iDreamPost
android-app
ios-app

OTT లోకి రీసెంట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మలయాళం కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 01, 2024 | 3:49 PM Updated Updated Aug 01, 2024 | 3:49 PM

OTT Comedy Movie : కామెడీ మూవీస్ కు ఈ మధ్య బాగా క్రేజ్ పెరుగుతుందన్న సంగతి తెలియనిది కాదు. మేకర్స్ కూడా ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకుని.. వరుసగా అలాంటి సినిమాలనే రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిపోతుంది. అది కూడా రెండు ఓటీటీ లలో స్ట్రీమింగ్ కు రానుంది.

OTT Comedy Movie : కామెడీ మూవీస్ కు ఈ మధ్య బాగా క్రేజ్ పెరుగుతుందన్న సంగతి తెలియనిది కాదు. మేకర్స్ కూడా ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకుని.. వరుసగా అలాంటి సినిమాలనే రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిపోతుంది. అది కూడా రెండు ఓటీటీ లలో స్ట్రీమింగ్ కు రానుంది.

  • Published Aug 01, 2024 | 3:49 PMUpdated Aug 01, 2024 | 3:49 PM
OTT లోకి రీసెంట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మలయాళం కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

అదేంటో ఏమో తెలియదు కాదు గత కొన్ని వారాలుగా ఓటీటీ లో వరుసగా కామెడీ మూవీస్.. ఊపందుకుంటున్నాయి. కనీసం వారానికి ఒక కామెడీ మూవీ అయినా ఓటీటీ లో రిలీజ్ అవ్వడంతో పాటు.. ట్రెండింగ్ లోకి కూడా వచ్చేస్తుంది. రెగ్యులర్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టి.. కాసేపు మనసారా నవ్వుకోవడానికి.. కామెడీ మూవీస్ కు మించిన ఆప్షన్ ఇంకోటి ఉండదు. దీనితో ఇప్పడు మేకర్స్ కూడా ప్రేక్షకుల ఇంట్రెస్ట్ కు తగినట్లుగానే వరుసగా కామెడీ మూవీస్ ను రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిపోతుంది. అది కూడా రెండు ఓటీటీ లలో స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ కామెడీ మూవీ మరేదో కాదు.. బీజుమీన‌న్‌, సూర‌జ్ వెంజ‌ర‌మూడు ప్రధాన పాత్రలలో నటించిన.. నాద‌న్న సంభ‌వం అనే మలయాళ మూవీ.. ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలకు పెరుగుతున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఈ సినిమాకు విష్ణు నారాయణన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా జూన్ 21న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. ఊహించని విధంగా సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. ప్రత్యేకించి బిజూ మీనన్ అభిమానులకు ఈ సినిమా ఇంకాస్త నచ్చేస్తుంది చెప్పి తీరాలి. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయిపోతుంది. అయితే రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో కాకుండా.. సింప్లి సౌత్ , మనోరమ మాక్స్ అనే ఓటీటీ లలో ఈ సినిమా ఆగష్టు 16 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది.

ఇక నాదన్న సంభవం.. కథ విషయానికొస్తే.. శంకరన్ ఉన్ని, రోషి అనే భార్య భర్తలు కొత్తగా ఓ గేటెడ్ కమ్యూనిటీలోకి షిఫ్ట్ అవుతారు. వారి ఎదురు ఫ్లాట్ లో.. అజిత్ , ధన్య అనే మరో జంట ఉంటారు. శంకరన్ ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉంటె.. రోషి జాబ్ చేస్తుంది. ఈ క్రమంలో ధన్యకు శంకరన్ కు పరిచయం ఏర్పడుతుంది. దీనితో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని.. అజిత అపార్థం చేసుకుంటాడు. అంతటితో ఆగకుండా అతనిపై లేని పోనీ రూమర్స్ క్రియేట్ చేసి.. చివరికి అతనిని జైలు పాలు చేస్తాడు. మరి ఈ గొడవలు ఎక్కడికి వరకు దారి తీశాయి? భర్త చేసిన పనికి ధన్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య ఏం జరుగుతుంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.