iDreamPost
android-app
ios-app

OTT లో ఇంకా స్ట్రీమింగ్ కు రాని మనమే మూవీ.. ఎప్పుడు వస్తుంది ?

  • Published Jul 22, 2024 | 3:57 PMUpdated Jul 22, 2024 | 3:57 PM

Maname Movie OTT Update: అదేంటో తెలియదు కానీ కొన్ని సినిమాలు మాత్రం చెప్పిన టైమ్ కు ఓటీటీ లో విడుదల కాకుండా.. ప్రేక్షకులను నిరాశ పరుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మనమే మూవీ కూడా యాడ్ అయింది. దీనితో ఈ సినిమా ఇప్పుడా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

Maname Movie OTT Update: అదేంటో తెలియదు కానీ కొన్ని సినిమాలు మాత్రం చెప్పిన టైమ్ కు ఓటీటీ లో విడుదల కాకుండా.. ప్రేక్షకులను నిరాశ పరుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మనమే మూవీ కూడా యాడ్ అయింది. దీనితో ఈ సినిమా ఇప్పుడా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

  • Published Jul 22, 2024 | 3:57 PMUpdated Jul 22, 2024 | 3:57 PM
OTT లో ఇంకా స్ట్రీమింగ్ కు రాని మనమే మూవీ.. ఎప్పుడు వస్తుంది ?

ఈ మధ్య కాలంలో దాదాపు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా నెల లోపే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. లేదా ఆయా సినిమాలకు ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ ను బట్టి.. థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని ఓటీటీ లోకి వస్తున్నాయి. అయితే వాటిలో చాలా వరకు సినిమాలన్నీ కూడా చెప్పిన టైమ్ కు చెప్పిన ఓటీటీ లోనే రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం చెప్పిన సమయానికి ఓటీటీ లో విడుదల కావు. దీనితో థియేటర్ లో ఆ సినిమాలను మిస్ అయ్యి.. ఓటీటీ లో చూద్దామని అనుకున్న వారికి నిరాశ ఎదురౌతుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఇలా నిరాశ పరచగా.. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి శర్వానంద్ నటించిన మనమే మూవీ కూడా యాడ్ అయింది. అసలు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు. అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

శర్వానంద్ , కృతి శెట్టి నటించిన మనమే మూవీ.. జూన్ 7 న థియేటర్ లో రిలీజ్ అయింది. రిలీజ్ కు ముందు ఈ సినిమా అందరికి చాలా ఇంట్రెస్టింగ్ గా.. ఓ కొత్త కాన్సెప్ట్ లా అనిపించింది కానీ.. రిలీజ్ తర్వాత మాత్రం ఈ మూవీ అందరి అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి షో నుంచి కూడా మిక్సెడ్ టాక్ నే సంపాదించుకోడంతో.. అనుకున్న రేంజ్ లో ఈ మూవీ హిట్ సాధించలేకపోయింది. దీనితో ఈ సినిమాను నెలలోపే ఓటీటీ లోకి తీసుకుని రానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని.. జూలై మొదటి వారంలో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు టాక్ వినిపించింది. కానీ అది జరగలేదు. ఆ తర్వాత జూలై 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీని స్ట్రీమింగ్ కానుందంటూ అధికారిక ప్రకటన వచ్చింది. కానీ అది కూడా జరగలేదు. దీనితో ఈ సినిమా ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

Maname

కాగా ఈ మధ్య రెండు మూడు పెద్ద సినిమాల విషయంలోను ఇదే జరిగింది. చెప్పిన టైమ్ కు చెప్పిన ఓటీటీ లో ఆయా సినిమాలు రాకుండా.. సడెన్ గా స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. మరి మనమే సినిమా విషయంలోనూ అలానే జరిగే అవకాశాలు లేకపోలేదు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న మరొక న్యూస్ ఈ మూవీ జూలై చివరి వారంలో రిలీజ్ అవ్వొచ్చు అని. మరి ఏ వార్త నిజమౌతుందో.. ఈ మూవీ ఎప్పటినుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందో వేచి చూడాలి. అయితే దాదాపు ఈ నెలలోనే మనమే మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి