iDreamPost
android-app
ios-app

OTT లోకి మన్మధుడు డైరెక్టర్ రీ ఎంట్రీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

  • Published Jul 10, 2024 | 8:23 AMUpdated Jul 10, 2024 | 8:23 AM

OTT Telugu Comedy Movie: ఓటీటీ లో కొత్త కంటెంట్ వచ్చేస్తుంది. కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయ్యి నెలలు గడిచిపోయినా కూడా ఓటీటీ లో అడుగుపెట్టడానికి మాత్రం ఎందుకో ఆలస్యం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే.

OTT Telugu Comedy Movie: ఓటీటీ లో కొత్త కంటెంట్ వచ్చేస్తుంది. కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయ్యి నెలలు గడిచిపోయినా కూడా ఓటీటీ లో అడుగుపెట్టడానికి మాత్రం ఎందుకో ఆలస్యం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే.

  • Published Jul 10, 2024 | 8:23 AMUpdated Jul 10, 2024 | 8:23 AM
OTT లోకి మన్మధుడు డైరెక్టర్ రీ ఎంట్రీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

ఎప్పుడెప్పుడు ఓటీటీ లో కొత్త సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల అయ్యే సినిమాలు కొన్నైతే.. థియేటర్ లో రిలీజ్ అయినా తర్వాత ఓటీటీ లోకి వచ్చే సినిమాలు మరికొన్ని. అయితే కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ లో విడుదల అయ్యి నెలలు గడిచిపోతున్నా కూడా ఓటీటీ లోకి రావు. ఇక ఇప్పుడు ఓటీటీ లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని. పాత సినిమాలను కూడా కొత్తగా ప్రమోట్ చేస్తూ.. ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఓటీటీ లో తాజాగా మరొక సినిమా విడుదల కానుంది. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

డైరెక్టర్ విజయ్ గురించి ఇప్పుడు ఎవరికీ తెలియకపోవచ్చు కానీ.. ఒకప్పుడు నువ్వే కావలి, నువ్వు నాకు నచ్చావ్ , మల్లేశ్వరి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఇండస్ట్రీకి అందించిన దర్శకుడు విజయ్. అయితే జై చిరంజీవి సినిమా తర్వాత విజయ్ ఖాతాలో అంతగా చెప్పుకోదగిన హిట్స్ ఏమి లేవు. దీనితో అతని కెరీర్ లో బాగానే గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలోనే గత ఏడాది శ్రీకమల్ ను హీరోగా పరిచయం చేస్తూ… విజయ్ జిలేబి అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా గత ఏడాది ఆగష్టు లో థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు సుమారు 11 నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వనుంది. జులై 13 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ లో స్ట్రీమింగ్ కానుంది. “గిలిగింతల జిలేబీ. మన ఆహా తప్పకుండా చూడండి. జూలై 13న ఆహాలో జిలేబీ ప్రీమియర్” అంటూ ఆహ సోషల్ మీడియాలో ప్రకటించింది.

ఇక ఈ సినిమాలో శివాని రాజశేఖర్ లీడ్ రోల్ లో నటించింది. ఆమెతో పాటు శ్రీ కమల్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, బొడ్డుపల్లి శ్రీను, సాయి కుమార్ బబ్లూ, అంకిత్ కొయ్య, వివా సన్నీ, చమ్మక్ చంద్ర లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక జిలేబి మూవీ కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో కమల్ అనే ఓ కుర్రోడికి.. భారతి అనే అమ్మాయితో.. పరిచయం అవుతుంది, క్రమంగా వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కుదురుతుంది. అయితే అదే వాళ్ళకి కొన్ని తిప్పలు తెచ్చిపెడుతుంది. భారతి ఓ రోజు అనుకోకుండా అబ్బాయిల హాస్టల్ లోకి వెళ్తుంది. ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే అది కుదరక అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది . దీనితో ఆమె కమల్ హెల్ప్ తీసుకుంటుంది. ఈ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి ! ఆ హాస్టల్ వార్డెన్ కు భారతి దొరికిపోతుందా ! కమల్ భారతికి ఎలాంటి హెల్ప్ చేస్తాడు ! ఇవన్నీ తెలియాలంటే “జిలేబి” అనే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఓటీటీ ప్రేక్షకులను ఈ మూవీ ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి