Swetha
థియేటర్ లో రిలీజ్ అయినా కొన్ని సినిమాలు ఓటీటీ లోకి రాడానికి లేట్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో శర్వానంద్ నటించిన మనమే సినిమా విషయంలోను అదే జరిగింది. అయితే ఇక ఇప్పుడు ఈ సినిమా అఫీషియల్ డేట్ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీ లోకి వస్తుందో చూసేద్దాం.
థియేటర్ లో రిలీజ్ అయినా కొన్ని సినిమాలు ఓటీటీ లోకి రాడానికి లేట్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో శర్వానంద్ నటించిన మనమే సినిమా విషయంలోను అదే జరిగింది. అయితే ఇక ఇప్పుడు ఈ సినిమా అఫీషియల్ డేట్ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీ లోకి వస్తుందో చూసేద్దాం.
Swetha
ఈ వారం ఓటీటీ లోకి చాలానే సినిమాలు వచ్చాయి కానీ.. వాటి చూడదగిన తెలుగు సినిమాలు మాత్రం అంతగా లేవనే చెప్పి తీరాలి. దీనితో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందారు. కానీ వచ్చే వారం అలా కాదు.. వచ్చే వారం ఓటీటీ లో సందడి చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు , సిరీస్ లు రెడీ గా ఉన్నాయి. అయితే, ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా దాదాపు నెల రోజుల లోపే ఓటీటీ లో ఎంట్రీ ఇస్తుంటే కొన్ని సినిమాలు మాత్రం చాలా ఆలస్యంగా వస్తూ ఉంటాయి. దీనితో ఆయా సినిమాలను థియేటర్ లో మిస్ అయినా ప్రేక్షకులు నిరాశ చెందుతారు. రీసెంట్ గా శర్వానంద్ నటించిన మనమే సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయినా కానీ ఇంతవరకు అప్ డేట్ లేదు. అయితే ఈ మధ్య కాస్త ఓటీటీ బజ్ వినిపించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా అఫీషయల్ ఓటీటీ ఎంట్రీ వచ్చేసింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.
శర్వానంద్ , కృతి శెట్టి జంటగా నటించిన మనమే మూవీ.. జూన్ 7న థియేటర్ లో రిలీజ్ అయింది. ఫ్యామిలి మూవీస్ కు శర్వానంద్ పెట్టింది పేరు.. ఈ క్రమంలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటినుంచి.. అందరికి మంచి అంచనాలు పెరిగాయి. కానీ థియేటర్ రిలీజ్ తర్వాత మాత్రం ఈ సినిమా ఎందుకో అనుకున్న విధంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమాతో పాటు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా ఓటీటీ కి వచ్చాయి. ఈ సినిమా మాత్రం కాస్త లేట్ అయింది. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపించింది . అయితే కేవలం బజ్ మాత్రమే. ఇక తాజాగా ఈ సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా .. ఈ సినిమాను జులై 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు ఎంచక్కా ఓటీటీ లో చూసేయొచ్చు. మరి ఓటీటీ లో ఈ సినిమా ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.
ఇక మనమే సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ లో శర్వానంద్ ఎలాంటి బాధ్యతలు లేకుండా… గాలికి తిరుగుతూ, ఇష్టమొచ్చినట్లు తాగుతూ.. కనిపించిన అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ క్రమంలో శర్వానంద్ ఫ్రెండ్, అతని భార్య ఓ పనిమీద ఇండియా వెళ్లాల్సి వస్తుంది. అయితే అనుకోకుండా ప్రమాదవ శాత్తు ఒక యాక్సిడెంట్ లో వారు మరణిస్తారు. దీనితో వారి ఏకైక కొడుకు ఒంటరి వాడైపోతాడు. అతనిని శర్వానంద్ , కృతి శెట్టి పెంచాల్సి ఉంటుంది. అసలు ఎటువంటి బాధ్యత లేని శర్వానంద్ , అన్ని సరిగ్గా పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకునే కృతి కలిసి ఆ పిల్లాడిని ఎలా పెంచారు ! ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్యన ఎలాంటి బాండ్ ఏర్పడుతుంది. చివరకు ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.