iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో ఈ 3 సినిమాలు అసలు మిస్ కాకండి.. అవేంటంటే!

  • Published Aug 26, 2024 | 1:48 PM Updated Updated Aug 26, 2024 | 1:48 PM

This Week Must Watch Movies In OTT: ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాల లిస్ట్ ఆల్రెడీ చూసేసి ఉంటారు. వాటిలో ఆ లిస్ట్ తో పాటు.. ఆ సినిమాలలో ఈ వారం అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలేంటో చూసేద్దాం.

This Week Must Watch Movies In OTT: ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాల లిస్ట్ ఆల్రెడీ చూసేసి ఉంటారు. వాటిలో ఆ లిస్ట్ తో పాటు.. ఆ సినిమాలలో ఈ వారం అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలేంటో చూసేద్దాం.

  • Published Aug 26, 2024 | 1:48 PMUpdated Aug 26, 2024 | 1:48 PM
ఈ వారం OTT లో ఈ 3 సినిమాలు అసలు మిస్ కాకండి.. అవేంటంటే!

గత వారం ఓటీటీ లో బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులోను తెలుగు సినిమాలు అవ్వడంతో.. స్ట్రీమింగ్ స్టార్ట్ అయినా కొద్దీ గంటల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. సో లాస్ట్ వీకెండ్ ప్రేక్షకులకు ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ సినిమాలతో గడిచిపోయింది. ఇక ఇప్పుడు మరో వారం వచ్చేసింది. ఆల్రెడీ ఈ వారం ఓటీటీ లో రిలీజ్ కాబోయే సినిమాల లిస్ట్ చూసే ఉంటారు. మరి వాటితో పాటు.. ఈ వారం ఓటీటీ లో అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలేంటో కూడా తెలుసుకుందాం. ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలు ఇవే

బడ్డీ:

కొంతకాలం గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ నటించిన మూవీ బడ్డీ. ఈ సినిమా ఆగష్టు 2న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజులలోపే ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయిపోతుంది. అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో సాగిన ఈ మూవీ లాంగ్ రన్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఆగస్ట్ 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీ లో ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి.

Buddy

ఐసీ 814: ది కాందహార్ హైజాక్:

ఫిక్షనల్ కథలతో పాటు.. కొన్నిసార్లు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి తెరకెక్కించిన కథలు కూడా.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతూ ఉంటాయి. ఈ ఐసీ 814: ది కాందహార్ హైజాక్ కూడా అలాంటిదే. దేశ చరిత్రలోనే అతి పెద్ద హైజాక్ గా చెప్పే.. కాందహార్ ప్లేన్ హైజాక్ పై రూపొందించిన సిరీస్.. “ఐసీ 814: ది కాందహార్ హైజాక్”. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. డిసెంబర్ 24, 1999లో ఈ భయంకరమైన ఫ్లైట్ హైజాక్ జరిగింది. ఈ వెబ్ సిరీస్ లో దానిని కళ్ళకు కట్టినట్లు చూపించనున్నారు. ఆగస్టు 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Ic84

ముర్షిద్ :

ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ పేరు..’ముర్షిద్’. ముంబై నగరాన్ని తమ ఆదీనంలో తెచ్చుకోవడం కోసం.. కొంతమంది గ్యాంగ్ స్టార్స్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనే గ్యాంగ్ స్టార్ డ్రామాగా ఈ సిరీస్ కొనసాగనుంది. ఆల్రెడీ ఓటీటీ లో ఇప్ప్పుడు ఎలాంటి సినిమాలకు బాగా క్రేజ్ పెరుగుతుంది. ఈ సిరీస్ కూడా ప్రేక్షకులను మెప్పించేస్తుంది. ఈ సిరీస్ ఆగస్ట్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఈ సినిమాను కూడా యాడ్ చేసుకోండి.

Murshid

ప్రస్తుతానికి ఈ వారం ఓటీటీ లో అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలు ఇవే. ఇక ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.