iDreamPost
android-app
ios-app

ఈ వారం OTTలో 26 అదిరిపోయే సినిమాలు, సిరీస్ లు.. ఆ మూడు మస్ట్ వాచ్

  • Published Sep 09, 2024 | 2:30 PM Updated Updated Sep 10, 2024 | 1:28 PM

This Week OTT Releases : ప్రతి వారం లానే మరొక వారం వచ్చేసింది. మూవీ గత వారం బాగానే తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఈ వారం ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

This Week OTT Releases : ప్రతి వారం లానే మరొక వారం వచ్చేసింది. మూవీ గత వారం బాగానే తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఈ వారం ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

  • Published Sep 09, 2024 | 2:30 PMUpdated Sep 10, 2024 | 1:28 PM
ఈ వారం OTTలో 26 అదిరిపోయే సినిమాలు, సిరీస్ లు.. ఆ మూడు మస్ట్ వాచ్

ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ముందుంటున్నాయి. ప్రతి వారం కొత్త కొత్త సినిమాలతో సిరీస్ లతో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ కళకళలాడుతున్నాయి. వారం వారానికి కొత్త కొత్త అప్ డేట్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. పైగా ప్రేక్షకుల ఇంట్రెస్ట్ ను బట్టి.. మేకర్స్ వారికి నచ్చిన జోనర్ చిత్రాలను రూపొందిస్తూ మెప్పిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఓటీటీ లో తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వడం విశేషం. చూడబోతుంటే రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి కంటెంట్ వస్తుందో.. అవి ఎలా ఉండబోతాయో చూడాలి. ఇప్పటికే థియేటర్ లో రిలీజ్ కానీ సినిమాలకు కూడా .. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ముందుగానే డీల్ కుదుర్చుకుని.. నెల లోపే ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాయి. కాబట్టి ఇంకా మంచి కంటెంట్ ఓటీటీ లో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉందని చెప్పి తీరాలి.  ఇక ఇప్పుడు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించటానికి మరొక వారం వచ్చేసింది. మరి ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాలేంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోయే సినిమాలు, సిరీస్ లు ఇవే

నెట్ ఫ్లిక్స్:

  • ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 4 పార్ట్ 2 ( వెబ్ సిరీస్) – సెప్టెంబర్ 12
  • మిస్టర్ బచ్చన్ (తెలుగు మూవీ) – సెప్టెంబర్ 12
  • సెక్టార్ 36 – సెప్టెంబర్ 13
  • ఆయ్ (తెలుగు మూవీ) – సెప్టెంబర్ 12
  • ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ – సెప్టెంబర్ 13
  • మిడ్‌నైట్ ఎట్ ది పెరా ప్యాలెస్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12
  • బ్రేకింగ్ డౌన్ ది వాల్ (డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 12
  • అగ్లీస్ (హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 13

ఈటీవీ విన్ :

  • కమిటీ కుర్రాళ్ళు (తెలుగు మూవీ)- సెప్టెంబర్ 12

సోనీలివ్ :

  • తలవాన్ – సెప్టెంబర్ 10
  • బెంచ్ లైఫ్ (తెలుగు వెబ్ సిరీస్)-సెప్టెంబర్ 12

జీ 5:

  • నునాకుజి – సెప్టెంబర్ 13
  • బెర్లిన్ – సెప్టెంబర్ 13
  • రఘుతాత – సెప్టెంబర్ 13

లయన్స్ గెట్ ప్లే:

  • లేట్ నైట్ విత్ డెవిల్ – సెప్టెంబర్ 13
  • ది రెంటల్ (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ మూవీ)- సెప్టెంబర్ 13

జియో సినిమా:

  • జో తేరా హై వో మేరా హై – సెప్టెంబర్ 9
  • కల్‌బరి రికార్డ్స్ (హిందీ చిత్రం)- సెప్టెంబర్ 12

ఆహా తమిళ్:

  • నంబన్ ఒరువన్ వంత పిరగు (తమిళ కామెడీ మూవీ)- సెప్టెంబర్ 13

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :

  • గోలి సోడా రైజింగ్ (తెలుగు డబ్బింగ్  వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 13
  • హౌ టు డై ఎలోన్- సెప్టెంబర్ 13
  • ఇన్ వోగ్ ది 90స్ (డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 13
  • లెగో స్టార్ వార్స్: రీబిల్డ్ ది గెలాక్సీ (ఇంగ్లీష్ చిత్రం)- సెప్టెంబర్ 13

అమెజాన్ ప్రైమ్ :

  • విశేషం (మలయాళ కామెడీ మూవీ)- సెప్టెంబర్ 10
  • ది మనీ గేమ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 10
  • రూపాంతర (కన్నడ అంథాలజీ మూవీ)- సెప్టెంబర్ 13

ఇక ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలైనా .. చిన్న సినిమాలైనా సరే ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సడెన్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ.. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నాయి. కాబట్టి వీకెండ్ లోపు ఇంకా ఎలాంటి సినిమాలు వస్తాయో వేచి చూడాలి.  అయితే వీటిలో ఆయ్, కమిటీ కుర్రాళ్ళు , మిస్టర్ బచ్చన్ సినిమాల మీదే అందరి ఫోకస్ ఉంది. థియేటర్ లో ఈ సినిమాలను మిస్ అయినా ప్రేక్షకులు.. ఓటీటీ లో అసలు మిస్ కాకుండా చూసేయండి. వీటితో పాటు డిఫరెంట్ మూవీస్ ఏమైనా చూడాలనుకుంటే మాత్రం.. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసుకుని రూపొందించిన సెక్టార్ 36 , బెర్లిన్ సినిమాలు బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ అవ్వొద్దు. మరి ఈ సినిమా అప్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.