ఉన్న కారణాల్లో డైలాగ్స్ కూడా ఒకటి. కానీ, ఈసారి అది కూడా కాస్త తగ్గడంతో అభిమానుల్లో ఆసక్తి కూడా తగ్గిపోయింది. మొత్తానికి మీర్జాపూర్ కి పాన్ ఇండియా లెవల్లో ఉన్న క్రేజ్ నని మేకర్స్ మాత్రం యూజ్ చేసుకోలేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వారిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఒక కథ ప్రారంభం అయ్యాక ఒకానొక పాయింట్లో ఎండ్ అవ్వాలి. అలాగే కొన్ని మలుపులు తీసుకోవాలి. అందులో భాగంగానే ఇలా కథను ముందుకు తీసుకెళ్లి ఉండచ్చు. మీర్జాపూర్ సీజన్ 3 చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments